కరీంనగర్

డెంగ్యూతో యువకుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మికుంట: జమ్మికుంట మండలంలోని మచనపల్లి గ్రామనికి చెందిన రోమాల సతీష్ (25) ఆదివారం డెంగ్యూ లక్షణాలతో చికిత్స పోందుతు మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివారాల ప్రకారం మండలంలోని మాచనపల్లి గ్రామానికి చెందిన రోమాల సతీష్ పట్టణంలోని మిల్లులో హమాలీ కార్మికునిగా పని చేస్తుంటాడు. గత పదిహేను రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో చికిత్స నిమిత్తం జమ్మికుంట,వరంగల్ పట్టణాలలోని అసుపత్రిలో చికిత్స పోందుతున్న, ఎంతకు జ్వరం తగ్గకపోవడంతో హైద్రాబాద్‌లోని గాంధి అసుపత్రి లో చికిత్స పోందుతూ అదివారం మృతి చెందినట్లు తెలిపారు. డెంగ్యూ లక్షణాలతో మృతి చెందిన కుటుంబాన్ని అదుకోవాలని గ్రామస్థులు కోరారు.

దాడిలో గాయపడ్డ ఒకరి మృతి
సుల్తానాబాద్: సుల్తానాబాద్ మండలం రేగడిమద్దికుంట గ్రామానికి చెందిన బొడ్డు కొమురయ్య (50) అనే వ్యక్తిపై పాత కక్షలు దృష్టిలో పెట్టుకొని శుక్రవారం దాడి చేయగా, తీవ్ర గాయాలకు గురైన కొమురయ్య హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడని ఎస్‌ఐ దేవేందర్ తెలిపారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

పెద్దమ్మ తల్లి ఆలయ ప్రతిష్ఠాపనకు హాజరైన మంత్రి
హుజూరాబాద్: హుజూరాబాద్ మండలం కనుకులగిద్దె గ్రామంలో నూతనంగా నిర్మించిన పెద్దమ్మ తల్లి దేవాలయంలో ఆదివారం జరిగిన విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ హాజరయ్యారు. ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన మంత్రికి గ్రామస్థులు. భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికి సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ పెద్దమ్మ తల్లి దయ వలన వర్షాలు సమృద్దిగా కురవాలని, రైతులు బాగుపడాలని, సంక్షేమ పథకాలతో రాష్ట్రం అభివృద్ధి చెందాలని, ప్రజలు సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్ వడ్లూరి విజయ్‌కుమార్, మార్కెట్ చైర్మన్ ఎడవెల్లి కొండల్‌రెడ్డి, పింగిళి రమేష్, గోపు కొమురారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

డెంగ్యూతో యువకుని మృతి
జమ్మికుంట: జమ్మికుంట మండలంలోని మచనపల్లి గ్రామనికి చెందిన రోమాల సతీష్ (25) ఆదివారం డెంగ్యూ లక్షణాలతో చికిత్స పోందుతు మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివారాల ప్రకారం మండలంలోని మాచనపల్లి గ్రామానికి చెందిన రోమాల సతీష్ పట్టణంలోని మిల్లులో హమాలీ కార్మికునిగా పని చేస్తుంటాడు. గత పదిహేను రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో చికిత్స నిమిత్తం జమ్మికుంట,వరంగల్ పట్టణాలలోని అసుపత్రిలో చికిత్స పోందుతున్న, ఎంతకు జ్వారం తగ్గకపోవడంతో హైద్రాబాద్‌లోని గాంధి అసుపత్రి లో చికిత్స పోందుతూ అదివారం మృతి చెందినట్లు తెలిపారు. డెంగ్యూ లక్షణాలతో మృతి చెందిన కుటుంబాన్ని అదుకోవాలని గ్రామస్తులు కోరారు.

