అదిలాబాద్

రాష్ట్రంలో రాజ్యాంగ విరుద్ధ పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉట్నూరు: రాష్ట్రంలో రాజ్యాంగ విరుద్దమైన పాలన కొనసాగుతుందని తెలంగాణ ప్రజాఫ్రంట్ జిల్లా అధ్యక్షులు బానోత్ రామారావు ఆరోపించారు. ఆదివారం స్థానిక ఉట్నూరులో వరంగల్ డిక్లరేషన్‌కు 20 ఏళ్లు నిండిన సంధర్భంగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో పలు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బానోత్ రామారావు మాట్లాడుతూ ప్రజా ఉద్యమంతో తెలంగాణ రాష్ట్రం 2014 ఏర్పడిందని, కెసి ఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ప్రజలకు అనుకూలంగా పాలన కొనసాగించాల్సిందిపోయి ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారని అన్నారు. ఆంధ్ర పాలనలో లేని ఆంక్షలు ప్రస్తుత తెలంగాణలో కొనసాగుతున్నాయన్నారు. దీనిని ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగ బద్దమైన పాలన కొనసాగడం లేదని, అందుకనే ప్రజాస్వామిక ప్రజా తెలంగాణ కోసం పోరాటాలకు సిద్దం కావాలన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ స్పూర్తితో ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలన్నారు. గత 20 సంవత్సరాలుగా ప్రజా తెలంగాణ సిద్దాంతనిర్మాణ కార్యాచరణల నుండి పొందిన అనుభావాలతో భవిష్యత్తు పోరాటానికి మార్గదర్శకం కావాలన్నారు. ఈ నేపథ్యంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాజకీయ రంగంలోకి తెచ్చిన సుప్రసిద్ద వరంగల్ డిక్లరేషన్ స్పూర్తి మరో ప్రజా తెలంగాణ పోరాటానికి బాటలు వేస్తుందన్నారు. నిరుద్యోగుల ఆశలు నీరుగారిపోతున్నాయని, నిరుద్యోగ రాజకీయ నాయకులకు పదవులు దక్కాయని ఆరోపించారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు ఆత్రం భుజంగ్‌రావు, గణేష్, రమణజాదవ్, బొజ్జు, సుగుణ, బాగుబాయి, రామారావు, వెంకటి, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
ఎఐసిసి ఇంచార్జిని కలిసిన మాజీ మంత్రి సిఆర్‌ఆర్
ఆదిలాబాద్ టౌన్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వ్యవహారాల ఇంచార్జిగా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన ఏఐసిసి కార్యదర్శి కుంతియాను ఆదివారం జిల్లా కాంగ్రెస్ నేతలు హైదరాబాద్‌లో కలుసుకొని సన్మానించారు. మాజీ మంత్రి సి.రాంచంద్రారెడ్డి, జిల్లా కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ నరేష్ జాదవ్ తదితరులు ఎఐసిసి ఇన్‌చార్జి ఆర్‌సి కుంతియా, నాయకులు జె.సతీష్‌గారిని కలిసి పార్టీ పరంగా చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. ఆదిలాబాద్ ఏజెన్సీ జిల్లాలో పార్టీ బలంగా ఉందని, సంస్థాగతంగా పటిష్టంచేసి రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా అన్ని జిల్లాలో పర్యటించాల్సిందిగా వారిని కోరినట్లు నరేష్ జాదవ్ తెలిపారు.

