కరీంనగర్

అలసి..సొలసి..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్: పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజన ఉద్యోగుల పాలిట శాపంగా మారింది. జిల్లాల విభజన సందర్భంగా ఆర్డర్ టు సర్వ్ పేరుతో కొత్త జిల్లాలకు ఉద్యోగులను నిర్బంధంగా బదిలీ చేశారు. తప్పనిసరిగా వెళ్లాలని, లేకుంటే చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. మూడు నెలల్లో తిరిగి బదిలీ చేస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో గత్యంతరం లేక ఉద్యోగులు తమకు కేటాయించిన ప్రాంతాలకు వెళ్లి విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే, ఓ వైపు ఉద్యోగుల కొరత, మరోవైపు ఉన్నవారిపైనే అదనపు భారం పడటం వెరసి ఆర్డర్ టు సర్వ్ ఉద్యోగులు అలసిపోతున్నారు. ఇంకోవైపు కుటుంబాలకు దూరంగా ఉంటున్నారు. అక్టోబర్ నెలలో చేపట్టిన జిల్లాల పునర్వీభజనలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాను కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి పేరిట నాలుగు జిల్లాలు విభజించిన సంగతి అందరికీ తెలిసిందే. జిల్లాల విభజన సందర్భంగా ఆర్డర్ టు సర్వ్ పేరిట ఉద్యోగులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కొత్త జిల్లాలైన నేపథ్యంలో బదిలీ అయిన ఉద్యోగులు తప్పనిసరిగా కేటాయించిన ప్రాంతాలకు వెళ్లాల్సిందేనంటూ ప్రభుత్వం అప్పట్లో స్పప్టమైన ఆదేశాలు ఇచ్చింది. వెళ్లకపోతే చర్యలు తప్పవంటూ కూడా హెచ్చరించింది. అదే సమయంలో మూడు నెలల్లో తిరిగి బదిలీ చేస్తామని హామీ ఇచ్చింది. దీంతో చేసేదేమిలేక ఆర్డర్ టు సర్వ్ అందుకున్న ఉద్యోగులు వారికి కేటాయించిన ప్రాంతాలకు బదిలీపై వెళ్లారు. మూడు నెలలకు బదిలీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం పది నెలలు గడిచినా బదిలీలకు చర్యలు చేపట్టడం లేదు. ఓ వైపు ఉద్యోగుల కొరత..మరోవైపు పని భారం..ఇంకోవైపు పది మాసాలుగా కుటుంబాలకు దూరంగా ఉండటం వెరసి ఉద్యోగులు లోలోన కుమిలిపోతున్నారు. రెండ్రోజులకోమారు తప్పని ప్రయాణాలు చేస్తున్నారు. ఆదివారం, సెలవు వచ్చిందంటే చాలు అంతకుముందు రోజే విధులకు ఢుమ్మా కొట్టి ఇంటిబాట పడుతున్నారు. జిల్లాల విభజన తరువాత ఉద్యోగులు ఆయా ప్రాంతాల్లో గదులు అద్దెకు తీసుకొని ఉంటున్నారు. అయితే, నిత్యం పనిభారంతో వంట చేసుకోలేని పరిస్థితులు ఉత్పన్నమవుతుండగా, తప్పనిపరిస్థితుల్లో హోటళ్లను ఆశ్రయిస్తున్నారు. దీనివల్ల జేబుకు చిల్లు పడటమేకాక అనారోగ్యం బారిన పడుతున్నామంటూ పలువురు ఉద్యోగులు ఆవేదన వెలిబుచ్చుతున్నారు. భార్యభర్తలు ప్రభుత్వ ఉద్యోగులైతే ఇక వారి పరిస్థితి మరీ దయనీయం. ఇద్దరికీ ఒకేరోజు సెలవు దొరకకపోవడం, పిల్లలు హాస్టళ్లలో, భార్య ఒకచోట, భర్త మరోచోట ఉంటూ ఇబ్బందులనెదుర్కొంటున్నారు. ఈ క్రమంలో మూడు నెలలకే బదిలీ చేస్తామని చెప్పి పది నెలలైనా పట్టించుకోకపోవడంపై అటు సర్కార్‌పై, ఇటు ఉద్యోగ సంఘాల నాయకులపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా బదిలీలు చేసి తమ బాధలు తీర్చాలంటూ ఉద్యోగులు కోరుతున్నారు.