డైలీ సీరియల్

ట్విన్ టవర్స్- 85

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆవిడకు చీరలతోపాటు అందులో ఒకపెళ్లి ఫొటో కూడా పెట్టింది సావిత్రి.
ఆవిడ ఫొటో వంక చూస్తూ మీ అబ్బాయి మంచి హీరోలా ఉన్నాడు. అమెరికా కాదు, మా మద్రాసు రావాల్సింది అంది నవ్వుతూ!
‘‘నేను ఎప్పుడు అమెరికా వెళ్లినా మూర్తిగారింట్లో దిగకుండా వుండను. ఆవిడ చేతి భోజనం చేస్తేగాని, నాకు పాడేందుకు ఎనర్జీరాదు’’ అంది నవ్వుతూ!
ఎంతో సింపుల్‌గా, ఎంతో ఆత్మీయతతో మాట్లాడుతున్న ఆమెని చూస్తే చాలా ఆనందం అనిపించింది.
మరో అరగంట కూర్చుని స్టేషన్‌కి బయలుదేరాం.
ఆ రాత్రి రైల్లో అన్నయ్య హాయిగా పైకి ఎక్కి పడుతున్నాడు. నేను వదిన క్రింద బెర్త్‌మీద కూర్చున్నాం. అదృష్టవశాత్తు 4వ బెర్త్ ఖాళీగా ఉండిపోయింది. వదిన డోర్ లాక్ చేసి వస్తూ అమ్మయ్య! ఎవ్వరూ రాలేదు అంది. చెప్పులు వదిలేసి మఠంవేసుకుని బెర్త్‌మీద కూర్చుంటూ.
‘‘ఇప్పుడు చెప్పు ఫోన్‌లో ఎన్నోసార్లు మాట్లాడినా, యోగక్షేమాలతో అయిపోయింది. నీ ట్రిప్ ఎలాజరిగిందో నీ ముఖం చెప్పింది. వివరాలు నువ్వు చెప్పాలి’’ అంది చిరునవ్వుతో మా వదిన, నా గుండె లోతుల్లో ఏముందో తెలుసుకోగలిగే వ్యక్తి.
అన్నీ చెప్పాను. ‘‘విమానంలో జరిగిన ప్రమాదం నుంచి తేజ యిచ్చిన కాఫీ మగ్‌దాకా’’. ప్రమాదం మాట చెప్పగానే వదిన గుండెమీద చెయ్యి వేసుకుంది.
‘‘్భయం వేయలేదా’’ అంది.
‘‘ఎందుకు భయం వేయలేదు వదినా? కాని, నిజంగా భయం వేసింది. నాకేదయినా జరిగితే ఈ ముసలి వయసులో అమ్మా నాన్న ఏమయిపోతారో అని, వౌళి పెళ్లి ఆగిపోతుందేమోనని అన్నాను.
నా వంక తేరిపార చూచింది. చెంపమీద చిన్నగా దెబ్బవేసింది. ‘‘ఈ దెబ్బలు తిని చాలా రోజులయింది వదినా’’ అన్నాను. ఆవిడ నవ్వింది.
‘‘నువ్వు చెప్పు వదినా- నీ కెందుకు మద్రాసు రావాలనిపించిందో’’ అన్నాను.
‘‘వూరికినే! ఎక్కడికైనా వెళ్లాలనిపించి వచ్చాను’’ అంది.
వదిన వంక సూటిగా చూశాను. తల అడ్డంగా వూపుతూ ‘‘అన్నయ్య ఒంటరిగా ప్రయాణం చేయడం నీకిష్టం లేదు కదూ’’ అన్నాను.
నవ్వింది. ‘‘మరి తెలిసే అడుగుతావేం? రుూమధ్య ఫ్లూ వచ్చి తగ్గింది. నిన్ను రిసీవ్ చేసుకోవడానికి ఎవరినైనా పంపుదామంటే మీ అన్నయ్య ఒప్పుకోడు కదా!’’ అంది.
ఆవిడ వంక చూశాను. అసలు ఆవిడకు గట్టిగా ప్రపంచం తెలిసినప్పటినుంచి, ఆవిడ మా అన్నయ్యకు భార్యయే! అన్నయ్య లేకుండా, ఆవిడ యినే్నళ్ళలో గడిపిన రోజులు వేళ్ళపైన లెక్కపెట్టొచ్చేమో.
ఎంత అదృష్టవంతురాలో! అన్నయ్య లాంటి జీవిత సహచరుడు అందరికీ దొరుకుతారా? అది ఒక్కటే నిజం కాదు. అన్నయ్యకు ఆవిడ లాంటి భార్య దొరకడం అదృష్టం. అన్నయ్య, వదిన ఎప్పుడూ వాళ్లిద్దరూ ఒంటరిగా సంసారం ఏర్పరచుకోలేదు. ఎప్పుడూ అమ్మా నాన్నతోనే వున్నారు. సంసారం క్రింద అన్నయ్య చాలా డబ్బు ఖర్చు చేసేవాడు. కాని వదినలో ఎప్పుడు ఆ ఫిర్యాదు కనిపించేది కాదు. ఇవన్నీ నాకు చిన్న పిల్లగా వున్నప్పుడు తోచేవి కూడా కాదు. పెరిగి పెద్దయ్యాక నా జీవితం గందరగోళం అయ్యాక గ్రహించాను. దాంపత్యం అంటే అలా వుండాలి. సంతోషంగా కనిపించే దాంపత్యంలో ఎంతమందికి ఇలాంటివి దక్కుతాయి.
