గుంటూరు

ముద్రగడపై వేధింపులు వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: కాపు రిజర్వేషన్‌ను పునరుద్దరించాలని ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమిస్తున్న ముద్రగడ పద్మనాభంపై ప్రభుత్వం వేధింపు చర్యలకు పాల్పడితే సహించేది లేదని జిల్లా జెఎసి నేతలు హెచ్చరించారు. కాపుల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవలంభిస్తున్న మొండి వైఖరిని విడనాడాలని డిమాండ్ చేస్తూ ఆదివారం రాత్రి జిల్లా కాపు జెఎసి ఆద్వర్యాన చుట్టుగుంట సెంటర్ వద్ద గల పల్నాటి యోధుడు కనె్నగంటి హనుమంతు విగ్రహం వద్ద కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జెఎసి నేత కిలారి వెంకట రోశయ్య మాట్లాడుతూ హక్కుపరంగా సంక్రమించిన రిజర్వేషన్లను ప్రభుత్వాలు కాలరాసాయని, గత ఎన్నికల్లో రిజర్వేషన్లపై తెలుగుదేశం పార్టీ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేర్చకుండా కాపుల పట్ల అణచివేత ధోరణి ప్రదర్శిస్తోందని ఆరోపించారు. రాజ్యాంగంలో దామాషా ప్రకారం 1960కు ముందునుంచే కాపులకు రిజర్వేషన్ అమలులో ఉందని, ఇది ఏ పార్టీ వేసే భిక్షకాదన్నారు. గత 25 రోజులుగా ముద్రగడను గృహనిర్బంధంలో ఉంచడం సిఎం చంద్రబాబు నియంతృత్వ పాలనకు నిదర్శనమని జెఎసి నేత మాదా రాధా తీవ్రంగా ఖండించారు. దాసరి రాము మాట్లాడుతూ కాపుల పట్ల అణచివేత ధోరణి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. ఆళ్లహరి మాట్లాడుతూ కల్లబొల్లి మాటలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఏరు దాటాక తెప్పతగలేసిన చందాన కుఠిల రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. మాజీ కార్పొరేటర్ అడపా కాశీవిశ్వనాథం, మిరియాల శ్రీను, దుర్గా, తాళ్ల శ్రీను, దాసరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కాపులంతా ఐక్యమై టిడిపికి తగిన గుణపాఠం చెప్పాలని కోరారు.