వరంగల్

గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూపాలపల్లి రూరల్: గిరిజనులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా చిత్తశుద్ధితో కృషిచేస్తోందని శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసుదనాచారి తెలిపారు. ఆదివారం ఇక్కడ తెలంగాణ రాష్ట్ర గిరిజన ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఉత్తమ గిరిజన ఉద్యోగులను స్పీకర్ మధుసూధనాచారి, మహబుబాబాద్ ఎంపి సీతారాం నాయక్ సన్మానించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ అటవీ ప్రాంతల్లో అభివృద్ధికి దూరంగా నాడు గిరిజనలు జీవనం సాగించారని, వారిని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతోందని అన్నారు. గిరిజన పిల్లల చదువుల కోసం ప్రత్యేక ఆశ్రమ పాఠశాలలు స్థాపించటం, విద్యా, ఉద్యోగరంగాల్లో ప్రాధాన్యత పెంచటం, సంస్కృతి సంప్రదాయలకు పెద్దపీట వేస్తోందని తెలిపారు. గిరిజనులు చదువుకుని ఉద్యోగాలు చేస్తూ నేడు సమాజంలోని మిగతా అన్ని వర్గాలతో ముందుంటున్నారని అన్నారు. ఎంపి సీతారాం నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వం అందించే అవకాశాలను వినియోగించుకుని ప్రతి ఒక్కరూఅభివృద్ధి చెందాలని సూచించారు. గిరిజనుల హక్కుల సాధన కోసం తనవంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టిఎస్‌టీఈఎఎస్ జిల్లా అధ్యక్షుడు సుక్రునాయక్, జిల్లా ఇంచార్జ్ విమల, సంఘం నాయకులు మున్నానాయక్, చందన్‌సింగ్‌నాయక్, శ్రీనివాస్‌నాయక్, సమ్మయ్యనాయక్ పాల్గొన్నారు.