మనిషి మంచి అయినంత మాత్రాన పెళ్లిళ్ళు సవ్యంగాసాగవు. వాటికి చాలా చాలా తోడుకావాలి. నిట్టూర్చాను.
‘‘ఇవి సరే గాని కల్యాణి, అన్నింటికంటే దేన్ని ఎక్కువ ఎంజాయ్ చేశావు’’ అంది.
‘‘ఎవ్వరికీ తెలియకపోవడం వదినా!’’ అన్నాను అనుకోకుండా, తడుముకోకుండా!
ఆశ్చర్యంగా చూసింది.
‘‘అక్కడెందుకో నా మనస్సు పూర్తిగా, స్వేచ్చను అనుభవించింది. నేనెవరో ఎవరికీ తెలియదు. నా గత జీవితం ఏమిటో ఎవరికీ తెలియదు.
వౌళి అమ్మను, వాడి పెళ్లికోసం వచ్చాను. అంతే! ఎవ్వరూ, నన్ను పట్టించుకోలేదు. ఎవరి కళ్ళూ సానుభూతి చూపించలేదు. ఎవరి మనసులోనూ ప్రశ్నలు లేవు. సమాధానాలు లేవు.
ఇక్కడ నేను ఎక్కడికి వెళ్లినా, ఎన్నో కళ్ళు నన్ను గురించి మాట్లాడుకుంటాయనిపించేది. నన్ను గురించి ప్రశ్నించాలనిపించేది. అది నా భ్రమ అయివుండవచ్చు. కానీ ఏదో చెప్పలేని న్యూనత. అందరిలా నేను లేనన్న విషయం, నా చుట్టూ వున్నవాళ్ళలో వుందనిపించేది.
నేను ఒక డైవర్సీ అని తెలిసిన మరుక్షణం నన్ను గురించని ప్రశ్నలు నా కొలీగ్స్‌లో ఎంతమందికి తలెత్తాయో నాకు తెలుసు.
కాని అమెరికాలో నన్ను కలిసిన వాళ్ళందరి దగ్గరనుంచి, ఏదో రకమైన చిన్న ప్రశంస, అభినందన. వౌళిని గురించి చెప్పే చక్కని మాటని తప్ప నేను మరేదీ వినాల్సిన అవసరం రాలేదు. పొగడ్త ఎటువంటివారికయినా సంతోషమే కదా! ఒక విధమైన మానసిక స్వేచ్ఛను అనుభవించాను వదినా’’ అన్నాను.
ఒకటి రెండుసార్లు రఘురాం మాట వచ్చింది. అది కేవలం అతి మామూలుగా ఎటువంటి ప్రాధాన్యత లేకుండా చెప్పుకుపోతూనే ఉన్నాను. వదిన శ్రద్ధగా వింటూనే వుంది. వదిన సంభాషణలో రఘురామ్ గురించి ఏం మాట్లాడతానోనని అని చాలా ఆతృత వుంది. ఆవిడంతట ఆవిడ అడగకపోనా నాకు తెలుసు. నేను అతన్ని కలిశానా లేదా అని తెలుసుకోవాలని.
చివరకు నేను అన్నాను ‘‘లేదు వదినా రఘురామ్‌ని నేను కలవలేదు. కలవాలని కూడా అనుకోలేదు’’. వౌళి అడిగాడు ‘కలుద్దామా’ అని. నేనే వద్దన్నాను.
‘‘అదేం పని కల్యాణి- ఒకసారి కలవాల్సింది’’.
‘‘ఎందుకు వదినా? అతని మరో సంసారం గురించి తెలుసుకోవాలనా? లేదా నా కొడుకును గురించి అతనికి చెప్పాలనా’’ అడిగాను.
వదిన ఏమీ మాట్లాడలేకపోయింది.
పైన పడుకున్న అన్నయ్య నిద్రాభంగమవుతున్నట్లుంది. ‘‘ఎంతసేపు కబుర్లు, పడుకోండి, రేపు మాట్లాడుకోవచ్చు’’.
వదిన కళ్ళు పైకి చూపిస్తూ, ‘‘విన్నావుగా పడుకో’’ అంది, తను దిండు మీదకు తల వాలుస్తూ.
నేను విండో దగ్గర కూర్చుండిపోయాను. జట్‌లాగ్ ఏమో నిద్ర రావడంలేదు. బయటనుంచి గాలి వీస్తోంది. చీకట్లో నిప్పు పురుగులు ఎగురుతున్నాయి.
-ఇంకాఉంది