రాజమండ్రి

రెక్కలు తొడిగిన ‘సిరిగమకాలు’ (పుస్తక పరిచయం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కవి సామాజిక స్పృహ అభ్యున్నతి కొరకు

సమాజంలో ఉన్న రుగ్మతలకు,

సమస్యలకు ప్రతిస్పందిస్తాడు. ప్రతి ఆలోచన

చేస్తాడు. ఆ ఆలోచనలతో వచ్చినవే

అనేకానేక ప్రక్రియలు, అవన్నీ సమాజ

గమనాన్ని, దిశను మార్చే ప్రయత్నంగా

చేసినవే. వ్యాకరణ ప్రక్రియలతో పద్యాన్ని

రాసి భేష్ అనిపించుకుని ఆగిపోలేదు. ఇంకా

అర్ధవంతంగా పండితుల నుంచి

పామరులకు సైతం అవగతం చెయ్యాలని

తపన పడుతున్నాడు కవి. కవిత్వాన్ని

ప్రజలకు మరింత చేరువ చేయాలని

అనేకానేక నూతన ప్రక్రియలకు నాంది

పలుకుతున్నాడు. ఆ కోవలోకి వచ్చినదే

‘రెక్కలు’ ప్రక్రియ. అభిరుచిని,

ప్రయోజనాన్ని ఆశించి లిఖిస్తేనే దాని లక్ష్యం

సఫలమవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో మంచి

ప్రాచుర్యంతో ఈ నూతన ప్రక్రియ

సుస్థిరమవుతోంది. ఇప్పటికే డబ్భైకి పైగా

పుస్తకాలు వెలువడటమే దానికి నిదర్శనం.

సుప్రసిద్ధ కవి సుగమ్‌బాబు ఈ రూపాన్ని

ప్రారంభించారు. ఆ దారిలోనే కళలవాడ

కాకినాడకు చెందిన డాక్టర్ వేదుల

శ్రీరామశర్మ ‘సిరిగమకా(నా)లు’ టైటిల్‌తో

పాఠకుల ముందుకు తెచ్చారు.
తెలుగు సాహిత్యంలో ఈ మధ్య కాలంలో

బాగా పట్టుదక్కించుకొన్న లఘు రూపం

‘రెక్కలు’. ఈ రెక్కల రూపంలో ఒక ప్రత్యేక్ర

ఉంది. రెండు భాగాలుగా ఉంటుంది. మొదటి

భాగంలో నాలుగు పాదాలు, రెండోభాగంలో

రెండు పాదాలు ఉంటాయి. చివర రెండు

పాదాలతో కవి చెప్పే విషయం పైన ఉన్న

నాలుగు పాదాల సారమన్నమాట. కవి

నైపుణ్యం దీనిమీదే ఆధారపడి ఉంటుంది.

డాక్టర్ శిరీష పేరుతో కవిత్వం రాసే

శ్రీరామశర్మ ఈ పుస్తకం నిండా

కనపడుతుంది. ఈ పుస్తకానికి

ముందుమాట రాసిన డాక్టర్ అద్దేపల్లి

రామ్మోహనరావు. ఈ నైపుణ్యంలో కవి

ఆలోచన, తాత్వికత వ్యక్తవౌతే సాధకుడికి

తేలిగ్గా అందితే ఆ రెక్క విఫలమవుతుంది.

పాఠకుడు ఊహించలేనిది చెప్తే అది

విజయవంతమవుతుంది. ఆ విషయాన్ని

ఈ పుస్తకంలో కనిపెట్టవచ్చు. అలతి అలతి

పదాలతో డాక్టర్ శిరీష గారు రాసిన ఈ

రెక్కల కవిత్వాన్ని హాయిగా చదువుకుని

ఆనందపడవచ్చు. నడక రెక్కలు శీర్షికన

‘మనసు/గానంతో/వయసు/్ధ్యనంలో-

బతుకు గీతం/నడక రాగమైం’దంటున్నారు.

మన గురించి మనతో చెప్పిన గొప్ప పద

వాక్యాలు ఇవి. ఎక్కడ సంచరిస్తున్నామో,

ఎక్కడ జీవిస్తున్నామో అక్కడ మన జీవిత

తడి జీరాడుతుంటుంది. అదెలాగో

చెప్తున్నారు..చూద్దాం.. ‘ప్రకృతి గుడి /

పలుకుబడిగా/బ్రతుకు తడి/ తల్లి ఒడిగా

నడవడి నడత/ ఒరవడి నడకతో’ మనం

నిత్యం కొలిచే ప్రకృతిని ఆరాధనీయం’గా

చేసుకుంటూ మాతృమూర్తి ఒడిలో బతుకు

తడిని నడత నడవడిలో నడక ఒరవడిని

గడపమంటే ఎంత గట్స్ కావాలో ఆరు

పాదాల్లో ఇమిడ్చారు. మనిషి సత్‌భావన

బావుంటే వ్యవస్థ ఎంత బావుంటుంటో కదా!