అస్వస్థతకు గురై రైతు మృతి
జమ్మికుంట: జమ్మికుంట మండలంలోని కోరపల్లి గ్రామనికి చెందిన బౌతు యాదగిరి (40) అనే రైతు అస్వస్థతకు గురై అదివారం మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిని వివారాల ప్రకారం గ్రామనికి చెందిన యదగిరి అదివారం ఉదయం పత్తి చేనుకు పురుగుల మందు పిచికారి చేసేందుకు వెళ్ళి వచ్చాడు. ఈక్రమంలో తీవ్ర అస్వస్థతకు గురికాగా,చికిత్స నిమిత్తం జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు తెలిపారు. మృతునికి భార్య భాగ్యలక్ష్మి, ఇద్దరు కుతుళ్ళు ఉన్నారు. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా అదుకోవాలని గ్రామ సర్పంచ్ మధుసుధన్,గ్రామస్తులు కోరుతున్నారు.

సాక్షర భారత్ ఆధ్వర్యంలో అక్షరాస్యత పరీక్షలు
జమ్మికుంట: జమ్మికుంట , ఇల్లందకుంట మండలంలోని 32 గ్రామాలలో సాక్షరాభారత్ అధ్వర్యంలో వయోజన విద్యా అక్షారస్యత పరిక్షలను జిల్లా పర్యవేక్షకులు అనుమాస రాజేందర్ పర్యవేక్షణలో అదివారం నిర్వహించారు. గతంలో సి గ్రేడ్‌గా పలితాలు వచ్చిన వయోజనులకు పరీక్షలు నిర్వహించారు. మండలాల పరిధిలో 350 మందికి 274 వయోజనులు పరీక్షలకు హాజరైనారు. పర్యవేక్షకులు రాజేందర్ విద్యానభ్యసించిన వయోజనులకు పరీక్ష పత్రాలు,అందజేసి ఎస్ ఐ ఓ ఎస్ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల కో అర్డినేటర్ రామంచ రాజయ్య,కోర్డినేటర్లు జ్యోతి,మంజులతోపాటు తదితరులు పాల్గోన్నారు.

సమాన పనికి సమాన వేతనం అందించాలి
* సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కొప్పుల శంకర్
జమ్మికుంట: కార్మికులకు సమాన పనికి సమాన వేతనం అందించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కోప్పుల శంకర్ డిమాండ్ చేశారు. ఆదివారం జమ్మికుంట పట్టణంలో కార్మికులతో సమావేశం నిర్వహి మాట్లాడుతూ కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల శ్రమ దోపిడి కోనసాగిస్తున్నాయన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కాంట్రాక్టర్ కార్మికులకు వేతానాలు పెంచి, రెగ్యూలరజ్ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కార్పోరేటు సంస్థలకు దోచిపెట్టేందుకు,కార్మిక చట్టాలను అమలు చేయడం లేదన్నారు. ఈ కార్య క్రమంలో రాజు,కమారి,మరపల్లిరాజయ్య, సారంగం,సదానందం,కుమార, ఓదేలుతోపాటు తదితరులు పాల్గోన్నారు.

