వరంగల్

భారీ వర్షంతో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి జిల్లాలో గత నాలుగు రోజులుగా విస్తరంగా వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి. నాలుగు రోజులుగా వర్షం కురుస్తుండటంతో భూపాల్‌పల్లిలోని సింగరేణి ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అటంకం ఏర్పడింది.పూర్తి స్థాయిలో చెరువుల్లోకి నీరు చేరడంతో వరద మత్తడి పైనుంచి పారుతోంది. మత్తళ్లు ఎత్తిపోస్తుండటంతో దిగువన ఉన్న పంటలు నీట మునిగాయి. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో వాగులు, వంకలు పొంగి ప్రవాహిస్తున్నాయి. మరోప్రక్క ఎగువన కురుస్తున్న వర్షం మూలంగా వరదతో గోదవరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వాగులు ఉప్పొంగడంతో లోతట్టు గ్రామాలకు రవాణా నిలచిపోయింది. జిల్లాలోని 20 మండలాల్లో అధికంగా అటవీప్రాంత, లోతట్టు మండలాలు కావడంతో వర్షం ప్రభావం అధికంగా కనపడింది. కంతనపల్లి వాగు ఉప్పొంగడంతో కన్నాయిగూడెం- తూపాకులగూడెం, మహదేవపూర్- పలిమెల మండలాలకు రాకపోకలు నిలచిపోయాయి. విద్యుత్ అంతరాయంతో సెల్ సిగ్నల్ పనిచేయక బాహ్యప్రపంచంతో లోతట్టు గ్రామాల ప్రజలకు సంబంధాలు తెగిపోయాయి. భూపాలపల్లి మండలం మోరంచవాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో వేలాది ఎకరాల పంటపొలాలు నీట మునిగి రైతులకు తీవ్రనష్టం వాటిల్లింది. వాజేడు, వెంకటాపురం, మంగపేట, ఏటూరునాగారం, గోవిందరావుపేట, ములుగు మండలాల్లో అధికంగా వర్షం కురియడంతో పంటలు నీట మునిగాయి. మహదేపూర్ మండలం కాళేశ్వరం వద్ద గోదవరినది స్నానఘట్టాల వరకు చేరిన వరదనీరు ఉదృతంగా, ప్రమాదకరంగా ప్రవాహిస్తోంది. ఎగువన కురుస్తున్న వర్షం మూలంగా వచ్చే వరద, జిల్లాలో కురుస్తున్న వర్షంతో గోదవరి లోతట్టు గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. అల్పపీడన వర్షం ఆదివారం వరకు ఉండటంతో జిల్లా అధికార యంత్రాంగం వరద సహాయక చర్యలకు చర్యలు తీసుకుంటున్నారు.

రోడ్డుప్రమాదంలో విఆర్‌ఏ మృతి
నల్లబెల్లి: నల్లబెల్లి మండలం మామిండ్లవీరయ్యపల్లి గ్రామానికి చెందిన విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ మంద రాజు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. నర్సంపేట నుంచి మామిండ్ల వీరయ్యపల్లికి ఆదివారం తెల్లవారుజామున జీపులో బయలుదేరగా రుద్రవరం గ్రామ సమీపంలోని మలుపువద్ద జీపు అదుపుతప్పి పక్కనే చెట్టుకు ఢీకొనటంతో ఆయన అక్కడికక్కడే మరణించాడు. ప్రమాదం జరిగిన సమయంలో జీపులో ఆయన ఒక్కడే ఉన్నాడు. సంఘటనా ప్రాంతాన్ని నల్లబెల్లి పోలీసులు సందర్శించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మేకలు అపహరణ
నెల్లికుదురు: మండలంలోని చిన్ననాగారంలో శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు తన మూడు మేకలను అపహరించినట్లు బాధితుడు కుంభం సుధాకర్ తెలిపాడు. ఆదివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ.. ఈ మేరకు పోలీస్‌స్టేషన్‌లో పిర్యాదు చేసినట్లు తెలిపారు. తాను నిరుపేద మేకల కాపరిని అని మేకలు అపహరించడంతో ఆర్ధికంగా తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపారు.
