విశాఖపట్నం

నిరీక్షణ (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషికి ఒక్కొక్క దశలో జీవితంలో నిరీక్షణ

తప్పదు. స్కూలుకి వెళ్లిన తన సంతానం

కోసం ఎదురు చూస్తుంది తల్లి. సంధ్యా

సమయంలో యమునా తీరంలో

కాకపోయినా ఏదైనా పార్కులో ఎదురు

చూస్తూ నూతన ప్రియునికోసం నిరీక్షిస్తుంది

ప్రియురాలు. మరి నిరుద్యోగి విషయమో

అతని తంతూ అంతే. అతను ఎదురు

చూసేది మరోటి.
వెనె్నల కోసం, చంద్రుని రాక కోసం

ఎదురు చూస్తున్న చకోర పక్షిలా, మేఘుడి

నుండి కిందకి నీటి బిందువు నేలమీద

పడకుండా మధ్యలోనే నీరు తెరచి ఆ నీటి

బిందువుల్ని తాగి దప్పిక తీర్చుకున్న

చాతక పక్షిలా, స్వాతివాన నీటి బిందువు

కోసం ఎదురు చూస్తున్న ముత్యపు

చిప్పలా ఉద్యోగానే్వషణలో మునిగి

తేలుతున్న నిరుద్యోగి ఉద్యోగం కోసం

నిరీక్షిస్తాడు. అలా ఎదురు చూస్తున్న

నిరుద్యోగుల్లో నేనూ ఉన్నాను.
మనిషికి తన జీవన బాటలో

పయనిస్తున్నప్పుడు ఎన్నో సవాళ్లు,

సమస్యలూ ఎదురయినా ఈ రోజు కంటే

రేపు బాగుంటుందని, తను అనుకున్న

వన్నీ జరగాలని అనుకుంటాడు. అటువంటి

ఆశావాద దృక్పథం లేకుంటే జీవితంలో

నిరాశ కలుగుతుంది.
ఆశ ఉన్న దగ్గర నిరాశ ఉంటుంది. ఆశ

నెరవేరుతుంటే సుఖం కలుగుతుంది. అదే

నిరాశ కలిగినప్పుడు దు:ఖం కలుగుతుంది.

ఈ ఆశ నిరాశలనేవి మనోవికారాల్లో భాగాలే.

ఈ నిరాశ, నిశ్పృహలు, సుఖసంతోషాలు

అనే ఈ మనోవికారాలు అందిరిలోనూ

ఉంటాయి.
ఆయా సంఘటనల్ని బట్టి, పరిస్థితుల్ని బట్టి

వాటి స్థాయిలో హెచ్చుతగ్గులుంటాయి.

అయితే అందరిలోనూ ఈ

భావావేశాలుంటాయి. కష్టం వచ్చినప్పుడు

కన్నీరు పెడ్తాము. సంతోషం వచ్చినప్పుడు

మనసారా నవ్వుకుంటాం. అయితే

కొంతమంది పరాజయం ఎదురవగానే

నిరాశలో కృంగిపోతారు. ఒత్తిడికి

లోనవుతారు.
ఈ ఒత్తిడిని మనస్సు మాత్రమే భరించలేదు.

శరీరంలోని ప్రతి భాగం ఈ ఒత్తిడిని

పంచుకుంటుంది. అందువల్లనే మనం

ఒత్తిడికి లోనయినప్పుడు మన శారీరక

చేష్టల ద్వారా ఆ ఒత్తిడిని వెల్లడి చేస్తాం. ఆ

ఒత్తిడి వల్ల అనేక అనారోగ్య సమస్యలు

ఎదుర్కోవలసి వస్తోంది.
మానవ జీవితం అంతా కష్ట సుఖాలు,

జయాపజయాలు, కలిమిలేముల

కలయికయే ఈ మానవ జీవితం. కష్టాలు,

అపజయాలు మన జీవిత చక్రాన్ని ఎలా

నడపాలో చెప్పాయి. అయితే ఒక్క విషయం

జీవితంలో జయం ఒక భాగమే కాని అది

ఎప్పుడూ జీవితానికి గమ్యం కాలేదు.

విజయానికి కావలసింది ప్రేరణ పది

శాతమయితే తొంభైశాతం కఠోర శ్రమ

కావాలి. దీని సాయంతోనే మనం

ముందుకు సాగాలి. ఇలా భావోద్వేగంతో

సాగిపోతున్నాయి నా ఆలోచన్లు.
ఈ భావుకలో విహరించడం తప్ప నేను ఏం

చేయగలను? నా కుటుంబ పరిస్థితులు

అటువంటివి. ఎగువ మధ్య తరగతి మనిషిని

కాను, దిగువ మధ్యతరగతి మనిషిని కాను.

