రాజమండ్రి

ఎందుకు?.. ఎందుకు..? (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పచ్చదనాన్ని, ప్రాణవాయువులను
బహుమతిగా మీకందిస్తుంటే నేస్తం
బాధలెరుగని మమ్ముల్ని బాధలకు
గురిచేస్తావెందుకు నేస్తం
సెగలు పొగలు నిండిన
జగతిని నిందిస్తావెందుకు?

గాలి, నీరు, మట్టితో
హాయిగా, స్వతంత్రులుగా ఎదుగుతున్న

మమ్ము
పాపం, పుణ్యమని తలవక
నాశనం చేస్తావెందుకు?
మేము ప్రేమగా చూస్తే జీవితమంతా నీకు

సేవలు చేస్తామే నేస్తం.

పందిరి వేసి, తీగలు అల్లి,
పరవశంగా మేముంటే
కరుకు యంత్రాలతో కఠినంగా నరికి
కాలుష్యం... కాలుష్యమంటూ

రోదిస్తావెందుకు
నీ కష్టసుఖాలతో అండదండగా ఉన్న

మమ్ము
కాంక్రీటు వనాల కోసం నాశనం
చేస్తావెందుకు నేస్తం!

మా జాతులను రోజూ కూల్చేస్తూ
అవసరమున్నా, అవసరం లేకున్నా
అంతం చేస్తూ
వానచుక్క రాలలేదని వరుణ దేవుడిని
నిందిస్తావెందుకు
కూర్చొన్న కొమ్మ నరికిన అమాయకుడిలా
భూగోళములో వేడెక్కిస్తున్నావే నేస్తం.

వ్యాపారాల కోసం, వాణిజ్యాల కోసం
పెరుగుతున్న జనం కోసం.. స్వార్థంతో నీవు
పచ్చని గూడులు, చల్లని నీడలు
రోజురోజుకు మాయం చేస్తున్నావెందుకు ?
భావితరాల వారికి భూగర్భ గృహాలు
నిర్మిస్తున్నావెందుకు
బుద్ధుడు, అశోకుడు, గాంధీ,
థెరిసా, రామకృష్ణుడు
రమణుడు, వివేకానందుడు,
సాయిబాబాలు చెప్పినదే
అహింసోపరమో ధర్మ:
మూగజీవుల ఎడల కరుణ
ఉద్యానవన సంరక్షణలే...
జగతికి ఆదర్శములు నేస్తం...
- లక్కరాజు శ్రీనివాసరావు,
చరవాణి : 9849166951

క్షతగాత్రం..
సమాజ జీవన చిత్రం
మారుతున్న జీవన విధానం
అడుగడుగునా స్వార్థం
ఆర్థిక బంధనాల చీకటిలో
మానవ విలువలు భూసాయ్థపితం
క్షతగాత్రం సమాజ జీవన చిత్రం
తల్లి ప్రేమకీ, కన్నీటికీ
ఖరీదు కడుతున్న రాక్షసత్వం
వలస పక్షుల వైపు చూసి
మాతృభూమి గర్భశోకం
యంత్రాలతో పనిచేసీ చేసీ
మనిషి కూడా యంత్రంగా
మారాడన్నది నిజం
క్షతగాత్రం సమాజ జీవన చిత్రం
అడుగడుగునా ఎదురుదెబ్బలతో
కుంటి నడక నడుస్తున్న ఆదర్శం
అబద్ధాల తెరల వెనుక
క్షీణించిపోతున్న మానవత్వం
ఎదురుగా ఎన్ని ఘోరాలు జరిగినా
నాదాకా రాలేదుకదా..
అనుకునే అచేతనత్వం
క్షతగాత్రం సమాజ జీవన చిత్రం
ఏదీ ఈ ప్రశ్నకు సమాధానం?
ఎటువెదికినా అంతా చీకటిమయం
గురువులే మార్గదర్శకులై
చూపించే మెరుపుల దారిలో
మారాలి మన జీవన మార్గం
అప్పుడే సమాజం..
నవచైతన్య
సజీవ చిత్రం!
- ఇనగంటి సువర్ణ

