ప్రకాశం

కవలలకు ప్రాణం పోసిన ప్రభుత్వ వైద్యులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొదిలి: ప్రైవేటు ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ వైద్యశాలలు కూడాపని చేస్తున్నాయని పొదిలి ప్రభుత్వ వైద్యులు నిరూపించిన సంఘటన ఆదివారం జరిగింది. వివారాల్లోకి వెళ్తే దొనకొండ మండలం సంగాపురం గ్రామానికి చెందిన మరియమ్మ అనే గర్బిణికి పూర్తినెలలు నిండి పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. ఆమె భర్త యోగయ్య ఆమెను ఒకప్రైవేటు వైద్యశాలలో చేర్పించారు. అయితే మరియమ్మ పరిస్ధితి విషమంగా ఉండటంతో అక్కడి వైద్యులు కాన్పుచేయటం కష్టతరమని చేతులెత్తారు.దీంతో ఆమె భర్త, బంధువులు ఆదివారం పొదిలి ప్రభుత్వ వైద్యశాలలో కాన్పునిమిత్తం చేర్పించారు. స్పందించిన వైద్యాధికారి చక్రవర్తి చాకచక్యంగా వ్యవహరించి మరియమ్మకు సాధారణ కాన్పుజరిగేలా కృషిచేశారు. ఈకాన్పులో మరియమ్మకు ఒకమగ, ఒక ఆడ కవలపిల్లలు జన్మించారు. ప్రస్తుతం తల్లిబిడ్డలు క్షేమంగా ఉన్నారు. తన భార్యప్రాణాలతో పాటు తమ బిడ్డలకు ఊపిరీపోసిన ప్రభుత్వ వైద్యాధికారి చక్రవర్తికి మరియమ్మ భర్త, బంధువులు కృతజ్ఞతలు తెలియచేశారు. ఈవిషయం తెలుసుకున్న పలువురు పట్టణప్రముఖులు వైద్యాధికారి చక్రవర్తిని ప్రత్యేకంగా అభినందించారు.