ఎగువ, దిగువ కాని మధ్య నున్న మధ్య

తరగతి మనిషిని నేను. డిగ్రీ చేతికొచ్చినా,

మెరిట్ స్టూడెంట్‌నయినా, మేధస్సు ఉన్నా

రిజిర్వేషన్లు లేని సామాజిక వర్గానికి చెందిన

సగటు మనిషిని. నా విద్యార్హత, మెరిట్

మేధస్సు ఇవేమీ ఎందుకూ కొరగావు.

రికమండేషన్లు, రిజర్వేషన్లు దగ్గర అవి

వెలవెలబోవాల్సిందే.
పీతకష్టాలు పీతవే అన్నట్టు ఈ నా నిరుద్యోగ

జీవితం ఎంత దుర్భరమయినదో ఆ

జీవితాన్ని అనుభవిస్తున్న నాకు బాగా

తెలుసు. ఓ వయస్సు వచ్చిన తరువాత

స్వంతంగా సంపాదన లేక ప్రతిచిన్న

అవసరాలకి ఇంటి వాళ్లమీద ఆధారపడి

బానిస బతుకు బ్రతకడం ఎంత నికృష్టం.

చివరకి హెయిర్ కటింగ్‌కి, షేవింగ్‌కి,

ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోడానికి ఇంటి

వాళ్ల దగ్గర చేయిచాచే పరిస్థితి నన్ను ఎంతో

నూన్యతా భావానికి గురి చేస్తోంది. ఇది నా

ఒక్కడి సమస్యాకాదు. నాలాంటి

నిరుద్యోగుల సమస్య అంతా ఇదే.
ఒక్కొక్క పర్యాయం ఛీఛీ! ఎందుకొచ్చింది ఈ

బతుకు అనిపస్తుంది. అది క్షణకాలమే.

తిరిగి మనస్సులో ఆశ. ఏదో రోజున నేను

ఉద్యోగస్తుడిని అవుతానన్నదే ఆ ఆశ.

అదిలేకపోతే మనిషి మనగడే లేదు.
అదంతా ఎందుకు? మా ఇంటికి పేపరు

వేయడానికి వస్తారు పేపరు బాయ్‌లు.

చాలామంది పేపరు వేస్తామని అడుగుతారు

పేపరు వద్దు అంటే బతిమాలుతారు.

మనల్ని వదలరు. మా ఉద్యోగం

నిలపడానికైనా పేపరు తీసుకోండి అని

ప్రాధేయపడతారు. పేపరు

తీసుకుంటామేమోనని వాళ్ల కళ్లల్లో ఆశ.

వద్దని చెప్తే వాళ్ల కళ్లల్లో నిరాశ. వాళ్లని

చూస్తుంటే మనస్సంతా బాధతో

నిండిపోతుంది. ఆ చిన్న ఉద్యోగానికే

కాంపిటీషను.
ఆ ఉద్యోగం చేయడానికే టెన్తు క్లాసు వాళ్లు,

ఇంటర్ చదివిన వాళ్లే కాకుండా డిగ్రీ

చదివిన వాళ్లు కూడా పోటీ పడుతున్నారు.

నిరుద్యోగ సమస్య ఎంత తీవ్రమైనది?
ఇప్పుడు విద్యా విధానమే

భ్రష్టుపట్టిపోయింది. ప్రతి పల్లెటూరులో

కూడా వసతులు లేకపోయినా ఇంజనీరింగు

కాలేజీలు వెలిసాయి. నాణ్యత లేని

చదువులు నైపుణ్యం కొరవడుతున్నాయి.

అక్కడ చదివిన వారిలో ఏదో విధంగా విద్య

పూర్తి చేసి బయటికి వస్తే క్యాంపస్‌లో

సెలక్టు అయిన వాళ్లకి, ప్రతిభ నైపుణ్యం

రికమండేషను ఉన్న వాళ్లకే ఉద్యోగాలు,

మిగతా వాళ్లు రోడ్డున పడవలిసిందే.