విద్యార్థులకు ప్రతిభాపాటవ పరీక్ష
చొప్పదండి: మండలంలోని ప్రభుత్వ, పైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఆదివారం చొప్పదండి పట్టణంలోని పలు పాఠశాలల్లో ఏర్పాటు చేసిన సెంటర్లలో గుర్రం చిన్న ఎల్లారెడ్డి, కోమటిరెడ్డి రవికిశోర్ స్మారకార్థం పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు పలు సెంటర్లలో పెద్ద ఎత్తున విద్యార్థులు పరీక్షను రాసారు. మండల స్థాయిలో నిర్వహించిన ఈ ప్రతిభాపాటవ పోటీలలో 8మంది విద్యార్థులు ఎంపిక చేయటం జరుగుతుందని ట్రస్ట్ సభ్యులు తెలిపారు. ఎంపిక చేసిన 8 మంది విద్యార్థులకు ప్రతి నెల వేయి రూపాయలు ఆర్థిక సహాయం ట్రస్ట్ అందిస్తుందని తెలిపారు. ఇక నుంచి ప్రతి ఏటా మండల స్థాయిలో విద్యార్థులకు ప్రతిభాపాటవ పోటీలు నిర్వహించి 8 మంది విద్యార్థులను ఎంపిక చేసి వారికి ప్రతి నెల వేయి రూపాయల చొప్పున నగదును అందిస్తామని తెలిపారు. ఈ రోజు నిర్వహించిన పరీక్ష ఫలితాలను నెల రోజుల్లోగా వెల్లడిస్తామని చెప్పారు. ఈ పరీక్షను ప్రతి యేటా ఆగస్టు నెలలో నిర్వహిస్తామని తెలిపారు. విద్యార్థులకు పుస్తక పఠనాన్ని అలవర్చడంతో పాటు జనరల్ అవేర్‌నెస్ పెంపొందించడంలో భాగంగా ఈ పరీక్షను నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. పరీక్ష నిర్వాహణకు సహకరించిన పాఠశాలల ప్రధానోపాద్యాయులు, కరస్పాండెంట్లకు నిర్వాహకులు కృతఙతలు తెలిపారు.

ఖేల్ భారత్‌కు చొప్పదండి క్రీడాకారులు
చొప్పదండి: బిజెవైయం ఆద్వర్యంలో జిల్లా కేంద్రంలో జరుగుతున్న ఖేల్ భారత్‌కు మండలంకు చెందిన క్రీడాకారులు ఆదివారం తరలి వెళ్లారు. ఈ సందర్భంగా మండల బిజెపి అధ్యక్షుడు చేపూరి సత్యనారాయణ మాట్లాడుతు దేశ వ్యాప్తంగా బిజెవైయం ఆద్వర్యంలో నిర్వహిస్తున్న ఖేల్ భారత్ క్రీడలు జిల్లా స్థాయిలో ఎస్‌ఆర్‌ఆర్ కళాశాలలో జరుగుతున్నాయని, ఇక్కడ ప్రతిభ కనబర్చిన వారు రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో పాల్గొంటారని తెలిపారు. యువతలో దేశ భక్తి, జాతీయభావం పెంపొందించడానికి ఇవి దోహద పడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెవైయం మండల అధ్యక్షుడు మడుపు నరేందర్, తాడూరి రామక్రిష్ణ, తాటికొండ కుమార్, బొడిగె శేఖర్, మాచర్ల శశికుమార్, అజేందర్, హరీష్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.

హుజూరాబాద్‌లో రాజీవ్ జయంతి
హుజూరాబాద్: హుజూరాబాద్ పట్టణంలో స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధి జయంతిని ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బస్ డిపో క్రాస్ రోడ్డు వద్ద ఉన్న రాజీవ్ గాంధి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. రాజీవ్ గాంధి చేసిన సేవల్ని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నేరెళ్ల మహేందర్ గౌడ్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి రాజీవ్ కృషి చేసారని, వారి కుటుంబం బలిదానాలు చేసిందని గుర్తు చేశారు. టెక్నాలజీ అభివృద్దిని రాజీవ్ గాంధి ప్రోత్సహించారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు నేరెళ్ల మహేందర్, సింగిల్‌విండో అధ్యక్షుడు గూడూరి స్వామిరెడ్డి, నాయకులు కాజీపేట శ్రీనివాస్, చందమల్ల బాబు, సొల్లు బాబు, కొలిపాక శంకర్, రఘుపతి, బాబా, పరంధాములు, ఖాలిద్, దుబాసి బాబు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా రాజీవ్ గాంధి జయంతి వేడుకలు
చందుర్తి: భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధి 73వ జయంతి వేడుకలను చందుర్తి మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ వేములవాడ నియోజకవర్గ అధ్యక్షులు నాగం కుమార్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజీవ్ గాంధి ప్రధానిగా ఉన్నప్పుడే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు ముస్కు పద్మ, నాయకులు ఇందూరి మధు, ధర్మపురి శ్రీనివాస్, అవారి రమేష్, చిన్న రాంరెడ్డి, గంట మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా రాజీవ్ జయంతి వేడుకలు

