మహబూబ్‌నగర్

రాజకీయశక్తిగా ఎదిగినప్పుడే రాజ్యాధికారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్: ప్రజల శక్తియే టిమాస్ అని సామాజిక వర్గాలన్ని రాజకీయ శక్తిగా ఎదిగినప్పుడే రాజ్యాధికారం చేతుల్లోకి వస్తుందని ప్రజాగాయకుడు, టిమాస్ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యుడు గద్దర్ అన్నారు. ఆదివారం మహబూబ్‌నగర్ అంబేద్కర్ కళాభవన్‌లో తెలంగాణ ప్రజా సామాజిక సంఘాల ఐక్యవేదిక (టిమాస్) ఆవిర్భావ సభకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ప్రజాగాయకుడు గద్దర్‌తో పాటు వివిధ సంఘాల నేతలు హజరయ్యారు. ఈ సందర్భంగా గద్దర్ మాట్లాడుతూ టిమాస్ ఆవిర్భావంతో తెలంగాణలోని బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు ఓ రాజకీయవేదికగా కాబోతుందని ఈ వేదిక బలపడితేనే రాజ్యాధికారం చేతుల్లోకి వస్తుందన్నారు. అంభేద్కర్ ఆర్టికల్-3ను రాజ్యాంగంలో పొందపరిచినందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు. సామాజిక వర్గాలే సమాజమని పాలకులు మరిచిపోయారని అందుకే సామాజిక వర్గాలే రాజ్యాధికారంలో ఉండాలనే లక్ష్యంతో టిమాస్ ఆవిర్భావించిందని గద్దర్ తెలిపారు. మహాత్మ జ్యోతిరావుఫూలే 200 సంవత్సరాల క్రితమే ఆడపిల్లల చదువులకోసం తాపత్రయపడ్డారని తెలిపారు. నాటి పాలకులు దళితులను ముఖ్యమంత్రి చెస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి సామాజిక వర్గాల ఓట్లు వేసుకుని గెలిచాక రాజ్యాధికారం పీఠంపై దళితుడిని కాకుండా కెసిఆర్ ముఖ్యమంత్రిగా కూర్చున్నారని ఇది సామాజిక వర్గాలన్ని భరించాలా అని ప్రశ్నించారు. అడవుల్లో నివసించే ఆదివాసి గిరిజనులకు రాజకీయాల్లో న్యాయం జరిగినప్పుడే అంబేద్కర్ ఆశయాలు చిగురిస్తాయన్నారు. ప్రజల ఓట్లను బందిగా చేశారని వాటి నుండి విముక్తి పొంది తమ ఓట్లు అట్టడుగు వర్గాలకే వేసుకునేలా ప్రజలు చైతన్యం కావాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌ను తాను సూటిగా ప్రశ్నిస్తున్నానని మహిళలను బానిసలుగా చూస్తున్నావా అంటూ అందుకే తన మంత్రివర్గంలో మహిళలకు స్థానం ఇవ్వలేదన్నారు. అట్టడుగు వర్గాల మహిళలు వచ్చే ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా టిఆర్‌ఎస్‌కు వేయకూడదని కెసిఆర్ పీఠాన్ని పడగొట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రస్తుతం తిరిగి భ్వూముల చేతుల్లోకి వెళ్లిందని అక్కడి నుండి సామాజిక వర్గాలు తీసుకోవల్సిన అవసరం ఉందన్నారు. అది ఓటుద్వారానే సాధ్యమవుతుందన్నారు. తాను కూడా మారిపోయానని పాడాలంటే గొంగళి,గోచితో వచ్చే వాడినని నేడు టిమాస్ లక్ష్యాన్ని నేరవేర్చడానికి ప్యాంట్, షర్టు, టైతో వచ్చి పాటలు పడుతున్నానంటే ఎంతమార్పు వచ్చిందో ఆలోచించాలన్నారు. రాజకీయశక్తిగా ప్రతి ఒక్కరు ఎదిగి తెలంగాణ రాష్ట్రాన్ని అట్టడుగువర్గాల వారి చేతుల్లో ఉండేలా అందరు టిమాస్ ఉద్యమానికి సహకరించాలని కోరారు. ఈ సభలో నాయకులు రాములు, కురుమూర్తి, కురుమయ్య, వినోద్‌కుమార్, జలజలం సత్యనారాయణ, నర్సయ్య, వెంకటరాములు, సాగర్, ప్రభాకర్, హజమ్మ పాల్గొన్నారు.