లేకపోతే ఏదో చిన్న పని చేసుకుని రోజులు

నెట్టుకు రావలసిందే. పుట్టగొడుగుల్లా

పుట్టుకొచ్చిన ఈ ఇంజనీరింగు కాలేజీలన్నీ

రాజకీయ పలుకుబడి వున్న పెద్దల

చేతుల్లో ఉంటున్నాయి. నాణ్యత లేని

ఇలాంటి కాలేజీల వల్ల ఇంజనీరింగు

చదువుకే విలువలు పడిపోయాయి. అంతా

మేడిపండు వాటం.
ఎలక్షన్ల ముందర ప్రతి నిరుద్యోగికి నిరుద్యోగ

భృతి ఇస్తాం మా పార్టీ గెలిచిన తరువాత

అని వాగ్దానం చేసిన రాజకీయ పార్టీలు

గెలిచిన తరువాత చేసిన వాగ్దానాలన్నీ నీటి

మూటలే అవుతున్నాయి. ఎండమావిలో

నీటిని అనే్వషించడం ఎంత వ్యర్థమో

రాజకీయ నాయకుల మాటలూ,

వాగ్దానాలూ అంతే వ్యర్థమనిపించక

మానదు.
రిజర్వేషన్ల ముసుగులో ధనికులు మరింత

ధనికులవుతూ ఉంటే పేదవాళ్లు మరింత

పేదరికంలో మగ్గిపోతున్నారు. అసలైన

పేదవాళ్లకి సంక్షేమ పథకాల ఫలితాలు

అందటం లేదు. సామాజిక న్యాయం

జరగటం లేదు. ఆర్థిక అసమానతలు

అధికమయిపోతున్నాయి.
సమాజంలో కులాన్ని బట్టి కాక ఆర్థిక

పరిస్థితులు, అవసరాలను బట్టి ప్రభుత్వం

సదుపాయాలు కల్పిస్తే బాగుంటంది. ఈ

రిజర్వేషన్ల విషయంలో కూడా ఆచితూచి

అడుగు వేయాలి అని నేను అనుకుంటాను.
ఊహు! అది ఎన్నటికీ జరగని పని. దేశానికి

స్వాతంత్య్రం వచ్చి ఏడు పదులు కాలం

గడచినా ఇప్పటి వరకూ ఈ రిజర్వేషన్ల

ప్రక్రియ సాగుతూనే ఉంది. దీన్ని ఒక్కసారి

ఆపు చేస్తే సునామి వచ్చేయదూ? ఓట్ల

కోసమైనా ఈ రాజకీయ పార్టీలు ఈ

రిజర్వేషను విధానానికే మద్దతు

పలుకుతాయి. అందుకే అంటారు

వేసినప్పుడు వేప కొమ్మ, తీసినప్పుడు

అసిరమ్మ అని. రాజకీయం, సంపద ఈ

రెండూ అగ్నివంటివి. ఇవి మానవుని

అదుపులో ఉన్నంత వరకూ ఉపకరిస్తాయి.

అదుపు తప్పితే దహనం చేస్తాయి. ఇప్పుడు

నిరుద్యోగులు కూడా నిరాశగా ఇదంతా

తమ విధి రాత, మనం జీవితాన్ని

శాసించలేం. జీవితమే మనల్ని శాసిస్తుంది.

ఇలా శాశించేదే విధి. మనిషిలో మేధస్సు

ఉంది. ఇది అతనికి వరంగా, శాపంగా కూడా

మారుతుంది. మనకి తెలివితేటలున్నంత

మాత్రాన సరిపోదు. అది అవసరానికి

ఉపయోగపడటం లేదు. ప్రయోజకుడ్ని

చేయటంలేదు. ఓ ఉద్యోగం

సంపాదించడానికి ఉపయోగపడటంలేదు.

సమాజం ఎదుట ఇంత చదువుకున్నా

నన్ను నా తెలివితేటలు ఓ నిరుద్యోగిగా

నిలబెట్టాయి అని వాపోతున్నాడు ఓ

తెలివైన నిరుద్యోగి.
అతని పరిస్థితే అంతంత మాత్రంగా ఉంటే

సామాన్య తెలివితేటలు కలిగిన నిరుద్యోగుల

సంగతి ఇంకెంత దుర్బరంగా ఉంటుందో?

మానవ జనే్మ ఇంత. కష్టాలు

అనుభవించిన తరువాత మనిషిలో నిరాశ,

నిస్పృహ చోటు చేసుకోవటం సహజం.

ఇటువంటి పరిస్థితిలో మనిషికి దేని మీదా

ఆసక్తి ఉండదు. తన జన్మ

నిరర్థకమనుకుంటాడు. అతనిలో వైరాగ్యం

కలుగుతుంది. ఇప్పుడు నా పరిస్థితి కూడా

అలానే ఉంది. ఇలా ఆలోచిస్తున్నాను నేను.
అదంతా ఎందుకు? మధు విషయమే

తీసుకుంటే వాడు తన క్లాసుమేటు.

అత్తెసరు మార్కుల్తో డిగ్రీ సంపాదించాడు.

