శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

ఇక ఎమ్మెల్యేల వంతు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు: జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ కేసు వ్యవహారం రోజురోజుకు రసవత్తరంగా మారుతోంది. ఇప్పటిదాకా బెట్టింగ్ బుకీలు, సబ్ బుకీలు, పంటర్ల రూపంలో వారికి సహకరించిన కొందరు ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలకు పరిమితమవుతూ వస్తున్న కేసులో తాజాగా ఇద్దరు ఎమ్మెల్యేల పాత్రపై విచారణ జరగనుండడం విశేషం. కేసుకే ఇది కీలక మలుపు కానుంది. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా 205 మంది బెట్టింగ్ నిర్వాహకులు, పంటర్లను జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక్క శనివారం రోజే జిల్లావ్యాప్తంగా 84 మందిని వివిధ ప్రాంతాల్లో క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్నారనే నేరంపై అరెస్ట్ చేశారు. వీటన్నింటికితోడు ప్రధాన బుకీ కృష్ణసింగ్ నుంచి అరెస్ట్‌కు ముందే ఎంతో కీలక సమాచారం అందుకున్న పోలీసులు మరికొంత సమాచారం కోసం అతన్ని కోర్టు అనుమతితో విచారణకు తీసుకున్నారు. ఈ సమయంలో ఇద్దరు ఎమ్మెల్యేలకు తాను, వారు తనకు ఎలా సహకరించింది కృష్ణసింగ్ పూసగుచ్చినట్లు పోలీసులకు తెలిపినట్లు సమాచారం. అయితే ఈ విషయం గురించి ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డి ఇటీవల జిల్లా ఎస్పీని కలిసి తాను సచ్చీలుడినని, తాను రూ.40 లక్షలు తీసుకున్నట్లు వస్తున్న వార్తలు నిరాధారమని, విచారణ కోరడం జరిగింది. ఎస్పీ రామకృష్ణ స్పందిస్తూ తమ విచారణలో ఎమ్మెల్యేకు నగదు చెల్లించినట్లు ఎటువంటి సమాచారం అందలేదని ఆ సందర్భంలో విలేఖరుల ఎదుట ప్రస్తావించారు. అయితే ఇది జరిగి వారం రోజులు కూడా కాకమునుపే కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డిని ఈనెల 22న విచారణకు రావాలంటూ పోలీస్ శాఖ నోటీసులు అందచేయడం జరిగింది. బెట్టింగ్ కేసుల్లో పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో ఎల్.శ్రీ్ధర్‌రెడ్డి, బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డి ఇద్దరూ ఎమ్మెల్యేకు ముఖ్య అనుచరులుగా వ్యవహరిస్తుంటారు. ఇక నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్‌కు ఇదే కేసులో పోలీసులు విచారణకు నోటీసులు జారీ చేశారు. బెట్టింగ్ కేసులో అరెస్టయిన పి.రూప్‌కుమార్ స్వయానా నగర ఎమ్మెల్యేకు వరసకు సోదరుడవుతారు. అంతేకాకుండా నగర ఎమ్మెల్యేపై ఏ అధికారపార్టీ నేత విమర్శలకు దిగినా తొలుత స్పందించి అవతలి వారిపై విమర్శలు ఎక్కుపెట్టడంలో రూప్‌కుమార్ ముందుంటారు. తాను ఒకప్పుడు బెట్టింగ్‌లు ఆడేవాడినని, ప్రస్తుతం వాటికి దూరంగా ఉంటున్నానని స్వయానా రూప్‌కుమారే వెల్లడించారు. వారి ముఖ్యులు, అనుచరుల ద్వారా ఎమ్మెల్యేలిద్దరూ ప్రధాన బుకీ కృష్ణసింగ్‌తో సఖ్యత కలిగి ఉండవచ్చనే ప్రాథమిక ఆధారాల నేపథ్యంలో లోతుగా విచారించిన నెల్లూరు పోలీసులు సదరు ఎమ్మెల్యేల ప్రమేయంపై స్పష్టమైన ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు ఈనెల 22న జిల్లా అదనపు ఎస్పీ బి.శరత్‌బాబు ఎదుట విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నోటీసులను సర్కిల్ ఇన్స్‌పెక్టర్ స్థాయి అధికారి ద్వారా నంద్యాలలో ఉన్న ఎమ్మెల్యేలకు ఆదివారమే అందించేందుకు జిల్లా ఎస్పీ చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో సంచలనంగా మారిన నెల్లూరు క్రికెట్ బుకీల అరెస్ట్ వ్యవహారంలో ఇద్దరు ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నోటీసులు అందించడం రాష్ట్ర రాజకీయాలను మరింత వేడెక్కించే అవకాశం ఉంది. అధికార పక్షం చేతి అస్త్రంలా ఇది మారనుండగా, కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ ప్రతిపక్షం రక్షించుకునే ప్రయత్నాలు చేయొచ్చు. ఏదిఏమైనా ఈనెల 22న విచారణ తర్వాత ఎమ్మెల్యేలు ఇద్దరి ప్రమేయంపై ఒక స్పష్టత వచ్చే అవకాశం మాత్రం ఉంది.