మహబూబ్‌నగర్

హక్కులను ప్రశ్నించేందుకే టిమాస్ ఆవిర్భావం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగర్‌కర్నూల్: అట్టడుగు వర్గాల ప్రజల హక్కులను ప్రశ్నించేందుకే టిమాస్ ఆవిర్భవించిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వీరభద్రం అన్నారు. ఆదివారం పట్టణంలోని ఓ ఫంక్షన్ హల్‌లో జరిగిన టిమాస్ ఆవిర్భవ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడుతూ ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న రాష్ట్రంలో ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను హరింపజేస్తూ ప్రశ్నించే గొంతులను నొక్కుతున్నదని ఆరోపించారు. ప్రశ్నించేందుకే టిమాస్ ఆవిర్భవించిందన్నారు. ఒక్కటొక్కటిగా సంఘాలు ఉంటే ఏమి చేయాలేమని, చీమలు కలిసి కట్టుగా ఉండి పామును చంపిన విధంగా, కొన్ని గడ్డి పోచలు కలిపి తాడుగా చేసి బలవంతమైన ఏనుగును ఏవిధంగా కట్టివేసాయో అదే రీతిన రాష్ట్రంలో విడివిడిగా ఉన్న కుల సంఘాలు, ప్రజాసంఘాల కలిసి ఏర్పరచుకున్నా ఐక్య వేదికనే టిమాస్ అన్నారు. ప్రజాలు కోరుకున్న తెలంగాణ ఏర్పడలేదని, సామాజిక తెలంగాణ కోసం పోరాడుతామన్నారు. వివిధ సందర్భాలలో ప్రభుత్వం ఇచ్చిన హామిలను నెరవేర్చడం లేదని వాటిని అమలుచేయాలని ప్రశ్నిస్తే గొంతును నలిపివేస్తున్నారని, ఉద్యమాలు, పోరాటాలు చేపడితే నిర్భందిస్తున్నారని, పోరాటం చేసేందుకు వేదిక లేకుండా చేస్తున్నరని ఆరోపించారు. సామాజిక హోదా, రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక స్థితిలో సమానత్వం వచ్చినప్పుడే సామాజిక తెలంగాణ వచ్చినట్లన్నారు. భూములు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో రైతుల భూములను లాగేసుకుంటుందని ఆరోపించారు. ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఈ మూడేళ్లలో ఉద్యోగాలు ఇవ్వకుండానే కోర్టులపై నేట్టివేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఇచ్చే నోటిఫికేషన్‌లలోనే లోసుగులు పెట్టి కోర్టులు కొట్టివేసే విధంగా ప్రభుత్వమే కుట్రలు పన్నుతున్నదన్నారు. మళ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో 2లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటిలో కొన్ని ఉద్యోగాలను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నమని ప్రకటనలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. రాజకీయంగా బీసీలకు రిజర్వేషన్‌లు ఉన్నప్పటికి కొన్ని కులాలకే ప్రయోజనం కలుగుతున్నదని, అందరికి అవకాశం కల్పించాలంటే స్థానిక సంస్థలలో కూడా ఎబిసిడిల వారిగా రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. జనాభాలో 52శాతంగా ఉన్న బీసీలకు సబ్‌ప్లాన్ ఏర్పాటు చేసి జనాభా ధమాషా ప్రకారం విధులు కేటాయించాలని, ఇదేమాదిరిగా మైనార్టీలకు కూడా సబ్‌ప్లాన్ ఏర్పాటు చేయాలన్నారు. సామాజిక తెలంగాణ సాధించే వరకు పోరాడుతామన్నారు. గ్రామ, మండల స్థాయిలో కమిటీలని ఏర్పాటు చేసి ఎక్కడ కష్టం ఉంటుందో, ఎక్కడ అన్యాయం జరగుతుందో అక్కడికి టిమాస్ బస్సు వస్తుందనే విషయాన్ని సాటిచెప్పాలన్నారు.

