మహబూబ్‌నగర్

చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాలటౌన్: ఆకాశంలో సగం... అవనిలో సగం ఉన్న మహిళల ఓట్లు కావాలి, గెలిచి అందలమెక్కాలి కాని చట్ట సభలలో ప్రాతినిధ్యం కల్పించాలంటే మాత్రం మనస్సు ఒప్పుకోదని, మహిళలకు చట్ట సభలలో 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని మాజి మంత్రి వర్యులు, గద్వాల ఎమ్మెల్యే డికె అరుణ అన్నారు. ఆదివారం గద్వాల పట్టణంలోని డికె సత్యారెడ్డి బంగ్లాలో మహిళలకు చట్టసభల్లో 33శాతం రిజర్వేషన్ కల్పించాలంటూ మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు బండల పద్మావతి ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమాని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైనా గద్వాల ఎమ్మెల్యే డికె అరుణ మాట్లాడుతూ రాజకీయాలు, ప్రజాస్వామ్యం మంచిగా ముందుకు సాగాలంటే రిజర్వేషన్లు అవసరమని, మహిళలను దేశాభివృద్దిలో భాగస్వాములను చేయడం అవసరమని అన్నారు. మహిళలకు సమాన హక్కుల్ని సాధించుకునేంత వరకు, చట్ట సభలలో మహిళలకు సమ భాగస్వామ్యం పొందేంతవరకు పోరాడాలని ఆమె సూచించారు. అతి పెద్ద ప్రజాస్వామిక దేశం మనది, మనకంటే చాల చిన్న దేశాలు వెనుకబడిన దేశాలలో మహిళలకు సమాన హక్కులు కెటాయించి వారు రాజకీయాలలో రాణిస్తున్నారని అన్నారు. చట్ట సభల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడంలో రిజర్వేషన్లు చాల కీలకపాత్ర పోషిస్తునాయన్నారు. మహిళల భాగస్వామ్యం ఉన్నపుడు దేశం సామాజికంగాను, ప్రజాస్వామికంగా కూడా అభివృద్ది చెందుతదని, మహిళలంతా గ్రామ స్థాయి నుండి పార్లమెంటు, రాజ్యసభ చట్ట సభల వరకు మహిళలకు 33శాతం రిజర్వేషన్ మనహక్కు అని, సాధించేంత వరకు పోరాడాలని ఎమ్మెల్యే సూచించారు. అనంతరం ఎమ్మెల్యే డికె అరుణ సంతకం చేసి సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు జయలక్ష్మీ, మంజుశ్రీ, మహిళానేతలు సత్యవాణి, బుజ్జమ్మా, డిటిడిసి అనిత, మహిళా కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.