తప్పిపోయిన బాలుడు.. తండ్రికి అప్పగింత
కురవి: మాటలు రాని, వికలాంగుడైన ఓ బాలుడు హోటల్‌లో ఉండడంతో ఆటోడ్రైవర్లు ఎవరో తల్లిదండ్రులు వదిలి వెళ్ల్లారని బావించి పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెల్లిన సంఘటన కురవి మండల కేంద్రంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కురవి మండల కేంద్రంలోని వీరభద్రుని ఆలయ సమీపంలోని ఓ హోటల్‌లో సాయంత్రం 3గంటల నుండి ఆరుగంటల వరకు ఓ వికలాంగ బాలుడు కూర్చున్నాడు. గమనించిన ఆటోడ్రైవర్లు భూక్య వెంకన్న, రఘురాం, ఎస్‌కె ఫరీద్, సోమగాని రాజులు ఎవరీ పిలగాడని ఆరా తీయగా ఎవరు లేకపోవడంతో కురవి పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లి కురవి ఎస్సై తీగల అశోక్‌కు అప్పగించారు. కొద్ది సేపటికి ఆ బాలుడి తండ్రి కేసముద్రం మండలం కాట్రపల్లికి చెందిన బానోత్ శివలాల్ స్టేషన్‌కు వచ్చి తన కుమారుడేనని, హోటల్‌లో కూర్చుండబెట్టి తమ తోడల్లుడు కురవికి సమీపంలోని టేకులతండాలో ఉండడంతో అక్కడికి వెళ్లానని అందుకే ఆలస్యం అయ్యింది వివరించాడు. వికలాంగుడైన కుమారుడ్ని అలా వదిలివేసి ఎలా వెళ్ల్లావంటూ అశోక్ తండ్రి శివలాల్‌కు కౌన్సిలింగ్‌చేసి అప్పగించాడు.
గుట్కాలు తరలిస్తున్న వ్యక్తిఅరెస్ట్
తొర్రూరు: వరంగల్ నుండి ఖమ్మం జిల్లా కేంద్రానికి అక్రమంగా గుట్కాలు రవాణా చేస్తున్న గుట్కా రవాణా దారున్ని ఆదివారం అరెస్ట్‌చేసి అతని వద్ద నుండి రూ.65వేల విలువ చేసే గుట్కాలు, అంబర్‌పాకెట్‌లు స్వాధీనం చేసుకున్నట్లు తొర్రూరు సిఐ వి.చేరాలు, ఎస్సై రమణమూర్తి తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా కేంద్రంలోని రామాలయం వీధికి చెందిన మహ్మద్ యాసిన్ అనే యువకుడు వరంగల్ జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున గుట్కాలు, అంబర్‌పాకెట్‌లు కొనుగొలు చేసి ఖమ్మం జిల్లా కేంద్రానికి తరలిస్తుండగా తమకు అందిన సమాచారం మేరకు తొర్రూరులో అతన్ని అదుపులోకి తీసుకొని సుమారు రూ.11వేల విలువ చేసే 2145సాగర్ కంపెనీకి చెందిన గుట్కాలు, అదేవిధంగా రూ.26వేల విలువ చేసే ఖలేజా కంపెనీకి చెందిన 5200గుట్కాలు, వీటితోపాటు రూ.27,500విలువ చేసే 2750అంబర్ పాకెట్‌లు స్వాధీనం చేసుకున్నామన్నారు. అక్రమంగా గుట్కాలు రవాణా చేస్తున్న నేరంపై నిందుతున్ని అరెస్ట్ చేసి కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ చేరాలు, ఎస్సై రమణమూర్తిలు తెలిపారు.