ముసుగు!
మనందరికీ అన్నీ తెలుసు
బతకడమెలాగో
ఇంకా బాగా తెలుసు
ఐనా..
ఎందుకో ఎదుటివారితో గొడవ
ఇదొక ముసుగు!
నేను చేసేదే ఒప్పంటూ
నా అవసరాల్ని తీర్చేసుకుంటూ
ఆత్మగౌరవాన్ని అవతలకు నెట్టి
బలహీనుణ్ని అణచివేస్తూ
బ్రహ్మాండంగా బతికేస్తున్నానని
అనుకుంటున్నాను!
ఇది మరో ఆత్మవంచన ముసుగు!
స్నేహితునికి అభయమిచ్చి
అర్థించిన నాడు
కాదుపొమ్మంటే
అదో నమ్మకద్రోహమనే ముసుగు!
ఏదో సాధిద్దామని
ఆశయం అనే దురాశ కలిగితే
చిత్తశుద్ధి లేని
పదిమందినీ పోగుచేసి
గతానుభవాల్ని సమాధి చేసి
సమాజాన్ని ఉద్ధరిద్దామని
పయనిస్తే
ఇది కీర్తి కండూతి ముసుగు!
మార్పు అనివార్యం
అది మనోగతంతోనే సాధ్యం
అందుకే..
ఈ ముగుసులన్నిటినీ పెకలిస్తూ
ఈ క్షణం నుంచే
ఆత్మపరిశీలనతో
సాగాలి మన పయనం!!
- గోలి మధు,
చరవాణి : 9989186883

గోదావరి వైభవం

ఆ . కృష్ణపుష్కరముల తృష్ణతో మునుగంగ
కోరివచ్చె జనులు కొంతముందే
రెండు పుణ్యములను మెండుగ నొందంగ
ఆస పడెడి భక్త్ధ్యాసముక్తి

సీ. బుడి బుడి నడకల బుజ్జి తల్లులు తోడ
స్నాన మాడుటకొచ్చె సందడిగను
వృద్ధులు, పెద్దలు, ముద్దుల బాబులు
యువకులు, విపులు నావలొద్ద

సేవలోని ఫలము శేముషినిచ్చును
ప్రేమ నొంది తిమిగ లేమలకును
సాయమిచ్చి మేము సంతోషపడితిమి
హాయి యన్న యిదియె ఆత్మ తృప్తి

ఆపదలును బాపు అమ్మ గోదారమ్మ
వేడికోలు బలుకు వీడుకోలు
అందరకునుమేలు సుందరముగజేయు
అమ్మ గోదారమ్మ హర్ష మొలుక
- బిహెచ్‌వి రమాదేవి
రాజమహేంద్రవరం
సెల్: 9441599321

నల్లధనం
ఎన్నికలొచ్చాయంటే చాలు
సభలకే జనం జనం
ఈ రెండిటి విజయాలకు
నల్లధనమే సాధనం

పార్టీ ఫండు, సేవల దండు
కానుకలు, బహుమతులు
లెక్కకు చెందని అన్నీ కూడ
ఒక చోటుకు చేరే నల్లధనం

నల్లధనం దాచేందుకు
లేదు ఒక చోటంటూ
బాత్‌రూములు, గోడలు గొందులు
అన్నీ స్థావరాలే అందుకు

స్వదేశంలో నల్లధనానికి
మన లోగిళ్లే బ్యాంకులు
విదేశంలో నల్లధనానికి
స్విస్ బ్యాంక్‌లే దిక్కులు

నల్లధనం విన్యాసాలు
చెప్పడం ఎవరితరం
తలచుకొంటే జ్ఞప్తికి వస్తాయి
ప్రతి ఒక్కరికీ నిరంతరం
- దర్భా వెంకటేశ్వరశర్మ
పెద్దాపురం
సెల్: 9396224463