రాజమండ్రి

పితృదేవోభవ (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అది మా నాన్నగారి పదవీ విరమణ

సందర్భంగా ఆఫీస్ వారంతా ఏర్పాటుచేసిన

అభినందన సభ. చాలామంది జనం

వచ్చారు. అన్నయ్య, నేను కుటుంబాలతో

వెళ్లాం. ముందు వరుసలో కూర్చున్నాం.

అమ్మ, నాన్న ప్రముఖులతో కలసి

వేదికనలంకరించారు. గజమాలతో

సత్కరించారు తోటి సిబ్బంది.

మండలాధికారిగా పనిచేయటంతో వివిధ

మండలాల సిబ్బంది, గ్రామసర్పంచ్‌లు

వరుసగా నాన్నగారిని సత్కరిస్తున్నారు.

ఒక్కొక్కరు మైకు పట్టుకొని పొగడ్తలతో

సభను ముంచెత్తారు. నాకే సభలన్నా,

సన్మాన సత్కారాలన్నా కాస్త చిరాకు.

ఒంటరిగా పాటలు వింటూ ఉండటం చాలా

ఇష్టం. ఎంతసేపురా ఈ బాధ అన్నట్లు

కూర్చున్నాను. జనంతో సభ

కిటకిటలాడుతోంది. మా వెనుక వరుసలో

మాటలు వినబడుతున్నాయి. ‘ఎప్పుడు

సూడు జనాలకది చేస్తూ, రేషన్ కార్డుల

దగ్గర నుండి, హెల్త్ కార్డుల దాకా ఎవరికే

అవసరం వచ్చినా సాయం చేస్తూ తన తోటి

ఉద్యోగస్థులతో చేయించేవారు. ఒక్కపైసా

లంచం ఎవర్నీ ఇవ్వనిచ్చేవారు కాదు. కొత్త

సారెవరొస్తారో? ఎట్టాగుంటారో? అనుకుంటూ

మాట్లాడుతున్నారు. ఈసారొచ్చాక

మండలాన స్కూళ్లు, రోడ్లు బాగుపడ్డాయి.

కలెక్టర్ దొర కూడా ఈర్ని ఎంత బాగా

మెచ్చుకుంటున్నారో జనాల మాటలు

చెవుల పడ్తున్నాయి నాకు. అలా ఓ

మూడు గంటలు సాగింది సభ. అంతా

ఇళ్లకొచ్చేశాం.
ఓ ఐదేళ్లు గడిచాయి తీర్థయాత్రలు

తిరుగుతూ ప్రశాంత జీవనంలో వారు.

గుండెనొప్పితో హఠాత్తుగా మాకు

దూరమయ్యారు. మేము పేపర్లో వార్కి

శ్రద్ధాంజలి ఘటిస్తూ ఫొటో వేశాం. ఓ రోజు

మాకు ఫోనొచ్చింది. మా నాన్నగారి ఫొటో,

మరణం తెలుసుకొని వారి సంస్మరణార్థం ఓ

సభ జరుపుతున్నామని కొంతమంది

చెప్పారు ఫోన్లో. మీ కుటుంబ సభ్యులు

తప్పక రండి అంటూ పిలిచారు.

అన్నయ్యకేదో ముఖ్యమైన మీటింగ్

ఉండటంతో నన్ను ఆ సభకు తప్పనిసరిగా

వెళ్లమన్నాడు. ఇక తప్పలేదు వెళ్లాను. ఓ

మినీహాల్‌లో ఏర్పాటుచేశారు. పాతిక నుండి

ముప్ఫై దాకా జనాలున్నారు. నన్ను పేపర్లో

ఫొటో ద్వారా గుర్తుపట్టి పలకరించి లోపలికి

తీసుకెళ్లి కూర్చోపెట్టారు. వేదికపైన

నాన్నగారి తైలవర్ణ చిత్రం నా వెనుకే. నన్ను

దీవిస్తున్నట్టుగా ఉంది. వారి ఫొటోకి

దండవేసి దీపం వెలిగించమన్నారు.

దీపాన్ని వెలిగిస్తుంటే చేతులు వణికాయి.
ఒక్కొక్కరుగా వేదిక మీదకొచ్చి పేరు చెప్పి

పరిచయం చేసుకొని నాన్న గారి ద్వారా

తమ జీవితాలెలా మారాయో చెప్తున్నారు.

సురేష్ అనే అతను కొడిగొట్టి మసి

బారుతున్న మా జీవన దీపాన్ని నన్ను

చదివించి తన పరపతితో ఉద్యోగం వేయించి

మంటల పక్కన, వంటలక్కగా మారిన

అమ్మని ఆ పని మాన్పించి చల్లని ఇంట్లో

హాయిగా కూర్చోపెట్టి నేను ఆమెను

సేవించేలా చేశారు కన్నీళ్ల అభిషేకం సార్‌కి

అంటూ నాన్నగారు వాళ్ల కుటుంబానికి

చేసిన సాయం గురించి చెప్పారు. అలాగే

రిక్షా అతని కొడుకుని, తండ్రిని కోల్పోయి

దిక్కుతోచని స్థితిలో ఉన్న తమ

కుటుంబాన్ని పెద్ద కొడుకులా ఎంత సాయం

చేసింది ఓ తల్లి చెప్పింది. అలా అక్కడున్న

వ్యక్తులంతా వారికి నాన్నగారు మాట

సాయం, ధనసాయం ఇలా

చెప్పుకొస్తున్నారు. సభంటే ఇది. ఈ సభ

ద్వారా నాన్నగారి వ్యక్తిత్వం నాకర్థమైంది.