ఇష్టారాజ్యంగా నల్లా మెయిన్ పైపుల ధ్వంసం
పరకాల: ఎన్‌హెచ్ కాంట్రాక్టర్‌పై నగర పంచాయతీ సిబ్బంది గరం.. గరం అవుతున్నారు. ఇష్టారాజ్యంగా పనులు చేస్తు పరకాల పట్టణ ప్రజలకు నీరు అందించే నల్లా పైపులను ధ్వంసం చేయడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గూడెపాడ్ నుండి భూపాలపల్లి వరకు ఎన్‌హెచ్ రోడ్డు పనులు చేపడుతున్నారు. ఈ దరిమిలా పరకాల పట్టణంలో ఎన్‌హెచ్ రోడ్డు పనులు నిర్వహిస్తున్న క్రమంలో కాంట్రాక్టర్ నగర పంచాయతీ సిబ్బందికి ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. అయితే రోడ్డు వెంబడి పరకాల పట్టణ ప్రజలకు నీరు అందించే నల్లా మెయిన్ పైప్‌లైన్‌ను చూడకుండా పనులు చేపడుతుండడంతో పరకాల పట్టణ ప్రజలకు నీరు అందించే మెయిన్ పైపులు ధ్వంసం అవుతున్నాయి. ప్రశ్నిస్తే రోడ్డు పనులు చేస్తున్న సిబ్బంది నుండి సమాధానం లేదని తమను పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు. తమకు కనీసం సమాచారం ఇవ్వాలని చెప్పిన పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా పనులు చేస్తు పైపులను ధ్వంసం చేస్తున్నారని వారు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇప్పటికీ ఐదు సార్లు మెయిన్ పైపులు ధ్వంసం
పరకాల పట్టణ ప్రజలకు తాగునీరు అందించే మెయిన్ పైపులను ఇప్పటి వరకు ఐదు సార్లు ధ్వంసం చేసినట్లు సిబ్బంది తెలిపారు. నాలుగు సార్లు ఎన్‌హెచ్ కాంట్రాక్టర్ మెయిన్ పైపులైన్‌లను ధ్వంసం చేయగా మరో రెండు సార్లు ఇతరులు ధ్వంసం చేసినట్లు చెప్పారు. దీంతో పరకాల పట్టణ ప్రజలకు నీటి సరఫరా నిలిచి పోతుంది. ఇటీవల మళ్లీ మెయిన్ పైప్‌లైన్‌ను ధ్వంసం చేయడంతో 15 రోజుల నుండి పట్టణ ప్రజలకు త్రాగునీటి సరఫరా నిలిచి పోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బిందెలు, బక్కెట్లు పట్టుకొని బోరు, బావులను ఆశ్రయిస్తున్నారు. అయితే గత రెండు రోజుల నుండి వర్షాలు పడుతుండడంతో వర్షపు నీటిని ఉపయోగించుకుంటున్నారు.
అయితే ఎన్‌హెచ్ కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా రోడ్డు పనులు చేస్తు నీటి పైపులైన్లు ధ్వంసం చేయడం పట్ల నగర పంచాయతీ సిబ్బంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పనులు నిర్వహిస్తున్న వారిని నగర పంచాయతి కార్యాలయంకు తీసుకు వచ్చినట్లు సమాచారం. అయితే వారిపై చర్యలు తీసుకోవాల్సిన వారు పట్టించుకోవడం లేదని వారి నుండి రికవరీ చేయాల్సి ఉండగా సిబ్బందిపైనే అసహనం వ్యక్తం చేశారనే వ్యాఖ్యలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో సిబ్బంది తమకు ఎందుకులే అంటూ మిన్నకుంటున్నారు. కొన్ని ప్రాంతాలలో 20 రోజులు అవుతుండగా మరి కొన్ని ప్రాంతాలలో వారం రోజుల నుండి నల్లా నీరు రాకపోవడంతో ఆయా వార్డులోని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

పరకాలను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలి
పరకాల: పరకాలను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేసి అందులో చిట్యాల మండలాన్ని కలపాలని చిట్యాల అఖిల పక్షం నేతలు డిమాండ్ చేసి తీర్మానం చేశారు. ఆదివారం పరకాల అఖిల పక్షం, చిట్యాల మండల అఖిల పక్షం నేతలు సంయుక్త సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పరకాల రెవెన్యూ డివిజన్‌కు మొగుళ్ళపల్లి, రేగొండ మండలాల అఖిల పక్షం నేతలు సంపూర్ణ మద్దతు ప్రకటించి రెవెన్యూ డివిజన్ చేయాలని తీర్మాణం చేశారు. అదేవిధంగా ఆదివారం చిట్యాల మండల అఖిల పక్షం నేతలు పరకాలను రెవెన్యూ డివిజన్‌గా చేసి చిట్యాల మండలాన్ని అందులో చేర్చించాలని డిమాండ్ చేస్తూ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరకాలను జిల్లా చేయాల్సిన అవసరం ఎంతో ఉందని చెప్పారు. పాలకుల రాజకీయ, కుల స్వార్ధాల కోసం పరకాలను జిల్లా చేయకుండా కనీసం రెవెన్యూ డివిజన్ కూడా చేయలేదని చెప్పారు. ఇప్పటికైనా పరకాలను రెవెన్యూ డివిజన్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పరకాల, చిట్యాల మండల అఖిల పక్ష నేతలు పిట్ట వీరస్వామి, కొలుగూరి రాజేశ్వర్‌రావు, బొచ్చు క్రిష్ణారావు, ఆర్‌పి జయంతిలాల్, కానుగుల గోపినాధ్, దుప్పటి సాంబయ్య, నలబాల క్రిష్ణయ్య, ఇనగాల రమేష్, కామిడి రత్నాకర్‌రెడ్డి, గొర్రె సాగర్, వేమునూరి సదానందం, దొడ్డి క్రిష్ణయ్య, వెంకటేష్‌గౌడ్, సత్యనారాయణరెడ్డి, చిలుకల రాయకొంరు, గిరుమాండ్ల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
తాత్కాలికం ఇంకెన్నాళ్ళు?