ఆన్‌లైన్‌తో ఇసుక అక్రమాలకు చెక్
మక్తల్: అక్రమ ఇసుక రవాణాను అరికట్టి అవసరమైన వారందరికి ప్రభుత్వం నిర్ణయించిన రేటుతో అందుబాటులోకి ‘పాలమూరు స్యాండ్’ పేరుతో అన్‌లైన్ విధానాన్ని తీసుకురావడం జరిగిందని, ఇందులో భాగంగానే ఆదివారం మక్తల్‌లో ఇసుక రవాణాను ప్రారంభించడం జరిగిందని ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి తెలిపారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి నారాయణపేట సబ్ కలెక్టర్ కృష్ణాదిత్యతో కలసి మండల పరిధిలోని సంగంబండ వాగునుండి ఇసుకను తరలించేందుకై జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అక్రమ ఇసుకను రవాణాచేస్తూ కొందరు ట్రాక్టర్ యజమానులు సొమ్ము చేసుకొవడాన్ని ప్రభుత్వం చెక్ పెట్టడానికే ఈఅన్‌లైన్ విదానాన్ని ప్రారంభించడం జరిగిందని ఎమ్మెల్యే అన్నారు. కిలో మీటర్‌కు రూ.55ల చొప్పున చెల్లించేందుకై రేటును నిర్ణయించడం జరిగిందని తెలిపారు. ప్రజలు ఎవ్వరు కూడా దళారుల మాటలు నమ్మి మోసపోకండని, నిర్భయంగా రూ.1500 డిపాజిట్ చేసిని ట్రాక్టర్ యజమానులకు ఇసుకను రవాణ చేసేందుకై ప్రభుత్వ అనుమతి లభిస్తుందని, ఆతదుపరి మీ ఇంటి వరకు తీసుకొచ్చి ఇసుకను డంపు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు.
ఆన్‌లైన్‌ద్వారా ఇసుకతో జిపిలకు ఎంతో మేలు...సబ్‌కలెక్టర్
ఆన్‌లైన్‌ద్వారా డబ్బులు చెల్లించి ఇసుకను తీసుకెళుతున్న లబ్ధిదారుల నుండి అటు రాష్ట్ర ప్రభుత్వానికి ఆధాయం, ఇటు గ్రామపంచాయతీలకు ఆర్థిక లాభం చేకూరుతుందని సబ్‌కలెక్టర్ కృష్ణాదిత్య అన్నారు. ఈసందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఆన్‌లైన్ ద్వారా ఇసుకను కొనుగోలు చేయడంతోటి ముఖ్యంగా అక్రమ ఇసుక విధానానికి చెక్ పెట్టడమే కాకుండా ట్రాక్టర్ యజమానులు, కూలీలు, పంచాయతీలు, ప్రభుత్వానికి, నిర్మాణదారులకు ఎంతో లాభం చేకూరుతుందని సబ్‌కలెక్టర్ అన్నారు. నిర్ణిత లోతులోనే తవ్వకాలు జరుపాలని ట్రాక్టర్ యజమానులకు సబ్ కలెక్టర్ సూచించారు. ఇసుక కావలసి వారికి సంబందించిన వివరాలు ట్రాక్టర్ యజమానుల సెల్ ఫోన్లకు వస్తాయని తెలిపారు. కిలో మీటర్‌కు రూ.55లు తక్కువగా అవుతాయని ట్రాక్టర్ యజమానులు రవిశంకర్‌రెడ్డి, కోళ్ల వెంకటేష్, కావలి శ్రీహరి, దండు వెంకట్‌రెడ్డిలు సబ్‌కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన ముందుగా ఈవిదానాన్ని ప్రారంభిద్దామని, ఎక్కడ ఏఏ లోటుపాట్లు వస్తాయో గమనించాక తప్పకుండా మార్పు చేయడం జరుగుతుందని తెలిపారు. దీంతో మొదటి రోజు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న 3ట్రాక్టర్లకు ఇసుకను తీసుకెళ్లేందుకై అనుమతిచ్చారు. ఈకార్యక్రమంలో తహశీల్దార్ ఓంప్రకాష్, ఎంపిటిసి సభ్యులు రవిశంకర్‌రెడ్డి, సర్పంచ్ పార్వతమ్మ, నాయకులు కావలి శ్రీహరి, వెంకటేష్, చందపూరం చంద్రశేఖర్, బాల్‌రాంరెడ్డి, బాల్‌రెడ్డి, గాలిరెడ్డి, మహిపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

