కరీంనగర్

ఘనంగా రాజీవ్ జయంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్: స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధి 73వ జయంతి వేడుకలు ఆదివారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంతో పాటు నగరంలోని రాజీవ్ గాంధి విగ్రహం వద్ద కాంగ్రెస్, దాని అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. మొదట జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో డిసిసి అధ్యక్షుడు కటకం మృత్యుంజయం రాజీవ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాజీవ్ గాంధి విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మృత్యుంజయం మాట్లాడుతూ రాజీవ్ గాంధి యువతకు 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించి రాజకీయాల్లో యువతను ఎక్కువగా ప్రోత్సహించారని, ప్రధానంగా ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ అభివృద్ధి చెందడానికి ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. ఈనాడు మనకు కంప్యూటర్లు, సెల్‌ఫోన్లు అందుబాటులోకి వచ్చాయంటే అది రాజీవ్ గొప్పతనమేనని పేర్కొన్నారు. రాజీవ్ ఆశయ సాధనకు యువత కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కర్ర రాజశేఖర్, దిండిగాల మధు, ఉప్పరి రవి, ఒంటెల రత్నాకర్, రహమత్ హుస్సేన్, చర్ల పద్మ, ప్రశాంత్ దీపక్, వెన్న రాజమల్లయ్య, పడిశెట్టి భూమయ్యలతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే రాజీవ్ జయంతి సందర్భంగా ఢిల్లీలోని వీర్ భూమిలో రాజీవ్ గాంధి స్మారక స్థూపం వద్ద మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. ఆయన వెంట తెలంగాణకు చెందిన మాజీ ఎంపిలు ఉన్నారు.