కొత్తగూడ: లో లెవల్ బ్రిడ్జిని తొలగించి హై లెవెల్ బ్రిడ్జినిర్మాణం పేరుతో మండలంలోని గుంజేడు ముసలమ్మ దేవాలయం వద్ద నిర్మాణం పేరుతో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మట్టి రోడ్డుపై ఇంకెన్నాళ్లు ఇబ్బందులు ఎదుర్కోవాలని మండల ప్రజలు వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. గుంజేడు ముసలమ్మ దేవాలయం వద్ద ప్రధాన రహదారిపై ఉన్న లోలెవెల్ బ్రిడ్జి వలన వర్షాకాలంలో పై నుండి వరద నీరు ఉప్పొంగి ప్రవహించడంతో ఈ మార్గం ద్వారా రాక పోకలు పూర్తిగా నిలిచి పోవడం వలన వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనాల్సిన పరిస్థితి నెలకొనడంతో అట్టి బ్రిడ్జి ని హై లెవెల్ గా మార్చుటకు అధికారులు ప్రతిపాదనలు పంపడంతో మంజూరి జరిగింది. ఇట్టి పనులను టెండర్ ద్వారా గత్తుదారు పనులను చేపట్టి తూ..తూ.. మంత్రంగా పనులు నత్తనడకన సాగడం అప్పటి వరకు వాహనాలు రాకపోకలకు తాత్కాలిక మట్టి రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది. హైలెవల్ వంతెన పనులు పూర్తి కాకపోవడం అంతలోనే వర్షాకాలం రావడంతో మట్టి రోడ్డు కొంత మేర కొట్టుకు పోవడం, ఉన్న మట్టి బురదమయం కావడంతో వాహనాలు అందులో దిగబడటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్రిడ్జి పనులు వేసవి చివరి మాసంలో మొదలు పెట్టడం ఆపై గుత్తేదారు అట్టి పనులను వేగవంతం చేయకపోవడం,దీనిపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లనే ఈ జాప్యానికి ప్రధాన కారణమని వాహనదారులు మండల ప్రజలు ఆరోపిస్తున్నారు.నిత్యం దేవాలయానికి భక్తులతో రద్దీగా ఉండడం ఈరహదారిపై వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉండడం ఇంతా రద్దీ ఉండే ఈ రహదారిలో మట్టి రోడ్డు బురద మయం కావడం అందులో వాహనాలు దిగబడడం వలన ఇరువైపుల వాహనాలు నిలిచి పోవడంతో భక్తులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.వర్షాకాలంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మట్టి రోడ్ల పై వర్షాకాలంలో ప్రయాణించాలంటే దేవుడి మీద భారం వేసి ప్రయాణిస్తున్నామని అంటున్నారు. ఇప్పటికైన అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి పనుల్లో వేగం పెంచి బ్రిడ్జి నిర్మాణపనులు పూర్తి చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.

