మహబూబ్‌నగర్

ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో పాటు ఆన్‌గోయింగ్ ప్రాజెక్టులను పూర్తి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పద్నాల్గు లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం జరుగుతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండ మండల పరిధిలోని జగబోయినిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన 33/11 విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించారు. అదేవిధంగా జకనాయపల్లి గ్రామంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ గ్రామంలో దాదాపు మూడు వందల కుటుంబాలకు 20 లీటర్ల వాటర్‌ట్యాంకులను పంపిణీ చేశారు. రూ.3 లక్షల వ్యయంతో పాఠశాల ప్రహారి గోడ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. జగబోయినిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ గత పాలకులు రైతులకు కరెంట్ సరఫరా చేయడంలో ఎన్నో ఇబ్బందులు పెట్టారని కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డకా ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వ్యవసాయానికి మొదట్లో పగటి పూట తొమ్మిది గంటల విద్యుత్ ఇస్తామన్న హామీని నెరవేర్చారని చెప్పారు. ఈ ఏడాది నుండే కొన్ని ప్రాంతాలలో 24 గంటల విద్యుత్‌ను కూడా అందిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కెసిఆర్‌కే దక్కిందన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కొందరు దుర్మార్గులు అడ్డుకోవడానికి కుట్రలు చేస్తున్నారని ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రాజెక్టును మాత్రం నిర్మించడం ఖాయమని అన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు పది లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని అన్నారు. కల్వకుర్తి ప్రాజెక్టు ద్వారా కల్వకుర్తి ప్రాంతానికి సైతం వచ్చే ఖరీఫ్ నాటికి దాదాపు 30 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పారు. కోటి ఎకరాల మాగానీ అనే కల తెరాసా నాయకులది, ముఖ్యమంత్రిదని ఆ కల కూడా మరో రెండు మూడేళ్లలో నెరబోతుందని అన్నారు. ప్రతి ఎకరాకు సాగునీరు అందించి రైతుల కళ్లల్లో ఆనందం చూడడమే తమ ద్యేయమని అన్నారు. విద్యుత్ కష్టాలు తొలగిపోవడంతో రైతులు రాత్రి పూట ప్రశాంతంగా తమ కుటుంబాల దగ్గర పడుకుంటున్నారని గతంలో ఎప్పుడు కరెంట్ వస్తుందో పోతుందో తెలియని పరిస్థితులు ఉండేవని కానీ ప్రస్తుతం అలాంటి కష్టాలు గట్టెక్కాయని అన్నారు. ప్రజలకు ప్రభుత్వ వైద్యసేవలు కార్పోరేట్ స్థాయిలో అందించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని వైద్య ఆరోగ్యశాఖలో పట్టిన 60 ఏళ్ల గబ్బును తొలగించడానికి ఎంతో కష్టపడుతున్నామని తెలిపారు. గ్రామాల అభివృద్ధే ద్యేయంగా పని చేస్తున్నామని చెప్పారు.