తాగునీటి ఎద్దడి నివారణకు ఎమ్మెల్సీ కృషి
వెల్దండ: వెల్దండ మండలంలో తాగునీటి ఎద్దడి నివారణకు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ఎనలేని కృషి చేస్తున్నారని వెల్దండ జడ్పీటిసి వెంకటమ్మ అన్నారు. అదివారం వెల్దండ మండలం రాయిచెట్టుబావితాండలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నిధులతో నూతన భోరు డ్రిల్లింగ్ పనులను జడ్పీటిసి వెంకటమ్మ భూమిపూజ చేసి ప్రారంబించారు. ఈసందర్బంగా వెంకటమ్మ మాట్లాడుతూ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కల్వకుర్తి ప్రాంతానికి సాగు,తాగు నీరేందించేందుకు నిర్విరామంగా కృషి చేప్తున్నారన్నారు. ఈ ఎడాది వేసవి కాలంలో కల్వకుర్తి తాలుకాలో ఎక్కడ తాగునీటి సమస్య ఉంటే అక్కడ నూతనంగా బోర్లు వేయించి దాహర్తి తీర్చడం జరిగిందన్నారు. ఈకార్యక్రమంలో టిఅర్‌ఎస్ నాయకులు అమర్‌సింఘ్, ఎను, బాలు నాయక్, రాజు, తుల్చా, లచ్చిరాం, లక్ష్మణ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
అన్నా.. వ్యవసాయం ఎట్లుంది
వెల్దండ: అన్న వ్యవసాయ సాగు పనులు ఎలా ఉన్నాయి బాగున్నాయా లేదంటూ కల్వకుర్తి ఎమ్మెల్యే చల్లావంశీచంద్‌రెడ్డి రైతన్నలను అడిగి తెలుసుకున్నారు. ఆదివారం వెల్దండ మండలం అజీలాపూర్ గ్రామం నుంచి అమనగల్లుకు వస్తున్న ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి కొద్ది సేపు అపి రైతన్నలతో ముచ్చటించారు.వ్యవసాయ పనులు ఎలా సాగుతున్నాయి, బ్యాంకులు సకాలంలో రుణాలు ఇస్తున్నారా, ఇటీవల కురిసిన వర్షాలతో లాభ నష్టలు ఎలా ఉన్నాయంటూ అడిగి తెలుసుకున్నారు.కాలంతో పాటు ప్రభుత్వం కూడ ఎంత మాత్రం సహకరించడం లేదంటూ రైతన్నలు ఎమ్మెల్యేకు బదులిచ్చారు. చేసిన కష్టనికి తగ్గ ప్రతిఫలం రావడం లేదంటూ వాపోయ్యారు.రైతన్నలను విస్మరిస్తే ఎవ్వరికి మనుగడ ఉండదని,రైతుల ఊసురు ఎవ్వరు పోసుకోవద్దని చెప్పారు.

కోండ్రోనిపలిల్లో పశువులు మృత్యువాత!
* పట్టించుకోని అధికారులు
ధన్వాడ: మండల పరిధిలోని కోండ్రోనిపల్లి గ్రామంలో గతవారం రోజులుగా గ్రామంలో ఉన్న పశువులు వ్యాధులతో మరణిస్తున్నయని గ్రామరైతులు రాములు,రాజప్ప,రాఘవులు తెలిపారు. ఆదివారం మరికల్ మండల కేంద్రంలో స్థానిక విలేకర్లతో రైతులు మాట్లాడుతూ తమ దగ్గర ఉన్న ఎద్దులు పలు వ్యాధులతో మరణిస్తున్నాయని వారు తెలిపారు. ఈ విషయంపై మండల పశువువైద్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదన్నారు. ఈ విషయంపై అధికారులు స్పందించి గ్రామంలో ఉన్న పశువులకు వైద్యచికిత్సలను నిర్వహించాలని గ్రామరైతులు కోరుతున్నారు.