రక్తందానం చేయండి ప్రాణాలు కాపాడండి
లక్సెట్టిపేట: మానవ జీవితంలో అన్ని దానాల కన్న రక్తదానం గొప్పదని రక్తదానం చేసిన వారు భగవంతులతో సమానం అని మంచిర్యాల డిసిపి జాన్ వెస్లీ అన్నారు. ఆదివారం ప్రభుత్వ ఆసుపత్రిలో తలసేమియా వ్యాధి గ్రస్తుల కోసం స్థానిక ఫోటో, ప్రోఫేషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదానం శిభిరంలో ముఖ్య అతిథిగా పాల్గొన్ని మాట్లాడారు. మనకు తల్లి జన్మనిచ్చిందని మనం రక్తం దానం చేస్తే మరోక్కరికి జన్మను ఇచ్చినవారము అవుతామన్నారు. రక్తదానం చేయడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుందని శరీరంలో ఉన్నటువంటి రక్తం కొత్తగా తయారు అవుతుందన్నారు. ఎవరు కూడా రక్తం ఇవ్వడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయన్న అపోహాలు నమ్మకూడదనితెలిపారు. ప్రతి 6 నెలల కు ఒకసారి రక్తదానం చేయాలని సూచించారు. పోలీసుల ఆధ్వర్యంలో కూడా రక్తదాన శిభిరాలు ఏర్పాటు చేసి తలసేమియా వ్యాధి గ్రస్తులకు అందజేస్తామన్నారు. 10 రోజుల్లో మంచిర్యాలలో రక్తదాన శిభిరం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. అనంతరం డిసిపిని ఫోటో గ్రాఫర్స్ పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ రక్తదాన శిభిరంలో ఫోటో గ్రాఫర్స్ తో పాటు సుమారు 60 మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో సి ఐ ప్రతాప్, ఎస్సై సమ్మయ్య, ఫోటో గ్రాఫర్ల సంఘం గౌరవ అధ్యక్షులు మైలారపు శ్రీనివాస్, ఎంపిపి కట్ల చంద్రయ్య, వైద్యులు రాకేష్, శేఖర్, సురేష్, వైశ్య సంఘం నాయకులు చెట్ల రమేష్, ఫోటో గ్రాఫర్స్ సంఘం మండల అధ్యక్షులు గంధం సత్యనారాయణ ప్రధాన కార్యదర్శి అనీల్, నాగరాజు, తిరుపతి, వివిధ మండలాల ప్రజా, ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

బొగ్గు గనిలో వ్యక్తి మృతి
శ్రీరాంపూర్ రూరల్: శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్‌ఆర్‌పి-3 గనిలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో రత్న రాజయ్య(54) అనే కార్మికుడు మృతి చెందాడు. తోటి కార్మికుల కథనం ప్రకారం రత్న రాజయ్య గనిలోని 17వ లెవల్ 16వ క్రాస్‌కట్ పనిస్థలం జంక్షన్‌లో ట్రామర్‌గా నైట్ షిఫ్ట్‌లో యాక్టింగ్ పనులు నిర్వహిస్తున్నాడు. జంక్షన్ నుంచి వచ్చే భర్తీ కోల్ టబ్బులను మిగితా టబ్బులకు లింక్ చేస్తుండగా ట్రాక్ లైన్ మార్చేందుకు లింక్ (హుక్క్) వేస్తుండగా ప్రమాదం జరిగిందని హ్యాండ్ లీవర్ ఛానల్స్ వద్ద లేకపోవడం చందా తీస్తుండగా భర్తీ టబ్బులు వేగంగా వెనక్కి వచ్చి (ఆరియా)రావడంతో టబ్బులు పైన పడ్డాయని దీనితో రత్న రాజయ్య తల, దవడ, పగిలి తీవ్ర గాయాలు అయి మృతి చెందాడని తెలిపారు. కాగా, ట్రామర్‌గా విధులు నిర్వహిస్తుండటంతో ఈ ప్రమాదాన్ని ఎవరు గుర్తించకపోవడంతో ఇతర లెవల్ నుంచి వస్తున్న తోటి కార్మికులు గమనించి మైన్ సూపర్‌వైజర్లకు అధికారులకు సమాచారం అందించారు. వెంటనే రత్న రాజయ్యను టబ్బుల నుంచి తొలగించి ఏరియాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడని తెలిపారు. సీనియర్ ట్రామర్ కార్మికులను నియమించకపోవడంతో నైట్ షిఫ్ట్‌లో కోల్ ఫిల్లర్‌గా ఉన్న రత్న రాజయ్యను యాక్టింగ్‌ట్రామర్‌గా విధులు నిర్వహించడం వల్లే ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. భర్తీ ట్రబ్బులు ఆరియా ఆవేశ్‌అవుతున్న క్రమంలో ట్రాక్‌లైన్‌లపై వేగంగా వెళ్తాయని అయితే వాటిని ట్రాక్ మార్చేక్రమంలో ట్రామర్‌లు రక్షణకోసం మ్యాన్ హోల్స్ ఏర్పాటు చేయకుండా హ్యాండ్‌లీవర్స్ పెట్టకపోవడం వల్ల టబ్బులుపైన పడి కార్మికుడు మృతి చెందాడని తెలిపారు. మృతుడు స్వగ్రామం చెన్నూర్‌లోని ఎల్లక్కపేట కాగా, మృతునికి భార్య రాజేశ్వరి, కుమారులు సత్యనారాయణ, సంతు, కుమార్తె సౌందర్య ఉన్నారు.
