తూర్పుగోదావరి

అభివృద్ధి నిరోధకుడు జగన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ: ప్రతిపక్ష నేత జగన్మోహన్‌రెడ్డి అభివృద్ధి నిరోధకుడిగా మారారని, ఒక ఎ-1 ముద్దాయిగా ఉన్న ఆయన ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు ప్రజల్లోకి వెళ్ళడం విడ్డూరంగా ఉందని తెలుగుదేశం సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, గొల్లపల్లి సూర్యారావు విమర్శించారు. ప్రతి సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరాన్ని సందర్శిస్తుంటే, ప్రతి శుక్రవారం జగన్ జైళ్ళు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ నగరంలోని టిడిపి కార్యాలయంలో ఆదివారం గోరంట్ల, గొల్లపల్లి విలేఖర్లతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో భూకబ్జాలు, అవినీతి పెద్ద ఎత్తున జరిగిందన్నారు. ఇప్పుడు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని అడ్డుకోవటమే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. నంద్యాలలో ఎ-1 ముద్దాయి జగన్, కాకినాడలో ఎ-2 ముద్దాయి విజయసాయిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించటాన్ని చూస్తుంటే, వారి ఆలోచనల కారణంగా ప్రజలకు ప్రమాదాలు ఎదురయ్యే అవకాశాలున్నాయని విమర్శించారు. వెనుకబడిన కులాలకు చెందిన ప్రజలు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో వారి కోసం ఫెడరేషన్లు ఏర్పాటు చేసి, అవినీతికి ఆస్కారం లేకుండా పధకాలను అందిస్తున్నామని చెప్పారు. గతంలో దళారులు, మధ్యవర్తులు ఈ పథకాలను అర్హులకు అందకుండా చేశారని, కాంగ్రెస్ నేతలతో కలసి దోచుకునేవారని అన్నారు. కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో టిడిపి-బిజెపి కలిసి పోటీ చేస్తున్నాయని, పోటీలో ఉన్న రెబెల్స్‌తో మాట్లాడి పోటీ నుండి విరమించుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు కాకినాడలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారన్నారు. బయటి నుండి కాకినాడ వచ్చి ఎన్నికల ప్రచారంలో మాయమాటలు చెబుతున్న వైకాపా నాయకులను నమ్మవద్దని సూచించారు. వారు స్థానికంగా అరాచకాలు సృష్టించి ఎన్నిక నిలిపివేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, టిడిపి కార్పొరేటర్ అభ్యర్ధి బాదం బాలకృష్ణను పోటీ నుండి విరమించుకోవాలని బెదిరించినట్లు వారు ఆరోపించారు. వీరి అరాచకాలకు అడ్డుకట్ట వేయాలంటే నగరపాలక ఎన్నికల్లో తెలుగుదేశానికే ఓటు వేసి గెలిపించాలని గోరంట్ల, గొల్లపల్లి కోరారు.