వినాయక మండపాల వివరాలు అందించాలి
మద్దూర్: వినాయక చవితి సందర్భంగా మండలంలో వినాయక ప్రతిష్టాపన చేసే మండపాల వివరాలను స్థానిక పోలీసు స్టేషన్‌లో అందించాలని ఎస్సై శ్రీనివాస్‌రావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలో వినాయక ప్రతిష్టాపన చేసే ప్రతి ఒక్కరు నిర్వాహకుల పేర్లు, నిమర్జనం చేసే తేది తదితర అంశాలతో పూర్తి వివరాలు అందించాలని ఆయన తెలిపారు.
22న మండల క్రీడాకారుల ఎంపిక
మద్దూర్: క్రీడా సమైఖ్య ఎస్‌బిఎఫ్ పథకం ద్వారా మండల స్థాయి క్రీడాకారుల ఎంపికను ఈ నెల 22వ తేదిన నిర్వహించనున్నట్లు ఎస్‌బిఎఫ్ మండల కన్వీనర్ వెంకటప్ప, సోమ్లానాయక్ తెలిపారు. మండలంలోని పెదిరిపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో కబడ్డీ, వాలీబాల్, ఖోఖో క్రీడల్లో పాల్గొనేందుకు అండర్-14,17 క్రీడాకారులను ఎంపి చేయనున్నట్లు తెలిపారు. మండలంలోని ప్రతి పాఠశాల నుండి నలుగురు విద్యార్థులు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు జారీ చేసిన బోనాపైడ్, దృవీకరణ పత్రాలతో హజరుకావాలని సూచించారు.
పర్వతాపూర్ మైసమ్మ అడవిలో చిరుత సంచారం
* ఆవు, మేకలను ఆరగించిన వైనం
నవాబుపేట: నవాబుపేట మండలంలోని చాకలి పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోగల నీర్సాబ్ తండాకు చెందిన కడావత్ ధర్మ్యా నాయక్ కు సంబందించిన ఆవు,మేకలను ఆదివారం చిరుతపులి ఆరగించింది. పపర్వతాపూర్ మైసమ్మ అడవిలోకి తన పశువులను మేపడానికి ధర్మ్యానాయక్ తోలుకొని వెళ్తుండగా మధ్యాహ్నం 2గంటల సమయంలో అవి కనిపించకుండా పోయాయి. వాటికోసం అడవిలో వెతకగా ఆవు,మేకలు చిరుత దాడిలో మృత్యువాతపడి కనిపించాయి. చిరుత దాడిలో తన ఆవు,మేకలు మృత్యు వాత పడ్డాయని తనకు ఆర్థిక సహాయం అందించాలని ధర్మ్యా నాయక్ అధికారులకు విఙ్ఞప్తి చేశారు.
మండల అధ్యక్షుడిపై దాడికి నిరసనగా బిజెపి ధర్నా
నవాబుపేట: నవాబుపేట మండల బిజేపి అధ్యక్షుడు బాలస్వామిపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయకుండా పోలీసులు తాత్సరం చేయడాన్ని నిరసిస్తూ ఆదివారం బిజేవైఎం ఆధ్వర్యంలో మండల కేంద్రంలో రాస్తారోకో,్ధర్నా చేశారు. బిజేవైఎం స్టేట్ స్టడి సర్కిల్ అధ్యక్షుడు పాలాది రాంమోహన్ ఆధ్వర్యంలో ఈఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు గంట సేపుకొనసాగిన ఈ ఆందోళన కార్యక్రమంలో రాంమోహన్ మాట్లాడుతూ రాష్ట్రంలో బిజేపి నాయకులపై టిఆర్‌ఎస్ నాయకుల ఆగడాలు శృతి మించాయని ఆందోళన వ్యక్తం చేశారు. దాడులు జరిగినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. నవాబుపేట మండల బిజేపి అధ్యక్షుడు బాలస్వామి పై ఆగ్రామ సర్పంచ్ భర్త వెంకటయ్య ఆయన సోదరులు సాయన్న, బాలకృష్ణ, కృష్ణయ్య,శ్రీనివాసులు,పాండయ్యలు దాడి చేసి మూడు రోజులైనా నేటి వరకు పోలీసులు వారిపై చర్యలు తీసుకోకపోవడం శోచనీయమని అన్నారు. కేసు నమోదు చేసుకున్న 24 గంటల్లో నిందితులపై చర్యలు తీసుకోవాల్సిఉన్న నేటి వరకు స్థానిక పోలీసులు