ఘనంగా రాజీవ్ జయంతి
కేసముద్రం: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతి వేడుకలు ఆదివారం కేసముద్రం మండలంలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షుడు గుగులోత్ దస్రునాయక్ కేక్ కట్ చేసి, రాజీవ్ చిత్ర పఠానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు అల్లం నాగేశ్వర్‌రావు, గుగులోత్ వీరునాయక్, బాలునాయక్, వెంకన్న, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. కేసముద్రం (వి) గ్రామంలో ఉప సర్పంచ్ మేకల వీరన్న, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు తోట వెంకన్న ఆధ్వర్యంలో రాజీవ్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులఠ్పించిన అనంతరం స్థానిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామడుగు వెంకటచారి, సంకెపల్లి శ్రీనివాస్‌రెడ్డి, సత్తిరెడ్డి, సురేందర్, శ్రీశైలం, నర్పయ్య, సాహెబ్, సాయిలు పాల్గొన్నారు.

అంతర్గత రోడ్ల నిర్మాణానికి కృషిచేస్తా
* మున్సిపల్ చైర్‌పర్సన్ ప్రేమలతారెడ్డి
జనగామ టౌన్: జనగామ మున్సిపాలిటీ పరిదిలోని అంతర్గత రోడ్లను నిర్మించేందుకు దశల వారీగా కృషి చేస్తున్నానని చైర్‌పర్సన్ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి అన్నారు. నాన్ ప్లాన్ గ్రాంట్స్ 2016-17 సంవత్సరానికి చెందిన నిధుల ద్వారా స్థానిక 8వ వార్డులో నిర్మించే రోడ్డు పనులకు ఆదివారం ఆమె శంకుస్థాపన చేశారు. అనంతరం చైర్‌పర్సన్ ప్రేమలతారెడ్డి మాట్లాడుతూ జనగామ పట్టణాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు సమగ్రమైన నివేదికను రూపొందించి ప్రభుత్వానికి అందచేశామని అన్నారు. ప్రభుత్వం అందుకు అనుకూలంగా స్పందించిందని తెలిపారు. త్వరలోనే రింగురోడ్డు పనులకు శంకుస్థాపన చేయనున్నట్టు వివరించారు. అలాగే అంతర్గత రోడ్ల నిర్మాణానికి కావాల్సిని నిధులను జనరల్‌ఫండ్ నుండే కాక ప్రభుత్వం అందచేసే నిధుల ద్వారా చేపడుతున్నామని తెలిపారు. వర్షాకాల సీజన్‌లో రోడ్లపై ఏర్పడే గుంతల పూడ్చివేతకు ఎప్పటికప్పుడు చర్యలు చేపుడుతున్నామని అన్నారు. 8వ వార్డు కౌన్సిలర్ జక్కుల అనిత మాట్లాడుతూ జూబ్లీ ఫంక్షన్‌హాల్ నుండి సుమారు 240 మీటర్ల పొడవునా సీసీరోడ్డు వేయనున్నట్లు తెలిపారు. కోరగానే రూ. 6లక్షల నిధులు మంజూరు చేసినందుకు చైర్‌పర్సన్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈలు శాంతిస్వరూప్, సృజన్‌రెడ్డి, నాయకులు జక్కుల వేణుమాధవ్, వేణుగోపాల్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, నాగరాజు, లింగయ్య, కమాలొద్దీన్, రాజు, సుదర్శన్, కేశవులు పాల్గొన్నారు.

