నల్గొండ

నాణ్యమైన విద్యే కేసిఆర్ లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంస్థాన్‌నారాయణపురం: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌నారాయణపురం మండలం సర్వేల్‌లో గురుకుల పాఠశాలకు రూ పం ఏర్పడుతుంది. ప్రపంచదేశాలతో పోటీపడ గల విద్యను తెలంగాణ బిడ్డలకు అందించాలని కేజీ టూ పీజీ గురుకుల విద్యకు రాష్ట్రంలోనే మొట్టమొదటి పాఠశాల భవనాలకు ఆదివారం రాష్ట్ర విద్య, విద్యుత్‌శాఖల మం త్రులు కడియం శ్రీహరి, గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దే శంలోనే గురుకుల విద్యావ్యవస్థకు నాంది పలికిన సర్వేల్ గురుకులంలోనే కేజీ టూ పీజీ విద్యను ప్రారంభిస్తున్న ట్టు మంత్రులు కడియం శ్రీహరి, జగదీశ్‌రెడ్డి ప్రకటించారు. అందుకోసం ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రణాళిక బడ్జెట్ నుంచి 18.61 కోట్లను మంజూరు చేశా రు. ఇందులో విద్యార్థులకు, అధ్యాపకుల కు కావాల్సిన సకల సౌకర్యాలతో వసతులు ఏర్పాటు చేయడానికి భవనాలు నిర్మిస్తున్నారు. ప్రపంచ దేశాలలోని విద్యతో పోటీపడగలిగే నాణ్యమైన విద్యను అందించడమే ధ్యేయమన్నారు. కార్పొరేట్ విద్యతో పోటీ పడగల సత్తా ఇక్కడి విద్యార్థులకు ఉం టుందన్నారు. ఇప్పటికే ఎంతో మంది ఉన్నత అధికారులను, నేతలను అం దించిన సర్వేల్ గురుకులం ఇక ఎడ్యుకేషన్ హబ్‌గా మారనున్నట్లు తెలిపా రు. కష్టపడి సాధించిన తెలంగాణకు వనె్న తేవడంకోసమే నాణ్యమైన విద్య, నిరంతర విద్యుత్, సాగుకు అనుకూల వాతావరణం కల్పిస్తున్నట్లు తెలిపారు. సర్వేల్ గురుకుల విద్యార్థులతో పాటు, ఇక్కడి ఉపాధ్యాయులు కష్టపడి పనిచేస్తున్నారని కొనియాడారు.
నవ్వులు పూయించిన ఎంపి
సర్వేల్ గురుకులంలో ఏర్పాటు చేసిన శంకుస్థాపన సభలో ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ ఉపముఖ్యమంత్రి కడియంను ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్యే గాథరి కిషోర్‌ను మాజీ ఎమ్మెల్యేగా సంబోధించారు. దీనితో సభావేధికపైనున్న మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు, సభ ముందున విద్యార్థులు, ప్రజలు గొల్లుమని నవ్వా రు. దీనతో సర్థుకున్న ఎంపీ 3గంటలకు కావాల్సిన సభ 6గంటలకు ప్రారంభం కావడంతో ఇలా మాటలు దొర్లినట్లు నవ్వుతూ ప్రకటించారు. కార్యక్రమంలో మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే గాథరి కిషోర్, యాదాద్రి, సూర్యాపేట కలెక్టర్లు అనితారామచంద్రన్, సురేంద్రమోహన్, గురుకుల సంస్థ కార్యదర్శి సత్యనారాయణ, ప్రిన్సిపాల్ కందాల వెంకటనర్సింహాచారి, జెడ్పీటీసీలు బొల్ల శివశంకర్, పెద్దింటి బుచ్చిరెడ్డి, ఎంపిపి వాంకుడో తు బుజ్జీనాయక్, సర్పంచ్‌లు మానుపాటి సతీశ్, ఏర్పుల అంజమ్మ, ఎంపీటీసీలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.