అదే శిరీష గారి భావం.
ఒక లౌకిక భావాన్ని మత సామరస్యాన్ని

ఎలా చెప్పారో ఈ రెక్కలు మన గుండెను

కప్పెస్తాయి. ‘గోపురం చర్చి/మసీదు తేడా

మర్చి/ కల్సి బతికే తేజం/ పక్షుల్లా

భారతీయం- త్రివిధ మనుషులు కలిస్తే/

త్రివర్ణ పతాక మనసులే’ దేశంలో వివిధ

కులాలు, మతాలు అందరూ కలిస్తే

ముచ్చటైన మూడు రంగుల మనసు జండా

అవుతుందంటున్నారు. నోరు మంచిదైతే

ఊరు మంచిదవుతుందంటారు..ఆ మంచిని

మరింత పెంచుతూ నడుస్తూ పోతే విజయం

సొంతమవుతుంది. ‘వికసిస్తూ/పెదాలు/

నడుస్తూ పాదాలు- సాధనలో విజయం/

ఆత్మీయ జీవనం’ మనిషి ఏది చేస్తే అది

దక్కుతుందంటారు ఈ రెక్కల్లో. నైతిక

విలువలు ఏ కాలానికైనా ఎంత అవసరమో

తప్పక చెప్పి భావం ఇది. ‘ఎవరైనా/ ఏ కీడు

చేస్తే/ తనకెంత బాధో/ తెల్సి వ్యధ- పరుల

కాకీడు చెయ్యక / పరమోత్తమ పరోపకారం’

అపకారికి నుపకారం నెపమెన్నడు

చెయ్యకన్న సుమతి కారుడు

గుర్తుకొస్తున్నాడు కదూ!. తెలుగు భాష

అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న మాట

నిజం. కవి శిరీష గాను చెప్తున్న హితోక్తి

ఇది..‘మాట్లాడుతూ/ అర్ధమయితే/పరాయి

భాషైనా/ మెదరు చేరేము!- మాతృభాష

మాట్లాటి/ మనసు గుడి చేరునుడి. ఎంత

బావుందో కదా!. ఇదే మాతృభాష మీద

ప్రేమ. డాక్టర్ శిరీష వైద్యులు కనుక

ఆరోగ్యాన్ని ప్రభోదించే రెక్కలు మరి విరివిగా

రాసారు. మనిషి అనారోగ్య సమస్యల్ని

అధిగమించడానికి ఇవి బాగా

తోడ్పడతాయి. ‘కళ్లలో చూస్తూ/ దూరం

భారమే/ కాళ్లతో చేర్తూ సుఖం తీరమే-

చేపట్టిన నడక పట్టుదల/ మనిషికి ఆరోగ్య

పర్వమే’ చూస్తుంటే దూరం భారంగానే

ఉంటుంది. అయితే నడవడం మొదలు

పెడితే లక్ష్యం చేరవవుతుందంటారు. ఎలా

అంటే పట్టుదలగా నడిస్తే అదే ఆరోగ్య

రహస్యం, ఇలాంటివి ఎన్నో ఈ పుస్తకంలో

కనిపిస్తాయి. ఆరు పాదాలు రెక్కల కవితలో

తొలి నాలుగు పాదాలు పక్షి నాలుగవయ

వాలయితే..చివర్నున్న రెండు పాదాలు

రెండు రెక్కలు. కవి ప్రభావమే కాదు..కవిత

ప్రభోదం ఇందులో మిక్కిలై ఉంటుంది.

ఇంతకు ముందే లఘు ప్రక్రియల్లో అనేక

కవితలు రాశారు. మినీ కవితలు, నానీలు,

మామీలు, హైకూలు ఇలా..
వాటిని సంపుటాలుగా కూడా

తీసుకువచ్చారు. ఇప్పుడు రెక్కల ప్రక్రియలో

సిరిగమకా(వా)లు తొలి సంపుటిగా

రెండువందల అరవైకి పైగా రెక్కలు మనల్ని

ఆహ్వానిస్తాయి. అక్షరాలలో ఎంత పొదపరో

పుటలలోను అంత పొదుపు పాటించారు.

చూపరులకు అందంగాను, పాఠకులకు

అనువుగాను చక్కగా అమర్చారు. లేదంటే

ఓ వంద పుటల పై మాటగానే ఈ సంపుటి

బరువు మోసేది. కవిత్వాన్ని ప్రియం

చేయకుండా విక్రయానికి అనువుగా

అందించే ప్రయత్నం చేసారు. తప్పక కొని

చదవతగిన పుస్తకం. సిరి విహంగాల

సరసన శిరీష గారి గమకాలు చూడొచ్చు.
- ప్రతులకు -
డా. వేదుల శ్రీరామశర్మ
66-5-20,
కరణంగారి జంక్షన్,
అశోక్ నగర్,
కాకినాడ -3
సెల్ - 98660 50220

- రవికాంత్, 96424 89244