మృతుని కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలి
* ఎస్‌ఆర్‌పి 3గనిలో ఆదివారం జరిగిన ప్రమాదంలో రత్న రాజయ్య మృతి చెందడంతో కార్మికులు, కార్మిక నాయకులు గనివద్దకు చేరుకోని కార్మికుని మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. అదేవిదంగా మృతుని కుటుంబానికి 50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. సంఘటన స్థలానికి టిబిజికెఎస్ కేంద్ర కమిటి సభ్యులు బంటు సారయ్య, కె సురేందర్‌రెడ్డి, ఎం మల్లారెడ్డి, కాశీరావు, హెచ్ ఎం ఎస్ నాయకులు పేరం రమేష్, ఖరీంముల్లా, ఎఐటియూసి నాయకుల బానుదాస్, ముస్కే సమ్మయ్య, ల్యాగెల శ్రీనివాస్ తదితరులు ఏరియా ఆసుపత్రికి తరలివచ్చి సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గనుల చట్టాన్ని అతిక్రమించి ఉత్పత్తి ధ్యేయంగా పనులు చేపిస్తున్నారని ఆరోపించారు. కార్మికులపై అధిక పనిభారాన్ని మోపి ప్రమాదానికి కారకులైన అధికారులపై వెంటనే చట్టపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

సిసిటిఎన్‌ఎస్‌లో ప్రతిభ కనబరిచిన పోలీసులకు ప్రోత్సాహకాలు
* ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్
ఆసిఫాబాద్: జిల్లాలో ప్రారంభించిన నూతన సాంకేతికతలో ప్రతిభ కనబరిచిన సిబ్బందికి నెలవారీగా ప్రోత్సాహకాలు అందిస్తామని ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్ అన్నారు. సిసిటి ఎన్‌ఎస్ పద్దతిని జిల్లాలో ప్రవేశ పెట్టినప్పటి నుండి నేటివరకు సిసిటిఎన్‌ఎస్ నమోదు, వినియోగం, సాధించిన ప్రగతిని జిల్లా ఎస్పీ పర్యవేక్షించారు. ఇందులో భాగంగా ఈజ్గాం పోలీసు స్టేషన్‌లో పని చేస్తున్న బబ్బెర శేఖర్ అనే కానిస్టేబుల్‌కు రూ.1000 ప్రోత్సాహకాన్ని ఎస్సీ అందచేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో ఆధునిక సాంకేతిక విధానాలను ప్రవేశ పెడుతున్నామన్నారు. దీనికి అనుగుణంగా పోలీసు యంత్రాంగం ప్రజలకు మరింత మెరుగైన సేవలందించేందుకు వీలుంటుందన్నారు. నేరాల అదుపుతోపాటు, నేరస్థులను పట్టుకునేందుకు మరింత సులువవుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో డిఎస్పీ హబీబ్ ఖాన్, ఐటి కోర్ సిబ్బంది శ్రీనివాస్, మాణిక్ రావు, రమేష్, సీనియర్ అసిస్టెంట్ సూర్యకాంత్, ఎండి ఇంతియాజ్, పాస్‌పోర్టు కార్యాలయ అధికారి మరళి, ఫింగర్ ప్రింట్ విభాగపు అధికారి ఏ.తిరుపతి, పిఆర్‌ఓ మనోహర్, సిఐలు ఎస్‌ఐలు పాల్గొన్నారు.

పేద ప్రజలకు రాజకీయ రంగు పులమద్దు
* సంక్షేమ పథకాలతో జీవన ప్రమాణాలు మెరుగు
* బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న
ఆంధ్రభూమి బ్యూరో
ఆదిలాబాద్: పేద ప్రజలకు రాజకీయాలు ముడి పెట్టవద్దని, వారి సంక్షేమం, అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా అందరూ పాటుపడాలని, ప్రభుత్వం పేదవర్గాల జీవితాల్లో వెలుగులు నింపేందుకే పథకాలు రూపొందిస్తుందని రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. ఆదివారం జైనథ్ మండల కేంద్రంలో కొత్తగా నిర్మించిన పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన అనంతరం పార్డి గ్రామంలో గొర్రెల యూనిట్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ప్రసంగించారు. చేతివృత్తుల వారికి చేయూతనందించేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ గొల్లకుర్మలకు రాయితీపై గొర్రెల యూనిట్లను పంపిణీ చేస్తున్నామని, ఒక్కో యూనిట్‌కు ప్రభుత్వం లక్షా 22వేలు ఖర్చుచేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. తగ్గిపోతున్న మాంస ఉత్పత్తులను పెంచి, పాడి పరిశ్రమతో పాటు ఉపాధినిచ్చే గొర్రెల, మేకల పెంపకం కోసం ప్రభుత్వం కోట్లాది నిధులు వెచ్చిస్తుందని, అర్హులైన గొల్లకుర్మలందరికి రాయితీపై గొర్రెలు పంపిణీ చేస్తామన్నారు. ఈ పథకంలో అక్రమాలు జరిగితే చూస్తూ ఊరుకోమని మంత్రి స్పష్టం చేశారు. అనంతరం ఆదిలాబాద్ మండలం దుర్గానగర్ కాలనీలో ఎంపి గెడం నగేష్, డెయిరీకార్పోరేషన్ చైర్మెన్ లోక భూమారెడ్డితో కలిసి హరితహారం కార్యక్రమంలో భాగంగా భారీఎత్తున మొక్కలు నాటారు. ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు హరితహారం మొక్కలు నాటే కార్యక్రమానికి దోహదపడుతాయని, ప్రజలందరిని భాగస్వాములను చేసి పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే విస్తుృతంగా కురుస్తున్న వర్షాలు ఖరీఫ్ రైతులకు మేలు చేకూర్చాయని ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం రాంనగర్ కాలనీలో కొందరు యువకులు మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. యువతకు పార్టీలో ప్రాధాన్యత కల్పిస్తామని, ప్రభుత్వ పథకాలను ప్రజలదరిచేరే విధంగా కార్యకర్తలు కృషి చేయాలన్నారు.