టిఆర్‌ఎస్ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి వారిపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. బిజేపి నాయకులపై దాడులు చేస్తే సహించబోమని ఆయన హెచ్చరించారు. బిజేపి నాయకుల ఆందోళన విషయం తెలుసుకున్న మహాబూబ్‌నగర్ రూరల్ సిఐ రామకృష్ణ హన్వాడ,మహాబూబ్‌నగర్ రూరల్ ఎస్సైలతో పాటు పోలీసు సిబ్బందితో హుటాహుటిన అక్కడికి చేరుకొని బిజేపి నాయకులతో చర్చలు జరిపారు. నిందితులపై వెంటనే చర్యలు తీసుకుంటామని సిఐ హామీ ఇవ్వడంతో బిజేపి నాయకులు ఆందోళన విరమించారు.ఈకార్యక్రమంలో బిజేవైఎం జిల్లా అధ్యక్షుడు తిరుపతి రెడ్డి,జడ్చర్ల నియోజకవర్గ అధ్యక్షుడు జహంగీర్, నాయకులు నాగరాజు,మహేశ్ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా రాజీవ్‌గాంధీ జయంతి
వనపర్తి: రాజీవ్‌గాంధీ దేశానికే ఆదర్శమని ఎమ్మెల్యే చిన్నారెడ్డి అన్నారు. భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్‌గాంధీ 73వ జయంతిని పురస్కరించుకొని ఆదివారం వనపర్తి రాజీవ్‌చౌరస్తాలోని రాజీవ్ విగ్రహానికి పూలమాల వేసి కాంగ్రెస్ నాయకులు నివాళు అర్పించారు. అనంతరం వనపర్తిలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలకిష్టయ్య క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన బహిరంగ సభలో ఎమ్మెల్యే చిన్నారెడ్డి మాట్లాడుతూ దేశానికి ఇంధిరమ్మ చేసిన సేవలు మరువలేనివని అలాగే రాజీవ్‌గాంధీ తన ప్రాణాలనే దేశం కోసం పనంగా పెట్టారని అన్నారు. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ ప్రధానులు అయ్యే అవకాశం ఉన్నప్పటికి ఎలాంటి పదవీ కాంక్ష లేకుండా ఒక మంచి వ్యక్తిని ప్రధానిగా చేయాలన్న ఉద్దేశంతో మన్మోహన్ సింగ్‌ను ప్రధానిగా చేసిన ఘనత వారిదన్నారు. టిఆర్‌ఎస్ నాయకులు రాహుల్‌గాంధీ గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని ఆయన అన్నారు. గతంలో తాము రావుల చంద్రశేఖర్ రెడ్డి పార్టీ పిరాయింపులను ప్రోత్సహించలేదని టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాకా డబ్బులిచ్చి మరి పార్టీ పిరాయింపులకు ప్రోత్సహిస్తున్నారని ఆయన ఆరోపించారు. పార్టీ నుండి వెళ్లిన వారంతా తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. టిఆర్‌ఎస్‌లో అసంతృప్తి పెరిగిందని కేవలం డబ్బులకు ఆశపడి వెళ్లిన వారు తిరిగి స్వంత పార్టీలకు రావడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఇప్పటి నుండి ఆ పార్టీ నుండి తమ పార్టీలోకి పెద్ద ఎత్తున చేరుతారని ఇది ఆరంభం మాత్రమేనని అన్నారు. యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో సుమారు 200 మంది యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు శంకర్‌ప్రసాద్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్‌గౌడ్, నాయకులు తిరుపతయ్య, రాజేంద్రప్రసాద్, రాగివేణు, వెంకటస్వామి, కృష్ణబాబు, ధనలక్ష్మి, శివసేనారెడ్డి, శ్యామ్‌కుమార్, వాల్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.
