భక్తి కథలు

శ్రీ సాయ లీలామృతం- 4

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతే వాత్సల్యానికి అనురాగానికి కట్టుబడే ఆ పరమాత్మ యశోదమ్మకు తన నోటిలో 14 భువనబోంతరాళ్లను చూపాడు. సముద్రాలు, పర్వతాలు, కొండలు, అడవులు, గుట్టలు, జలాశయాలు, మనుషులు, దేవతలు, సర్పాలు, పక్షులు, క్రిములు ఈ లోకాన ఉన్నవన్నీ ఆ నోటిలోనే చూస్తున్న ఆ యశోదమ్మ నోట మాట రాక మ్రాన్పడిపోయింది.
అంతా చూపించాక మాయలకే పెనుమాయ
అయిన ఆ పరమాత్మ యశోదమ్మ కళ్లను తడిమి అమ్మా అమ్మా మరి నేను మన్ను తినలేదు కదా, మరి ఆడుకుని రానా అంటూ ముందుకు వెళ్లాడని ఆ పోతనామాత్యుడు రచించినట్లుగా ఈ భక్తుడు కూడా రాబోయే రోజులను తన కళ్లతోనే తానే చూసి భగవానుడంటే ఎవరో తెలుసుకుని మళ్లీ భగవంతుని మాయ కమ్మి ఏదో యోగాభ్యాసం చేసినందువల్ల భవిష్యత్తు తెలిసిందని దానినంతా నేనే సాధించానని చెప్పుకుంటూ ఇంకా ఏదో సాధిస్తానంటూ వెళ్తున్నాడు. పిచ్చిమాలోకం.
ఇదంతా నీ మాయ!
నీ మాయను దాటడానికి ఎవరికి శక్యం అవుతుంది బాబా. సృష్టి యావత్తుకు నీవు కారణమైన నీవే నీవేమిటో వివరించినా సరే మాకు అర్థం చేసుకునే స్థోమత ఉంటుందా?అన్నాడు మహిల్సాపతి.
అంత ‘‘బాబా!’’ అంటూ మహిల్సాపతి సాగిలపడి నమస్కారం చేసి ‘‘బాబా మాకు మాత్రం నీవే దిక్కు. మా పాలిట ఖండోబా ఈశ్వరుడివి, కృష్ణుడివి, రాముడివి, మానవుడివి కూడా నీవే సుమా’’ అని అన్నాడు.
అందరూ జరిగేది అర్థం చేసుకోలేక అర్థం చేసుకున్నామనుకుంటూ సాయి దగ్గరనుంచి ఒక్కొక్కరూ లేచి వెళ్లారు.
బాబా ప్రశాంతంగా కూర్చుని ఉన్నారు.
***
మఱ్ఱిచెట్టు దగ్గరకు అప్పాజోగ్లే, కాశీనాథ్ రాగానే పదండి మనం ముగ్గురు ఆ మహాత్ముడైన ఆ సాయిని దర్శించుకుందాం అన్నాడు.
అప్పాజోగ్లే సరే కాని నా భార్య కూడా బాబా దర్శనానికి వస్తాను అని అంది. ఆమెను కూడా రమ్మని చెప్పాను. అదుగో పూలు పండ్లు తీసుకుని ఇటే వస్తోంది. ఆమె వచ్చాక అందరం కలిసి బాబా చెంతకు పోదాం అనుకున్నారు.
అంతలో ఆమె వచ్చింది. ఆమే బయాజీబాయి..
పదండి.. నలుగురు కలిసి బాబా దగ్గరకు వెళ్లారు.
వీరిని చూడగానే బాబా పరమానందంతో లేచి ముందుకు వచ్చారు. ఎప్పటినుంచో చూడని బంధువులు ఇప్పుడే వచ్చినట్లుగా బాబా వారితో మాట్లాడాడు. వారు కూడా ఎన్నాళ్ల క్రితం నుంచి చూడని బంధువు ఇప్పుడే చూస్తున్నట్లుగా చూస్తూ వారు తెచ్చిన పండ్లను తొక్క తీసి బాబాకిస్తున్నారు.
బాబా దగ్గర ఉన్న పానీయాలను వీరికి ఇస్తున్నారు...
అప్పుడే అక్కడికి చాంద్ పాటిల్ వచ్చాడు.
పెళ్లి అయిపోయింది. తన వారంతా మళ్లీ వెనక్కు వెళ్లిపోయారు. తాను వారితో వెళ్లిపోయాడు. కాని తాను దైవం అనుకున్న బాబా మాత్రం ఇక్కడే ఉండిపోయాడు. అందుకే పాటిల్ అప్పుడప్పుడు వచ్చి బాబాను చూచి కాసేపు పిచ్చాపాటి మాట్లాడి బాబా దగ్గరకు చిలుము తాగి కాసేపు ఉండి మళ్లీ బాబానే ఇక ఇంటికి వెళ్లు అనేదాకా కూర్చుని మరీ తిరిగి వెళ్ళేవాడు.
అట్లానే ఆ రోజు కూడా పాటిల్ బాబా దర్శనానికి వచ్చాడు.
ఈ బయాజీబాబా, అప్పాజోగ్లే, మహిల్సాపతి, కాశీనాథ్‌లను చూసి వారికి బాబా ఇచ్చే పానీయాలను చూస్తూ తాను అనుభవించిన వాటిని నెమరువేసుకుంటున్నాడు.
అవును నిజమే!
నా తప్పిపోయిన గుఱ్ఱం కోసం నేను వెతకని చోటు లేదు. కాని ఎక్కడా కనిపించలేదు నాకు. కాని ఈ బాబా కనిపించాడు. ఇతని వేషం చూసి పిచ్చి ఫకీరు అనుకున్నా.. అయినా ఎందుకో దగ్గరకు పోయాను. నా గుఱ్ఱాన్ని మరిచిపోలేక దాని జీనును భుజాన మోయడం నాకు అలవాటు. ఆ భుజాన వేలాడే జీనును చూచి ఈ బాబా ‘జీను నీవు మోస్తున్నావేమి’ అని అడిగాడు.
‘‘ఏం చెప్పను బబా! నా గుఱ్ఱాన్ని మరవలేక దాన్ని విడిచి ఉండలేక..’’ అన్నాను నీరసంతో.
‘‘అదుగో ఆ కనిపించే ఏలగంగానది ఒడ్డున సేద తీరుతున్నట్లు ఉంది. పోయి చూడు దాన్ని తీసుకుని ఇక్కడకు రా’’ అన్నాడు బాబా.
ఆ మాటలు పాటిల్‌లో ఆనందాన్ని నింపాయి. అప్పటిదాకా అలసిపోయి ఉన్న కాళ్లకు ఎక్కడలేని శక్తి వచ్చింది. పరుగు పరుగున ఏలాగంగ దగ్గరకు వెళ్లాడు. అక్కడ తనకోసమే చూస్తున్నట్లుగా తన గుఱ్ఱం నిల్చుని ఉంది. పరుగెత్తుకు వెళ్లి దాన్ని కౌగిలించుకుని నెమరి గుఱ్ఱాన్ని తీసుకుని మళ్లీ బాబా దగ్గరకు వచ్చి బాబా ఇదే నా గుఱ్ఱం అన్నాడు పాటిల్.
ఆ తెలుసు అందుకే గదా చెప్పాను.
కూర్చో అన్నాడు బాబా.
-ఇంకాఉంది

- జంగం శ్రీనివాసులు 837 489 4743