కడెం ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి
* పెరుగుతున్న నీటిమట్టం
* అప్రమత్తమైన అధికారులు.
* ఆనందంలో కడెం ఆయకట్టు రైతులు
కడెం: నిర్మల్ జిల్లాలోని మండల కేంద్రమైన కడెంలో గల కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాల మూలంగా కడెం జలాశయంలో ఇన్‌ఫ్లో వరదనీరు వచ్చి చేరుతుండడంతో కడెం ప్రాజెక్టు నీటిమట్టం పెరుగుతుంది. కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా ఐదు రోజుల క్రితం కడెం జలాశయం నీటిమట్టం 687 అడుగులకు ఉంది. కాగా గత రెండు మూడు రోజుల నుండి భారీ వర్షాలు కురుస్తుండడంతో ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుండి వేలాది క్యూసెక్కుల వరదనీరు ఇన్‌ఫ్లో కడెం జలాశయంలోకి వచ్చిచేరుతుండడంతో ఆదివారం సాయంత్రం నాటికి ప్రాజెక్టు నీటిమట్టం 697 అడుగులకు చేరుకుంది. ఇన్‌ఫ్లో వరదనీరు వేలాది క్యూసెక్కులు వచ్చిచేరుతుండడంతో నీటిపారుదలశాఖ అధికారులు అప్రమత్తమై ప్రాజెక్టు వద్దనే మకాంవేసి ఎప్పటికప్పుడు నీటిమట్టం పెరుగుదల గురించి ఉన్నతాధికారులకు తెలియజేస్తూ వారి సలహాలు, సూచనలు పాటిస్తున్నారు. కేవలం రెండు మూడు రోజుల్లోనే భారీ వర్షాలకు కడెం జలాశయంలో పది అడుగుల నీటిమట్టం పెరిగింది. ఇదిలా ఉండగా ఖరీఫ్ సీజన్‌లో కడెం ఆయకట్టు కింద ఉన్న కడెం, జన్నారం, లక్షెట్టిపేట్, దండెపల్లి, మంచిర్యాల మండలాల్లోని రైతులు వరిపంట సాగుచేశారు. కాగా గత కొన్ని రోజుల నుండి భారీ వర్షాలు లేకపోవడం, కడెం జలాశయంలో నీటిమట్టం తగ్గుతూ వస్తుండడంతో తమ సాగుపంటలకు సాగునీరు అందుతుందాలేదా అన్న సందిగ్దంలో కడెం ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతూ రావడం జరిగింది. కాగా మరోపక్క మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షం మూలం కడెం జలాశయాల్లోకి నీరు రావడంతో ఖరీఫ్‌లో తమ పంటపొలాలకు సాగునీరందుతుందని రైతులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికే కడెం ఆయకట్టు కింద ఖరీఫ్ సీజన్ వరిపంటలకు ఎడమకాలువ నుండి 569 క్యూసెక్కులు, కుడికాలువ నుండి 22 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కడెం ప్రాజెక్టు నీటిమట్టం 698 నీటిమట్టానికి మెంటెనెన్స్‌చేస్తామని, ప్రస్తుతం ఇన్‌ఫ్లో వరద నీరు వచ్చిచేరుతుందని కడెం ప్రాజెక్టు జెఈ శ్రీనాథ్ పేర్కొన్నారు.