గద్వాలటౌన్‌లో...
గద్వాలటౌన్: భారతదేశంలో సాంకేతిక రంగాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు దివంగత ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ కృషి చేశారని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు నడుం బిగించాలని గద్వాల ఎమ్మెల్యే డికె అరుణ అన్నారు. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతి వేడుకలను ఆదివారం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాతబస్టాండులోని రాజీవ్‌మార్గ్‌లో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ భారతదేశం క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న సందర్భంలో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి దేశాన్ని అభివృద్ధి వైపు నడిపించిన మహానీయుడని కొనియాడారు. దేశ, విదేశాలకు పోటీగా కంప్యూటర్ యుగాన్ని ప్రోత్సహించి భారతదేశానికి ఘన కీర్తిని తీసుకువచ్చారన్నారు. సమర్థవంతమైన నాయకత్వ లక్షణాలు కలిగిన రాజీవ్‌గాంధీ ఎప్పటికి ఆదర్శప్రాయుడని ఎమ్మెల్యే డికె అరుణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాజీవ్ ఐలాండ్‌లో మొక్కల నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మహిళా జిల్లా అధ్యక్షురాలు బండల పద్మావతి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్‌రెడ్డి, వైస్‌చైర్మన్ శంకర్, నాయకులు కోడిగుడ్ల సలాం, బంగి సుదర్శన్, కుమ్మరి శ్రీనివాసులు, జియల్ చందు, డిటిడిసి నర్సింహా, నాగేంద్రయాదవ్, తుమ్మల నర్సింహులు, ఇంతియాజ్, భాస్కర్‌యాదవ్, అన్వర్, పులిపాటి వెంకటేష్, త్యాగరాజు, బాబర్, నెమలికంటి రామాంజి పాల్గొన్నారు.
కొత్తకోటలో...
కొత్తకోట: రాజీవ్‌గాంధీ 73వ జయంతి వేడుకలను ఆదివారం కొత్తకోట, మదనాపురం, ముసాపేట మండలాల్లో ఘనంగా జరుపుకున్నారు. కొత్తకోటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజీవ్‌గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళు అర్పించారు. మదనాపురం మండలంలో రాజీవ్‌గాంధీ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా జడ్పిటిసి పి.జె బాబు కేక్‌ను కట్ చేసి మాట్లాడుతూ దేశ చరిత్రలో 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులకు ఓటు హక్కు కల్పించాలని చెప్పిన నాయకుడని, ఇన్‌ఫర్‌మేషన్ టెక్నాలజీ అభివృద్ధి చేసింది రాజీవ్‌గాంధీ అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఉమా మహేశ్వర్‌రెడ్డి, ప్రశాంత్, కృష్ణారెడ్డి, పెంటన్నయాదవ్, సాయులు యాదవ్, రాంచంద్రయ్య, నరేందర్‌రెడ్డి, ప్రసాద్, వెంకటయ్య పాల్గొన్నారు.
పాన్‌గల్‌లో...
పాన్‌గల్: దివంగత ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్‌గాంధీ జయంతిని పురస్కరించుకొని ఆదివారం మండల పరిధిలోని రేమద్దుల గ్రామంలో యూత్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బైకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి రవిందర్‌రెడ్డి, మండల అధ్యక్షులు పరమేశ్వర్‌రెడ్డిలు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో పేద ప్రజల సంక్షేమం కోసం కృషి చేసిందని, ప్రజారైతు సంక్షేమమే ద్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేసిందన్నారు. గ్రామ గ్రామాన కాంగ్రెస్ పార్టీ బలోపెతానికి యూత్ కాంగ్రెస్ కృషి చేస్తుందని, కార్యకర్తలు కలిసికట్టుగా ప్రజాపక్షాన నిలిచి పోరాటం కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు శివారెడ్డి, ఉపేందర్, అంజి పాల్గొన్నారు.
ధన్వాడలో...
