వరంగల్

శాస్త్ర, సాంకేతిక రంగ అభివృద్ధికి ఆద్యుడు రాజీవ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్: దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ 73వ జయంతి వేడుకలను జిల్లా కాంగ్రెస్, నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. నగరంలోని ఎంజిఎం సెంటర్‌లో రాజీవ్‌గాంధీ విగ్రహానికి నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కట్ల శ్రీనివాస్‌రావు ఆధ్వర్యంలో పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో రాజీవ్ చిత్రపటానికి పూలమాలలు వేసిన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నగర కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ దేశ ఆర్థిక విధానాలను సరళీకృతం చేసే అనేక చట్టాలు రాజీవ్‌గాంధీ హయాంలోనే అంకురార్పణ జరిగాయని చెప్పారు. రాజీవ్‌గాంధీ ముందుచూపు కారణంగా పార్టీ ఫిరాయింపుల చట్టం అమలులోకి వచ్చిందని అన్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాలలో ఇప్పుడు జరిగిన గణనీయ అభివృద్ధికి రాజీవ్‌గాంధీ ఆద్యుడని తెలిపారు. చిన్నవయసులోనే రాజీవ్‌గాంధీని కోల్పోవటం దేశానికి, కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టమని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నెమిండ్ల శ్రీనివాస్, తక్కల్లపల్లి రాము, నాయిని లక్ష్మారెడ్డి, వింజమూరి లక్ష్మిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పిసిసి కార్యదర్శి బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు సమ్మిరెడ్డి, ప్రేంకుమార్, ప్రసన్న తదితరులు హన్మకొండ టైలర్‌స్ట్రీట్‌లోని రాజీవ్‌గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బొద్దిరెడ్డి మాట్లాడుతూ రాజీవ్ హయాంలో తీసుకున్న పలు నిర్ణయాలతో ఇప్పుడు భారతదేశం శక్తివంతంగా మారి ప్రపంచంలోని పలు అగ్రదేశాలతో సమానంగా గౌరవం పొందగలుతోందని చెప్పారు. రాజీవ్ హయాంలో ప్రవేశపెట్టిన సమాచార, శాస్త్ర, సాంకేతిక విప్లవంతో దేశం ఇప్పుడు ఆ రంగాలలో ఎంతో ప్రగతి సాధించిందని అన్నారు. మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నగర మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పోశాల పద్మ ఆధ్వర్యంలో వరంగల్ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసారు. ఈ సందర్భంగా మాజీ మేయర్ స్వర్ణ, పోశాల పద్మ మాట్లాడుతు యువతకు రాజీవ్‌గాంధీ హయాంలో ఎంతో ప్రాధాన్యత లభించిందని, 18ఏళ్లకే ఓటు హక్కు ఆయన హయాంలోనే కల్పించారని చెప్పారు. దేశంలో ఆధునిక సాంకేతికత వినియోగంలోకి వచ్చింది ఆయన కారణంగానే అని తెలిపారు.