అదిలాబాద్

నిండుకుండలా బాసర గోదావరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాసర: ఉపరితల ఆవర్తన మేరకు శనివారం కురిసిన వర్షానికి బాసర క్షేత్రం వద్ద గోదావరి నది నిండుకుండలా దర్శనమిస్తుంది. వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు పూర్తవుతున్నా సమృద్దిగా వర్షాలు కురియకపోవడంతో గోదావరి నదితీరం ఎండమావిగా మారింది. ఒక్కరోజు కురిసిన భారీ వర్షానికి బాసర చుట్టుపక్కల ప్రాంతాల చెరువులు, కుంటలు నిండిపోయాయి. ఎగువ మహారాష్టల్రో సైతం భారీగా వర్షాలు కురుస్తుండడంతో గోదావరి నది పొంగి ప్రవహిస్తుంది. నదితీరం అందాలను చూడడానికి ఆదివారం స్థానికులతో పాటు ఇతర ప్రాంతాల నుండి యాత్రికులు భారీగా తరలివస్తున్నారు. గత 7 నెలలుగా గోదావరి నదిలో నీరు క్రమ క్రమంగా తగ్గుతూ వస్తుంది. వర్షం అధికస్థాయిలో కురువడంతో రైతులు, కర్షకులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.