ఎప్పుడూ ఆఫీసే, ఇంట్లో ఉండరని లోలోపల

బాధపడే మాకు నాన్నగారెన్ని కుటుంబ

దీపాలకాసరాగా మారారో అర్ధమైంది. నాకో

పాఠం నేర్పించింది సభ.
నాది బ్యాంకులో ఉద్యోగం. జనాలతో

కౌంటర్‌లన్నీ బిజీగా ఉన్నాయి. లంచ్ బ్రే.

లంచ్ బాక్స్ తీసుకొని బయటకొచ్చాను.

ననే్న పరిశీలనగా, అపేక్షగా చూస్తున్న

పెద్దాయన. సార్! మీతో మాట్లాడాలి తిని

రండి. నేను కూర్చుంటా మీ కోసం

అన్నారాయన. పక్కనే ఉన్న దినకర్‌ను

అడిగిను. ఈ పెద్దాయన విజయం ఏంటి?

అది! సార్! ఆయనకు బాగా ఆస్తి ఉంది.
ఈమధ్య స్థలాలుంటే అమ్మేసి మన

బ్యాంకులో ఫిక్స్‌డ్‌లో పెట్టారు. ఆ విషయం

కోసం మీ సలహా అడుగుతారేమో

అన్నాడతను. భోజనం చేసి బయటకొచ్చి

వారితో మాట్లాడా! అలా ప్రతిరోజూ వచ్చి ఏదో

ఖాళీ టైం చూసుకొని నాతో మాట్లాడేవారు.

ఓ వారం వారు రాలేదు. వాళ్ల అబ్బాయి

ఫోన్ చేసి చెప్పాడు. నాన్నగారు ఆస్తిని

రెండు భాగాలు చేసి, మా ఇద్దరికి విడివిడి

అకౌంట్లలో వేయకుండా ఉంచారు. ఏమైనా

ఫ్యూచర్‌లో సమస్య వస్తుందా అని? నేను

వివరంగా మా అన్నదమ్ముల విషయం,

నాన్నగారి విషయం చెప్పాను. అతను

నమ్మలేదు. ఒకేమాట ఒకేబాట! ఈ రోజుల్లో

ఎలా సాధ్యం. సాగించుకుంటే స్వార్థం

రానీయకుంటే సాధ్యమే. మీరూ అలాగే

ఉండాలనే మీ నాన్నగారు అలా చేశారు.

మరి గ్రహించండి వారి మంచి ఆలోచన్ని

అన్నాను.
ఓ పదిరోజులకి మరలా ఫోన్ రెండో

అబ్బాయి చేశాడు. ఏమైంది మీ నాన్నగార్కి

బ్యాంకుకీ మధ్య వచ్చి చాలా రోజులయ్యింది

అన్నాను. అంకుల్! వారి దశ దిన కర్మ

రేపు. మీరంటే వారికి బాగా ఇష్టం

తప్పకుండా రండి అంటూ పెట్టేశాడు.

మర్నాడు ఆ ఇంటికి వెళ్లగానే మీరేనా

రవిగారంటే! మీ గురించి ఇంట్లో ప్రతీరోజూ

అందరినీ పిలిచి చెప్తుంటారు. ఎంత

క్రమశిక్షణ, నిజాయితీ! అతని

తల్లిదండ్రులెంత అదృష్టవంతులు! ఒక్క

పండు, స్వీటిచ్చినా ముట్టుకోరు పైగా! బాగా

నీర్సంగా ఉన్నారని, మజ్జిగో, టీనో ఇప్పించి

పంపిస్తారు. తన పని తనదే! బాతా ఖానీ

ఉండదు. దేశానికలాంటి వ్యక్తులే అవసరం.

మీరు నాలాగే ఏసాయం (మాట)

కావాలన్నా వారిని అడగండి. సార్ మాటలు

వింటుంటే ఓ పుస్తకం చదువుతున్నట్లుంది.

వారి లాగా మీ అన్నదమ్ములిరువురు

జీవించండి ఇలా మీ పేరు, మీ వ్యక్తిత్వం

ఇంట్లో అందరికీ చెప్పేవారు. అందుకే

ప్రత్యేకంగా మిమ్మల్నే పిలిచాము అన్నారు

వారి కొడుకులు. నాకొక్కసారిగా పైనున్న

నాన్నగారి దీవెనలే నాకీ గౌరవాన్ని

అందించాయనిపించింది. వారి వారసత్వపు

ఆస్తి. ఎనె్నన్నో కుటుంబాలను

సంస్కరిస్తోంది. తృప్తిగా అనిపించింది. వారి

అబ్బాయిలతో అదే అన్నాను. పెద్దవారి

అడుగుజాడలే మీకు శ్రీరామరక్ష అని.

- మధుపత్ర ఉప్పులూరి సెల్: 9440247596