అదిలాబాద్

కుమరం భీం జిల్లాలో భారీ వర్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆసిఫాబాద్: కుమరంభీం జిల్లాలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. జన జీవనం స్తంభించింది. ఈసీజన్‌లో కురిసిన భారీ వర్షంతో రైతాంగంలో ఆనందం వెల్లివిరుస్తోంది. రెండు మాసాలు కావస్తున్నా వరుణుడు మొహం చాటేయడంతో అప్పుడే అన్ని మండలాల్లో కరువు ఛాయలు అలుముకునే పరిస్థితులు నెలకొన్నాయి. లక్షలు ఖర్చు పెట్టి వేసిన పంటలు ఎండిపోయే దశకు చేరుకోవడంతో రైతాంగం తీవ్ర ఆందోళనకు గురైంది. వాతావరణం సైతం వేడెక్కి, ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఈతరుణంలో శుక్ర, శనివారాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు అన్ని వర్గాల్లో ఆశలు రేకెత్తించాయి. ముఖ్యంగా శనివారం రాత్రి నుండి తెల్లవారే వరకు కురిసిన వర్షం కారణంగా అన్ని మండలాల్లో వాగులు, వంకలు ఉప్పొంగాయి. పలు గ్రామాలకు రాక పోకలు నిలిచాయి. జిల్లా కేంద్రంలో పలు కాలనీలు నీట మునిగాయి. చెక్ పోస్టు కాలనీ, కంచుకోట, పైకాజీ నగర్ ప్రాంతాలు నీటమునగడంతో ప్రజలు జాగారం చేయాల్సి వచ్చింది. తెల్లవారే వరకు మోకాలు లోతు నీటిలో మంచాల్లోనూ కూర్చొని కనిపించారు. వర్షపు నీటిలో ఇండ్లలోకి నీటితోపాటు విష సర్పాలు రావడంతో జనాలు భయాందోళనలకు గురయ్యారు. మరోవైపుభారీ వర్షంతో వాతావరణం ఒక్క సారిగా చల్లబడింది. ఇంతకాలం ఉక్కపోతను భరిస్తూ వచ్చిన జనాలకు ఉపషమనం లభిస్తోంది.
జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో జిల్లాకేంద్రంలో 90.20 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదు కాగా, జైనూర్ మండలంలో 37.60 మిల్లీమీటర్లు, సిర్పూర్ (యు) 20.80, తిర్యాణి 9.40, రెబ్బెన 9.8, కాగజ్‌నగర్ 25.20, వాంకిడి 25, సిర్పూర్ (టి) 21.20, కౌటాల 30.40, బెజ్జూర్ 31, దహగాం 56.80 మిల్లీ మీటర్ల వర్షాపాతం నమోదైంది.