హైదరాబాద్

డ్రగ్స్.. ఉగ్రవాదంతో సమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/బేగంపేట: దేశాభివృద్ధికి వెన్నుముక లాంటి యువతరం మత్తుకు దూరంగా ఉండాలని హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి హితవుపలికారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం తెలంగాణ ప్రభుత్వం పలు కఠిన నిర్ణయాలను అమలు చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు నగరంలోని నార్త్‌జోన్ పోలీసుల ఆధ్వర్యంలో శనివారం సికిందరాబాద్ హరిహారకళాభవన్‌లో నిర్వహించిన ‘కిడ్స్ అండ్ కాప్స్’ ప్రత్యేక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ విక్రయించే వారు టెర్రరిస్టుల కన్నా ప్రమాదకరమని అభిప్రాయపడ్డారు. విద్యార్థులు డ్రగ్స్ బారిన పడకుండా ఉండేందుకు వీలుగా, వారిలో అవగాహనను పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించటం పట్ల నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. కొందరు స్వార్థపరులు డబ్బు సంపాదనే ధ్యేయంగా డ్రగ్స్ విక్రయాలను మార్గంగా ఎంచుకున్నారని, ఇందుకు అమాయక విద్యార్థుల జీవితాలు బలవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత మూడేళ్లుగా శాంతిభద్రతల విషయంలో రాష్ట్ర పోలీసులు ఎంతో సమర్థవంతమైన విధులు నిర్వహిస్తున్నారని వివరించారు. అమెరికా తర్వాత అత్యంత అప్రమత్తంగా ఉండే పోలీసులు మన రాష్ట్ర పోలీసులని ఇప్పటికే మన్ననలు పొందిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఏ చిన్న ఘటన జరిగినా, క్షణాల్లో ఘటన స్థలానికి చేరుకుని గూండాలకు, రౌడీలకు, అక్రమార్కులకు తెలంగాణ పోలీసులు దడ పుట్టిస్తున్నారన్నారు. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు సిఎం కెసిఆర్ ఎంతో చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని, అందుకు పోలీసుల నుంచి కూడా సంపూర్ణమైన సహాయసహాకారం అందుతోందన్నారు. పోలీస్‌స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేస్తే, ఆ ఫిర్యాదు పరిశీలన, పరిష్కారం ఏ స్థాయిలో ఉందన్న సమాచారం మొత్తాన్ని ఆన్‌లైన్‌లో చూసుకునే విధంగా ఆధునిక సంస్కరణలను ప్రవేశపెట్టామన్నారు. ఈ కార్యక్రమంలో నార్త్‌జోన్ డిసిపి సుమితి, వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యుమన్ ఎక్సలెన్సీ డైరెక్టర్ స్వామి భోదనాయనంద, పర్యావరణ వేత్త డా.ఎన్. భాస్కర్‌రెడ్డి మోడల్ స్కూల్ పల్లవి తనూజ పాల్గొన్నారు.
తెలంగాణ యాసలో సినిమా తీయటం ఆనందం
తెలంగాణ యాసలో, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా ‘్ఫదా’ సినిమా తీసినందుకు ఆనందంగా ఉందని ప్రముఖ సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ నేటి విద్యార్థులే రేపటి దేశ పౌరులని, వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి వారిని, ప్రోత్సహించేందుకు పోలీసులు ప్రత్యేక చొరవ చూపాలని కోరారు.