గుంటూరు

‘సంకల్ప సిద్ధి’కి విస్తృత ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: కేంద్రప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ నెల 21వ తేదీన జరగనున్న సంకల్పంతో సిద్ధి కార్యక్రమ నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేయాలని అదనపు జాయింట్ కలెక్టర్ ముంగా వెంకటేశ్వరరావు అధికారులను ఆదేశించారు. న్యూ ఇండియా మదనం పేరుతో శ్రీ వెంకటేశ్వరా పశువైద్య విశ్వవిద్యాలయం, కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించనున్న సంకల్పంతో సిద్ధి కార్యక్రమ విజయవంతానికి చేయాల్సిన ఏర్పాట్లపై ఆదివారం ఆయన కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో సమావేశమయ్యారు. రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేయడానికి పాటించాల్సిన 7 సూత్రాలను కేంద్రప్రభుత్వం వెల్లడించినట్లు చెప్పారు. ఉత్పత్తిలో వృద్ధి, ఇన్‌పుట్ యొక్క ప్రభావిత ఉపయోగాలు, ఉత్పత్తి తర్వాత నష్టాలను తగ్గించడం, విలువ ఆధారిత వృద్ధి, నూతన మార్కెటింగ్ విధానాల ద్వారా అధిక ఆదాయం కల్పించడం వ్యవసాయ రంగంలో ఒడిదుడుకుల నివారణ, వ్యవసాయ అనుబంధ రంగాలను బలోపేతం చేయడం వంటి అంశాల ద్వారా రైతుల ఆదాయ పెంపునకు ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. ఇందులో భాగంగా ఈనెల 21వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు వెంకటేశ్వరా విజ్ఞాన మందిరంలో జరగనున్న సంకల్పంతో సిద్ధి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేంద్రమంత్రి వై సుజనాచౌదరి హాజరుకానున్నారన్నారు. రాష్టమ్రంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమానికి 1000 మందికి పైగా రైతులు హాజరుకానున్నారన్నారు. కేంద్రప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రకటించిన తర్వాత దేశం మొత్తమీద ప్రప్రథమంగా గుంటూరు జిల్లాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమానికి హాజరయ్యే వారికి తాగునీరుతో పాటు ఆహార వసతి కల్పించనున్నట్లు చెప్పారు. అంతేకాకుండా విజ్ఞాన మందిరం వెలుపల రైతులకు ఉపయోగపడేలా వ్యవసాయ వస్తు ప్రదర్శన ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమం పూర్తయ్యే వరకు విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయం లేకుండా ఆ శాఖ అధికారులతో సంప్రదించాలన్నారు. సభావేదిక అలంకరణ తదితర ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించుకోవాలని సూచించారు. సమావేశంలో కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ యుగంధర్‌కుమార్, తిరుపతి శ్రీ వెంకటేశ్వరా పశువైద్య విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు డాక్టర్ డి శ్రీనివాసులు, రిజిష్ట్రార్ డాక్టర్ గంగరాజు తదితరులు పాల్గొన్నారు.