మెదక్

సెప్టెంబర్ 19న రాష్టవ్య్రాప్త సమ్మెను జయప్రదం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్: కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమ కోసం ఆలోచించకుండ పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తున్నాయని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు విమర్శించారు. ఆదివారం స్థానిక కేవల్ కిషన్ భవన్‌లో వివిధ పరిశ్రమల కార్మికులతో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. కార్మికులు ఐక్యంగా పోరాడి సాధించుకున్న చట్టాలను తుంగలో తొక్కి పెట్టుబడిదారులకు చుట్టాలు మారుస్తున్నారని ధ్వజమెత్తారు. హక్కులు, చట్టాల రక్షణ కోసం ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. తెరాస ప్రభుత్వం కార్మికుల సమస్యల పట్ల తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. కాలపరిమితి ముగిసిన జివోలను సవరించి కొత్త జివోలను అమలు చేయాలని కనీస వేతనాల సలహా మండలి తీర్మాణం చేసి ముఖ్యమంత్రికి ఇచ్చిన ఆయన సంతకం చేయడం లేదని, కార్మికులపై సిఎంకు ఉన్న చిత్తశుద్ది ఏమిటో అర్థమవుతుందన్నారు. కాలపరిమితి ముగిసిన జివోలను వెంటనే సవరించాలని, కనీస వేతనం 18వేలు చెల్లించాలని, కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలని తదితర డిమాండ్లతో సెప్టెంబర్ 19న జరిగే రాష్టవ్య్రాప్త సమ్మెలో కార్మికవర్గం పెద్దఎత్తున పాల్గొని జయప్రదం చేయాలన్నారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు మల్లేశం, సాయిలు, బాగారెడ్డి, ప్రసన్న, మోహన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, దయానంద్, అశోక్, బాల్‌రాజ్, చంద్రయ్యతో పాటు వివిధ పరిశ్రమలకు చెందిన కార్మికులు పాల్గొన్నారు.