ఖమ్మం

ప్రసవ కష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్: ముసురు కమ్ముకుంది.. భారీ వర్షం కురుస్తోంది.. అంతలోనే నెలలు నిండిన ఆ గర్భిణీకి పురిటినొప్పులు వస్తున్నాయి.. కుటుంబ సభ్యులు భయాందోళన చెందారు.. 108కి సమాచారం ఇచ్చారు.. కానీ వాహనం అక్కడకు చేరుకునే దారి లేకుండా పోయింది. వాగు ఉధృతికి రాలేమని, వీలుంటే మీరే ఇంకో వాహనంలో తీసుకురావాలని సూచించారు.. జోరువానలోనే ఆ గర్భిణీని తీసుకొని భర్త, కుటుంబ సభ్యులు బయలుదేరారు. అంతలోనే మరో కష్టం వచ్చి పడింది. 108 వాహన సిబ్బంది ఉన్న చోటుకు వెళ్లేలోగానే మరో వాగు ఉధృతి పెరగడంతో ఆటో వెళ్లలేని పరిస్థితి. ఒకవైపు పురిటినొప్పులు.. మరోవాగు వాగు ఉధృతి. తట్టుకోలేకపోయిన ఆ గర్భిణీ నొప్పులు తాళలేక ఆటోలోనే ప్రసవించింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. చర్ల మండలం కుర్నపల్లికి చెందిన రమ్యకు నెలలు నిండాయి. ఆదివారం తెల్లవారుజామున నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108కు సమాచారం ఇచ్చారు. మూడు రోజుల నుంచి భద్రాచలం మన్యంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో రహదారి మధ్యలో చింతగుప్ప వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో 108 వాహన సిబ్బంది గ్రామానికి రాలేమని, చింతగుప్ప వరకు తీసుకురావాలని సూచించారు. గర్భిణీ ఆర్తనాదాలు చేస్తుండటంతో జోరువానలోనే కుటుంబ సభ్యులు ఆమెను ఆటోలో ఎక్కించుకొని బయలుదేరారు. గ్రామ శివారుకు రాగానే కుర్నపల్లి వద్ద ఉన్న వాగు ఉధృతి దాల్చింది. దీంతో ఆటో వాగును దాటలేని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో నొప్పులు తీవ్ర కావడంతో రమ్య ఆటోలోనే మగబిడ్డకు జన్మనిచ్చింది. శిశువు బరువు తక్కువ ఉండటం, ఉమ్మనీరు తాగడంతో బిడ్డను, తల్లిని వాగు దాటించిన కుటుంబ సభ్యులు తీవ్ర కష్టాలు పడి 108 వాహనం వద్దకు చేరుకున్నారు. 109 సిబ్బంది వెంటనే తల్లి, బిడ్డలను భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లి, బిడ్డల పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్లు 108 సిబ్బంది తెలిపారు.