వరంగల్

నిండుతున్న చెరువులు.. చిగురిస్తున్న ఆశలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లబెల్లి: గడచిన మూడు రోజుల్లో భారీగా కురిసిన వర్షాలతో ఈసారైన పంటలు బాగా పండుతాయని రైతులు ఆశ పడుతున్నారు. జూన్, జూలై మాసంలో అంతంతగా వర్షాలు కురియగా, ఈ నెలలో మాత్రం 197 మిల్లీమీటర్లు వర్షం కురిసింది. మూడురోజులుగా కురస్తున్న వర్షాల కారణంగా మండలంలోని అతి పెద్దచెరువు రంగయ్యచెరువు ఒక ఫీటుతో మత్తడి పోస్తోంది. నారక్కపేటటో లచ్చిరెడ్డిచెరువు, నల్లబెల్లిలో వెంకటపాలెం చెరువు, మైసమ్మకుంట, కనే్నచెరువు, ఊరచెరువు, మామిండ్ల చెరువు, మండలంలోని 20కిపైగా కుంటలు మత్తడి పోస్తున్నాయి. రంగయ్యచెరువు కింద సూమారు 25వందల ఎకరాలకు పైగా వరిపంట సాగు చేయడంకోసం రైతులు సిద్ధంగా ఉన్నారని అదికారులు తెలిపారు. లచ్చిరెడ్డికుంట క్రింద సూమారు రెండువందల ఎకరాలు, వెంకటపాలెం క్రింద 15వందల ఎకరాలు, మేడపల్లి చెరువుకింద మరో 15వందల ఎకరాలు, అనధికారికంగా మరో 15వందల ఎకరాలను సాగుచేయడం కోసం రైతులు సన్నాహాలు చేసుకుంటున్నారు. రంగయ్యచెరువు మత్తడితో వరదనీటికి వాగు పక్కన ఉన్న భూముల్లో ఇసుక మేటలు వేసాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షంతో మండలంలోని కొండాపురం, మామిండ్ల వీరయ్యపల్లి గ్రామాల్లో దెబ్బతిన్న పంటచేలను టిడిపి జాతీయ కార్యదర్శి రేవూరి ప్రకాశ్‌రెడ్డి, రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆదివారం సందర్శించారు. వీరివెంట నర్సంపేట ఆర్డీఓ రవి, నల్లబెల్లి తహశీల్ధార్ రాజేంద్రనాద్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
పరకాల: చాలా రోజుల తరువాత వరుణుడు కరుణించాడు. అల్పపీడనం కారణంగా రుతు పవనాలు ఉపందుకోవడంతో చెరువులు మత్లళ్లు పోస్తున్నాయి. గత మూడు రోజుల నుండి కురుస్తున్న వర్షానికి పరకాల పెద్ద చెరువుల, చలివాగు చెక్‌డ్యాం మత్తడి పోస్తున్నాయి. చలివాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో పరకాల ఎస్సై అభినవ్ చలివాగును దాటవద్దని మైక్ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
పరకాల పట్టణ శివారులోని ఉద్ధృతంగా ప్రవహిస్తున్న చలివాగు ఉద్ధృతిని ఆదివారం పరకాల కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ ఇనగాల వెంకట్రాంరెడ్డి కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆయన వెంట పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పసుల రమేష్, బండి సారంగపాణి, తిరుపతిరెడ్డి, దుప్పటి సాంబశివుడు, మాదాసి రాంమూర్తి, మార్క రఘుపతిగౌడ్, దామ అనిల్, పబ్బ శ్రీనివాస్, మార్క అభినయ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఎండుతున్న పంటలకు ఈ వర్షంతో జీవం వచ్చింది. వానలు లేక ఎండ ఉక్కపోతతో పంటలకు చీడ పీడల తీవ్రత ఎక్కువైంది. వాటిని కాపాడుకునేందుకు పక్షం రోజులుగా అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. ఈ భారీ వర్షాలతో పురుగులు దూరమవుతాయనే వ్యాఖ్యలు రైతులు వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ భారీ వర్షాల వల్ల వరితో పాటు ఆరు తడి పంటలకు ప్రాణం పోసినట్టయంది. ఈ సీజన్‌లో ఇదే అత్యధిక వర్షం కావడం, మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నాయి.