అయితే రిజర్వేషను ఉన్న సామాజిక వర్గం

వాడిది. అంతేకాదు పుష్కలంగా డబ్బు

పరపతి ఉన్నవాడు. రాజకీయంగా

పలుకుబడి ఉన్నవాడు. చెప్పాలంటే వాడికి

ఉద్యోగమే అవసరం లేదు. అటువంటి వాడు

ఉద్యోగం సంపాదించగలిగాడు. నేను

నిరుద్యోగిగా మిగిలిపోయాను. తిరిగి ఉద్యోగం

కోసం నా నిరీక్షణ ఆరంభమయింది. మధు

మీద ఈర్ష్య కాదు. సామాజిక వ్యవస్థ మీద

నాకు అసహ్యం, జుగుప్స. ఇక్కడ మధు

తెలివితేటల కన్నా అతని సామాజిక

వర్గానికి ఉన్న రిజర్వేషను సదుపాయం,

రాజకీయకంగా మధుకి ఉన్న పరపతి వల్ల

ఉద్యోగం వచ్చింది.
మనిషికీ మనిషికీ మధ్య ఆత్మీయత ఉంది.

ప్రేమ ఉంది. అభిమానం ఉంది. అనురాగం

ఉంది, అనుబంధం ఉంది. అయితే కొన్ని

స్వప్రయోజనాలు మనుష్యుల మధ్య విషం

చిమ్ముతున్నాయి. తిరిగి నా ఆలోచన్లు

ఇలా సాగుతున్నాయి.
మొదట ఇంటిని గెల్చి రచ్చ గెలవాలంటారు.

నా కుటుంబ పరిస్థితులు, నా గురించి

ఆలోచించకుండా సమాజం, ప్రపంచం, దేశం

గురించి ఆలోచిస్తున్నానేటి? నాలో నేనే

ప్రశ్నించుకున్నాను. సమాజంలో నేను

కూడా ఉన్నాను కదా. తిరిగి సర్ది

చెప్పుకున్నాను నామనస్సుకి. ఉద్యోగానికి

అప్లై చేయడానికి జిరాక్సులు పట్టుకుని

ఇంటివేపు బయలుదేరాను. తిరిగి నాలో

ఆలోచనలు ఆశ-దురాశ, నిరాశల మధ్యనే

జీవితం . జీవితం నిలవడం దుర్లభం, చివర

శ్వాస వరకు ఆశ వదలడు మనిషి. అయితే

దురాశ, నిరాశ జీవిత వృక్షానికి చెదల

వంటివి. అవి జీవితాన్ని కృంగదీయడానికి

పనికి వస్తాయి. అందుకే ఆశతో జీవించాలి.

ఎప్పటికైనా నాకూ మంచి రోజులు వస్తాయి

అన్న ఆశతో జీవించాలి.
నా ఆలోచనలు తిరిగి నా కుటుంబం,

జీవితం చుట్టూ తిరుగుతున్నాయి. నేను నా

తండ్రికి ఆర్థిక స్థోమత లేకపోయినా కానె

్వంటులో చదివాను. నా తల్లిదండ్రులు

నన్ను అంత ఖరీదయిన చదువు

చదివించారు తాము పస్తులున్నా.
చదువుకి తగ్గ ఉద్యోగం రాలేదు కాని

కడిగిన ముఖం ఎప్పుడయిన ఉద్యోగం

వస్తుందని నాన్నమ్మ కోరిక కోసం నాకు

మామయ్య కూతురు కమలతో పెళ్లి

జరిపించారు పెద్దలు. ఉద్యోగం లేకుండా పెళ్లి

చేసుకోవడం నాకు ఇష్టం లేకపోయినా

నానమ్మ ఎక్కువ రోజులు బతకదు. ఆమె

బతికుండగానే పెళ్లి జరిపించాలని పెద్దలు

మా పెళ్లి జరిపించారు.
కమలను చూస్తుంటే ఒక్కొక్క పర్యాయం

నాకు ఆమె మీద జాలి కలుగుతుంది. ఎన్నో

ఆశల్తో ఊహల్తో కోరికల వలయంతో నా

జీవిత భాగస్వామిగా వచ్చిన కమల ఏం

సుఖపడింది? తనను ఏం

సుఖపెట్టగలిగాను? సినిమాలకీ, షికార్లకీ

ఎలాగూ తీసుకెళ్లలేకపోయాను. కనీసం

మూరెడు మల్లెపూల దండేనా కొని

ఇవ్వలేని ఆర్థిక లోటు తనది. వాటికి కూడా

తండ్రి దగ్గర చేయి చాచే స్థితి నాది.
ఒక్కొక్క పర్యాయం విరక్త్భివం కలిగినా,

నిరాశ కలిగినా వ్యతిరేఖ భావాలు కలిగినా

ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యంతో భావాల్ని

అనుకూలంగా మార్చుకుని ఆశతో

ఉద్యోగానే్వషణలో ఉన్నాను నేను.

- గూడూరు గోపాలకృష్ణమూర్తి, పాల్‌నగర్, నాల్గవలైను, ప్లాటు నెంబరు-95 విజయనగరం-3. సెల్ : 7382445284.