ఘనంగా బోనాల పండుగ
జనగామ టౌన్: జనగామ జిల్లా వ్యాప్తంగా ప్రజలు బోనాల పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. శ్రావణమాసం ముహుర్తాలు ముగుస్తున్న నేపథ్యంలో ఆదివారం బోనాల పండుగను ఎస్సీ, బిసి, రెడ్డి కులాలకు చెందిన ప్రజలు ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామదేవతలైన పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, దుర్గమ్మ, పెద్దమ్మ, దేవతల ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఉదయం దేవాలయాలకు వెళ్లి పూజలు నిర్వహించిన ప్రజలు సాయంత్రం బోనాలతో వెళ్ళి మొక్కులు చెల్లించారు. జనగామ జిల్లా కేంద్రంలోని పోచమ్మ దేవాలయం వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటుచేయగా ఆలయ అభివృద్ధి కమిటీ భక్తులకు కావాల్సిన సౌకార్యలను ఏర్పాటుచేశారు. అలాగే బతుకమ్మ కుంట దుర్గామాత, ఎల్లమ్మ దేవాలయాల వద్ద, వడ్లకొండ రోడ్డులోని పెద్దమ్మ, కనుకదుర్గమ్మ దేవాలయాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ చైర్‌పర్సన్ బండ పద్మ యాదగిరిరెడ్డి దంపతులు బతుకమ్మకుంట రేణుకామాత దేవాలయంలోకి బోనంతో వెళ్లి మొక్కులు చెల్లించారు. 8వ వార్డు కౌన్సిలర్ జక్కుల అనిత ఆధ్వర్యలో ఆ వార్డు మహిళలు పోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేయగా 4వ వార్డు కౌన్సిలర్ ఆలేటి లక్ష్మి బోనంతో వెళ్లి కుర్మవాడ దేవాలయం వద్ద నైవేద్యం సమర్పించారు. పిల్లాపాపలను సల్లంగా చూడాలని తల్లులను వేడుకున్నారు.
నర్మెటలో...
నర్మెట మండల కేంద్రంలో గ్రామస్థులు ఎల్లమ్మ, పోచమ్మ, పెద్దమ్మ దేవతలకు బోనాలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలోని వీధులన్నీ బంధు మిత్రులతో కళకళలాడాయి. దేవాలయాలన్నీ రంగురంగుల విద్యుత్ కాంతులతో విరజిమ్మే విధంగా అలంకరించారు. మహిళలు ఆయా దేవాలయాలకు బోనాలతో వెళ్లి నైవేద్యం సమర్పించారు. వర్షాలను విస్తారంగా కురిపించి పాడిపంటలు సమృద్ధిగా పండేవిధంగా కరుణించాలని భక్తులు అమ్మవార్లను వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో గొట్టేటి వెంకటయ్య, పులి మధుసూధన్, పులి రాజు, నక్కల భూమయ్య, నిమ్మకంటి బాలయ్య, బుగులయ్య పాల్గొన్నారు.
ఘనంగా పోచమ్మతల్లికి బోనాలు
బచ్చన్నపేట: మండలంలోని ఆలింపూర్, కొడువటూరు గ్రామాల్లో ఆదివారం గ్రామస్థులు పోచమ్మతల్లికి బోనాలు ఘనంగా నిర్వహించారు. గ్రామ పరిసరాల్లో ఉన్న పోచమ్మ తల్లి ఆలయాన్ని పంచాయతీ నిర్వహకులు మూడురోజుల ముందుగానే రంగులతో అద్ది విద్యుత్ దీపాలతో అలంకరించారు. పోచమ్మతల్లికి ప్రీతిపాత్రమైన ఆదివారం రోజున మహిళలు నైవేద్యం వండి బోనాలను వేపకొమ్మలు, పసుపు, కుంకుమలతో అలంకరించి, పోతరాజుల విన్యాసాలతో ఊరేగింపుగా తీసుకెళ్లారు.
బోనాలు నెత్తినపెట్టుకున్న మహిళలు పోచమ్మతల్లి ఆలయం చుట్టూ ప్రదక్షణలు నిర్వహించి నైవేద్యం సమర్పించారు. తమను చల్లంగా చూస్తే బోనాలు సమర్పించి పూజలు చేసి వేడుకుంటామంటూ మొక్కులు చెల్లించుకున్నారు.
బోనాల పండుగ కావడంతో ఆడపడుచులతో గ్రామం సందడిగా మారింది. గ్రామస్థులకు ఇబ్బంది కలుగకుండా పంచాయతీ సర్పంచ్ నరెడ్ల బాల్‌రెడ్డి ఆధ్వర్యంలో వీధులన్ని విద్యుత్ దీపాలతో అలంకింపజేశారు.