ధన్వాడ: కాంగ్రెస్ ప్రభుత్వ హయంలోనే నిరుపేదలకు పలుసంక్షేమ పథకాలు అందించడం జరిగిందని జిల్లా కాంగ్రెస్ కమిటి సభ్యులు శేట్టి వీరబసంత్‌కుమార్ అన్నారు. ఆదివారం మరికల్ మండల కేంద్రంలో యూత్‌కాంగ్రెస్ నారాయణపేట ఇంచార్జి రాజారెడ్డి అధ్వర్యంలో మాజిప్రధాని క్రీ,శేలు రాజీవ్‌గాంధీ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.రాజీవ్‌గాంధీ చిత్రపటంకు జిల్లా కాంగ్రెస్ కమిటి సభ్యులు శేట్టి వీరబసంత్‌కుమార్ పూలమాలలు వేశారు. అనంతరం కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయంలోనే పేదప్రజలకు ఇందిరమ్మ గృహలు, మరుగుదొడ్లు, రేషన్‌కార్డులు, పించన్‌లు,నిరుపేదలకు భూములు, ఉద్యోగ అవకాశాలను కల్పించడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ యూత్‌కాంగ్రెస్ నారాయణపేట నియోజకవర్గం ఇంచార్జి రాజారెడ్డి, నాయకులు జి.కృష్ణయ్య, మరికల్ ఉపసర్పంచ్ రవికుమార్, కె.కృష్ణయ్య,కస్పేశ్రీనివాసులు,బాలకృష్ణ,రవిగౌడ్, కుర్మన్న, రామకృష్ణ, మల్లేష్, శ్రీనివాసులు,గణేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మల్దకల్‌లో...
మల్దకల్: మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్‌గాంధీ జయంతిని మండల కాంగ్రెస్ నేతలు మరిచిపోయారు. ఆదివారం 73వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాల్సిన నేతలు బస్టాండు సమీపంలో ఉన్న రాజీవ్‌గాంధీ విగ్రహం చేయి విరిగిపోయినా మరమ్మతులు చేసే నాథుడే కరువయ్యారు. ప్రతి సంవత్సరం వర్ధంతి, జయంతి వేడుకలను జరుపకుండా నాయకులు పదవులకు మాత్రమే పరిమితమవుతున్నారు. మండల కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి కార్యవర్గం లేకపోవడం వల్ల అధ్యక్షుడు, కార్యదర్శి తమకేమి పట్టనట్టుగా వ్యవహరించడం పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
మిడ్జిల్‌లో...
మిడ్జిల్: మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్‌గాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్ మండల పార్టీ ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆదివారం మండల కేంద్రంలోని బస్టాండు ఆవరణలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి జయంతిని నిర్వహించారు. ఈ సందర్బంగా రాజీవ్‌గాంధీ చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు సంపత్‌కుమార్, మండల అధ్యక్షుడు అల్వాల్‌రెడ్డి, నాయకులు వెంకటేష్, సాయిలు, కేశవులు, జహంగీర్, అశోక్, రాజు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
దేవరకద్రలో...
దేవరకద్ర: మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంది 73వ జయంతి వేడుకలు ఆదివారం దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టి కార్యాలయంలో రాజీవ్‌గాంధీ చిత్రపటానికి దేవరకద్ర నియోజవర్గకాంగ్రేస్ పార్టి ఇంచార్జి డోకూర్ పవన్‌కూమార్‌రెడ్డి,కాంగ్రేస్‌పార్టి మండల అధ్యక్షుడు రాందాస్, దేవరకద్ర జడ్పిటిసి లక్ష్మికాంత్‌రెడ్డిలు పూలమాలలు వేసి ఘనంగా నీవాళ్లు అర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ 2019లో రాష్ట్రంలోకాంగ్రేస్, దేశంలో కాంగ్రేస్ పార్టి అదికారంలోకి వస్తుందనే భయంతోనే బిజెపి అధ్యక్షుడు అమిద్‌షా లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కొల్లాపూర్‌లో...