చొప్పదండి: స్వర్గీయ మాజీ భారత ప్రధాని రాజీవ్ గాంధి 73వ జయంతి వేడుకలను ఆదివారం చొప్పదండి నియోజకవర్గ కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు రాజీవ్ గాంది జన్మదినంను పురస్కరించుకొని కేక్‌ను కట్ చేసి స్వీట్లను పంచి పెట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతు రాజీవ్ గాంధి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి ఆరెల్లి చంద్రశేఖర్, జిల్లా గౌడ సంఘం ఆద్యక్షులు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, ఎంపిటిసి ముద్దసాని రంగన్న, నాయకులు చీకటి కుమారస్వామి, పురం రాజేశం, పెరుమాండ్ల గంగయ్య, మహేశుని మల్లేశం, తోడేటి డేవిడ్, కొట్టె అశోక్, చిల్ల శంకర్, గుర్రం రమేష్, కైలాసపతితో పాటు పలువురు పాల్గొన్నారు.

డబుల్ బెడ్‌రూం పనులు వెంటనే ప్రారంభించాలి
సారంగాపూర్: డబుల్ బెడ్ రూం పనులు వెంటనే ప్రారంభించాలని జగిత్యాల జిల్లా ఎస్పీ అనంతశర్మ పంచాయితీ రాజ్ శాఖ అదికారులను సూచించారు. ఆదివారం బీర్‌పూర్ మండలం చిన్నకొల్వాయి గ్రామంలో డబుల్ బెడ్ రూం ఇళ్లకు కేటాయించిన స్ధలాన్ని పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పేదల కోసం నిర్మించే గృహ నిర్మాణాలను వెంటనే పనులు ప్రారంభించి పూర్తి చేయాలని పంచాయితి రాజ్ ఎఇ రాజమల్లయ్యను ఆదేశించారు.
అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమెల్యే
సారంగాపూర్: మండలంలోని రేచపెల్లి గ్రామంలో పలు అభివృద్ది పనులను జగిత్యాల ఎమ్మెల్యే తాటిపర్తి జీవన్‌రెడ్డి పరిశీలించారు. మ్యాడారం తండాలలో గల చెక్‌డ్యామ్‌తో పాటు నిర్మాణంలో ఉన్న కుల సంఘాల భవనాలను ఆయన పరిశీలించారు.

సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలి
యైటింక్లయిన్‌కాలనీ: సింగరేణిలో తక్షణమే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని హెచ్‌ఎంఎస్ నాయకులు యాదగిరి సత్తయ్య, దశరథం గౌడ్ డిమాండ్ చేశారు. ఆదివారం ఓసిపి-3 బేస్ వర్క్ షాప్, సిహెచ్‌పిలో నిర్వహించిన గేట్ మీటింగ్‌లో వారు మాట్లాడారు. సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఉండి టిబిజికె ఎస్ యాజమాన్యంకు తొత్తుగా మారి అనేక కార్మిక హక్కులను తాకట్టు పెట్టిందని, హక్కులు అడిగిన సంఘం నాయకులపై కక్ష సాధింపు చర్యలు చేపడుతూ బదిలీలు చేయడం జరుగుతుందని అన్నారు. అక్రమ బదిలీలను ప్రతీ ఒక్క కార్మికుడు ఖండిస్తున్నాడని, రాబోయే గుర్తింపు సంఘం ఎన్నికల్లో కార్మికులు హక్కులను సాధిస్తూ కార్మికుల శ్రేయస్సు కొరకు పాటుపడుతున్న హెచ్ ఎం ఎస్సేనే కార్మికులు ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. గేట్ మీటింగ్ నాయకులు గోపాల్ రెడ్డి, పెరుమయ్య, రామయ్య, అయాజ్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.