కనువిందు చేస్తున్న లక్నవరం చెరువు
గోవిందరావుపేట: చుట్టూ ప్రకృతి సహజమైన కొండలు, పక్షుల కిలకిలరావాలు, పచ్చని చెట్ల మధ్య ఉన్న లక్నవరం చెరువు గత మూడు, నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో భారీగా నీరు చేరి మత్తడి పడుతోంది. దీంతో లక్నవరం చెరువు పర్యాటకులను మరింతగా ఆకర్షిస్తోంది. రైతులకు కల్పతరువైన లక్నవరం అటు అన్నదాతలకు, ఇటు ప్రకృతి ప్రేమికులకు ఆకట్టుకుంటూ ఉమ్మడి రాష్ట్రంలోనే మొట్టమొదటి ఊయల వంతెనను తన సొంతం చేసుకొని పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. నాలుగు రోజులుగా కురుస్తున్న భారీవర్షాలకు చెరువులోకి పూర్తిస్థాయిలో వర్షపు నీరు వచ్చి చేరడంతో శనివారం అర్ధరాత్రి నుండి చెరువుకు మత్తడి పడుతోంది.
లక్నవరం చెరువు నిండి మత్తడి పడుతున్నట్లు తెలియటంతో లక్నవరం అందాలను తిలకించేందుకు ఆదివారం వివిధ ప్రాంతాలకు చెందిన పర్యాటకులతోపాటు, స్ధానికులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఖరీఫ్ పంట సాగుపై ఇక్కడి అన్నదాతలలో సంశయం నెలకొన్న నేపథ్యంలో చెరువు నిండి మత్తడి పడటంతో ఇక రబీపంటకు కూడా ఢోకా లేదని రైతులు ధీమా, ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఘనంగా రాజీవ్ జయంతి వేడుకలు
కాటారం: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 73వ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. సాంకేతిక రంగాల్లో అభివృద్ధి సాధించడంలో రాజీవ్ గాంధీ ఎనలేని కృషి చేశారని కాంగ్రెస్ నాయకులు కొనియాడారు.
కాటారంలో...
మండల కేంద్రమైన గారెపల్లిలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. అనంతరం యూత్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఫ్లోర్ లీడర్ చల్ల నారాయణ రెడ్డి, సర్పంచ్ కొర్ర మనోహర్ నాయక్, ఎంపిటిసిలు పంతకాని సమ్మయ్య, బండి స్వరూపరమేష్, నర్సింగరావు, కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ అధ్యక్షుడు వేమునూరి ప్రభాకర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ అధ్యక్షుడు చీమల సందీప్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు బండారి శ్రీ్ధర్, నాయకులు చీర్ల తిరుపతిరెడ్డి, కొట్టె శారదప్రభాకర్, మంత్రి నరేష్, రామిళ్ళ కిరణ్, అంగజాల అశోక్, కడారి విక్రం, మేడిపల్లి కిరణ్, బోద తిరుపతి, రాజు తదితరులు పాల్గొన్నారు.
మహాదేవపూర్‌లో...
మండల కేంద్రంలోని ఐబి అతిథి గృహంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ సేవలను కొనియాడారు.
కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జవ్వాజి తిరుపతి, సర్పంచ్ కోట రాజబాపుగౌడ్, మహిళా కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ అధ్యక్షురాలు కేదారి గీతా, మంథని డివిజన్ యూత్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి ఎరవెల్లి విలాస్ రావు, కాళేశ్వరం దేవస్థానం మాజీ చైర్మన్ గుడాల క్రిష్ణమూర్తి, గడ్డం వెంకటస్వామి, కుంభం బాపురెడ్డి, ఉస్మాన్, షాహినుల్లా ఖాన్ పాల్గొన్నారు.
మొగుళ్ళపల్లిలో...
మండల కేంద్రంలో రాజీవ్ గాంధీ 73వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సింగిల్ విండో సొసైటీ అధ్యక్షుడు నరహారి బక్కిరెడ్డి రాజీవ్ విగ్రహానికి పూలమాలలు వేసి, పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు జోరుక సదయ్య, గోపాల్ రావు, సమ్మిరెడ్డి, తిరుపతి, విప్లవరెడ్డి, నర్సింహారెడ్డి, రమేష్, పాల రవి, క్రిష్ణారెడ్డి, తదితర నాయకులు పాల్గొన్నారు. పాలు, పండ్లు పంపిణీ చేశారు.

