హైదరాబాద్

వేగవంతమైన ఎల్‌ఇడి లైట్ల మార్పిడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగరం పరిధిలోనున్న సుమారు 4.60లక్షల సాంప్రదాయ విద్యుత్ దీపాల స్థానంలో ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసు లిమిటెడ్ సిఫార్సు చేసిన ఎల్‌ఇడి లైట్ల మార్పిడి ప్రక్రియ ఎట్టకేలకు ఊపందుకోంది. నెలకు వేల కిలోవాట్ల విద్యుత్‌ను ఖర్చు చేస్తూ, నెలకు కోట్లాది రూపాయలు విద్యుత్ బిల్లులను చెల్లిస్తున్న జిహెచ్‌ఎంసి ఆ భారాన్ని కొంత మేరకు తగ్గించుకునేందుకు కొద్ది రోజులుగా చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలిచ్చే దిశగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా కేవలం జిహెచ్‌ఎంసి వీది దీపాలే గాక, సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా గుర్తించిన నగరంలోని 22లక్షల కుటుంబాలు సైతం తమ ఇళ్లలో విద్యుత్‌ను ఆదా చేసే బల్బులు, ఫాన్లను వినియోగించేలా కూడా చర్యలు చేపట్టింది. వీటిని ప్రత్యేకంగా జోన్లు, సర్కిల్ కార్యాలయాల్లో విక్రయించటంతో పాటు వీటి విక్రయ బాధ్యతలు స్థానిక స్వయం సహాయక బృందాలకు కమిషన్ ప్రాతిపదికన అప్పగించిన సంగతి తెలిసిందే! ఇక జిహెచ్‌ఎంసి పరిధిలోని సుమారు 9వేల కిలోమీటర్ల రహదారులకిరువైపులా ఉన్న సుమారు 4.60లక్షల విద్యుత్ దీపాలను కూడా సాంప్రదాయ లైట్ల నుంచి ఎల్‌ఇడి లైట్లకు మార్చే ప్రక్రియను కొనసాగిస్తుంది. ఇప్పటి వరకు 75 వేల సాంప్రదాయ లైట్లను తొలగించి వాటి స్థానంలో 75 వేల 621 ఎల్‌ఇడి లైట్లను అమర్చినట్లు అధికారులు తెలిపారు.