కొల్లాపూర్: మాజీ ప్రధాన మంత్రి, భారత రత్న రాజీవ్ గాంధీ 73వ జయంతి వేడుకలను పట్టణంలో ఘనంగా జరుపుకున్నారు. ఆదివారం ఎంపిపి కార్యాలయం ఆవరణలో రాజీవ్ గాంధీ విగ్రహానికి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కాటం జమ్ములయ్య, ఓబిసి సెల్ జిల్లా అధ్యక్షుడు గాలి యాదవ్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు కిషాన్ నాయక్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కె. రంగదాస్, సురేందర్ సింగ్ తదితరులు పూల మాలలు వేసి నివాళ్లు అర్పించారు. అదే విధంగా పట్టణంలోని శ్రీవాణి విద్యానిలయంలో బీసీసీ ఉపాధ్యక్షుడు రంగినేని జగదీశ్వర్ రాజీవ్ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జవహర్ రోజ్‌ఘర్, ఇందీర అవాజ్ యోజన లాంటి సంక్షేమ పథకాలతో పాటు, 18సంవత్సరాలకే యువతకు ఓటు హక్కును కల్పించిన గొప్ప పరిపాలన అధ్యక్షుడు రాజీవ్ గాంధీయే అన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణయ్య, కేశవులు, జమీర్‌ఖాన్, రాఘవ, రజకస్వామి తదితరులు పాల్గొన్నారు.
తాడూరులో....
తాడూరు: మాజీ ప్రధాన మంత్రి, భారత రత్న రాజీవ్ గాంధీ 73వ జయంతి వేడుకలను మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాలలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు చిన్న రాములు, సింగిల్ విండో చైర్మన్ సమాద్ పాషాలు రాజీవ్ గాంధీ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళ్లు అర్పించారు. అనంతరం వీరు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ ప్రధాన మంత్రిగా ఉన్నపుడు బడుగు బలహహీన వర్గాల వారికి ఇంటి స్థలాలు, ఇండ్ల నిర్మాణాలు ఎస్సీ కుటుంబాలకు వ్యవసాయ బావులను తవ్వియడం జరిగిందన్నారు. కాంగ్రెస్ హాయంలోనే ప్రజలకు న్యాయం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి గొర్ల తిరుపయ్య, మాజీ సర్పంచ్ సత్యమ్మ, నాయకులు నిరంజన్, వెంకటయ్య, బాలస్వామి, ఆంజనేయులు, కృష్ణయ్య, బుచ్చయ్య, ఎండి. ఆష్రాప్ పాల్గొన్నారు.
నాగర్‌కర్నూల్‌లో...
నాగర్‌కర్నూల్: రాజీవ్‌గాంధీ కలలు కన్న గ్రామాలాభివృద్ధిని సాధించినప్పుడే ఆయనకు నిజమైన నివాళి అవుతుందని జడ్పీటిసి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొండ మణెమ్మ అన్నారు. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతిని ఆదివారం పట్టణంలోని ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి స్వగృహంలో ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన చిత్రపటానికి నగరపంచాయతీ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొండ మణెమ్మ, ఎంపిపి బండి శాంతమ్మలతోపాటు పలువురు కాంగ్రెస్ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కార్యకర్తలనుద్ధేశించి మణెమ్మలు మాట్లాడుతూ రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో అనేక సంస్కరణలను తీసుకొచ్చారని , ఆనాడు ఆయన తీసుకొచ్చిన పథకాల వలనే నేడు శాస్త్ర సాంకేతికరంగంలో ప్రపంచంలోనే భారతదేశం ప్రత్యేక గుర్తింపును సాధించిందన్నారు. గ్రామాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని కేంద్రం నుంచి గ్రామాలకు నేరుగా నిధులు వచ్చేవిధంగా జవహార్ రోజ్‌గార్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టారని దాంతో గ్రామాలకు సమృద్ధిగా నిధులు వచ్చి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. యువతకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ 18 ఏళ్లకే ఓటుహక్కు కల్పించడం, అనేక ఉపాధి పథకాలను ప్రవేశపెట్టారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాలమూరు ప్రసాద్, నగేశ్‌యాదవ్, కొండ నగేష్, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నారాయణపేటటౌన్‌లో...
నారాయణపేటటౌన్: నారాయణపేట నియోజకవర్గ కాంగ్రెస్‌లో అసమ్మతి సెగలు రాజుకుని ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరిస్తున్నారు.