ప్రత్యేక అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలి
* నిధులను రికవరీ చేయాలి
మంగపేట: మండలంలోని పలు పంచాయతీలలో అక్రమాలకు పాల్పడిన పంచాయితీ కార్యదర్శులను సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు ఆయా గ్రామాల ప్రత్యేక అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులు, రాజకీయ జెఎసి నాయకులు కోరుతున్నారు. మండలంలో గ్రామ పంచాయతీకి పాలకవర్గం లేకపోవడంతో ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ప్రత్యేక అధికారిని ప్రభుత్వం నియమించింది. గ్రామంలోని అభివృద్ధి పనులకు సంబందించిన బిల్లుల చెల్లింపులో కూడా పంచాయతీ కార్యదర్శికి, గ్రామ ప్రత్యేక అధికారికి సంయుక్తంగా చెక్‌పవర్ ఇచ్చారు. అయితే నిధులను దుర్వినియోగం చేశారనే అభియోగంతో గతంలో కమలాపురం పంచాయితీ కార్యదర్శి చిలకమర్రి పుల్లయ్య, రాజుపేట పంచాయతీ కార్యదర్శి మున్వర్, బోరు నర్సాపురం పంచాయతీ కార్యదర్శి సుకూర్‌తో పాటు గతంలో తిమ్మంపేట, బోరు నర్సాపురం, రాజుపేట, కమలాపురం గ్రామ పంచాయితీలకు ప్రత్యేక అధికారిగా ఉన్న ఇఓపిఆర్‌డి ఆలేటి సుదర్శన్‌ను నిధుల దుర్వినియోగం అభియోగాలపై సస్పెండ్ చేశారు. తాజాగా కమలాపురం జెఏబిసిగా ఉన్న జంపుల ఆంజనేయులు 17.23 లక్షల రూపాయలు కాజేశాడని 2017 జూలై 28న కమలాపురం గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామస్థుల సమక్షంలో నిర్వహించిన బహిరంగ విచారణలో తేలింది. దీంతో తాజాగా శనివారం కమలాపురం జెఎబిసిగా విధులు నిర్వహిస్తున్న ఆంజనేయులను కూడా సస్పెండ్ చేశారు. పంచాయతీలలో అవకతవకలు పాల్పడి ప్రజాధనం దుర్వినియోగం చేశారనే ఆరోపణల విషయంలో పంచాయతీ కార్యదర్శితో పాటు ఆ గ్రామ ప్రత్యేక అధికారి పాత్ర కూడా ఉంటుందని నిధులు దుర్వినియోగం అయిన పంచాయతీలలో ఆయా గ్రామ ప్రత్యేక అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.

వినాయక మండపాలలో ఇవి పాటించండి

కాటారం: ఈ నెల 25న వస్తున్న వినాయక చవితిని పురస్కరించుకొని తమ తమ ఊరు వాడలలో వినాయక విగ్రహాల ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో మండపాలు ఏర్పాటుచేయడానికి ముందస్తుగా కొన్ని విషయాలు తెలుసుకోవాలని పలువురు పెద్దలు, అధికారులు సూచిస్తున్నారు. ఇందుకు దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలను రూపొందించిందని తెలియజేశారు. ఏటా హిందువుల ఆది దేవుడి పండుగైన వినాయక చవితి సందర్భంగా నిర్వహించుకునే నవరాత్రుల సమయంలో ముస్లిమ్‌ల బక్రీద్ పండుగ కూడా వస్తుందని పేర్కొంటున్నారు. ఈ సమయంలో హిందూ, ముస్లిమ్‌లు సోదర భావంతో పండుగలు నిర్వహించుకోవాలని సూచించారు. అలాగే పలువురు అనేక ప్రాంతాల్లో శాంతి సమావేశాలు నిర్వహించి, సహృద్భావ వాతావరణంలో ఇరు మతాలకు చెందిన పండుగలను శాంతి, సామరస్యాలతో నిర్వహించుకునేందుకు ఆచరణాత్మక నియమాలను రూపొందించారు.
వినాయక విగ్రహాల మండపాలను ఏర్పాటుచేయాలనుకుంటున్న ఊరు, వాడ, ప్రదేశాన్ని ముందస్తుగా గ్రామ పంచాయతీతో పాటు పోలీసులకు సమాచారం అందించాలి. నిర్వాహకులు తమ పూర్తి పేరు, తమ మొబైల్ ఫోన్ నెంబర్లను వినాయక మండపాల ముందు పెద్ద బోర్డు రాసి ప్రదర్శించాలి.