తూర్పుగోదావరి

ముద్రగడకు మద్దతుగా కాపుల నిరసనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం: కాపులను బిసిల్లో చేర్చాలన్న ప్రధాన డిమాండ్‌తో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం చేపట్టిన శాంతి యుత పాదయాత్రను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవడాన్ని నిరశిస్తూ ఆదివారం అమలాపురంలో కాపు ఉద్యమ నాయకులు వినూత్న రీతిలో తమ నిరసనలు తెలిపారు. కోనసీమ టిబికె జెఎసి కన్వీనర్ కల్వకొలను తాతాజీ ఆధ్వర్యంలో కాపు యువత దున్నపోతును ప్రదర్శిస్తూ రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగడుతూ నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా తాతాజీ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాపుల ఓట్లు కోసం రిజర్వేషన్లు కల్పిస్తామని వాగ్ధానం చేసిన చంద్రబాబు అధికారం చేపట్టిన తరువాత దున్నపోతుపై వర్షం కురిసిన మాదిగా ఉందని విమర్శించారు. ఈకార్యక్రమంలో తాతాజీతోపాటు వాకపల్లి శ్రీను, సుంకర పెద్దకాపు, కొమ్మూరి త్రిమూర్తులు, గండురాజు, సలాది చక్రి, ఏడిద శ్రీను, వర్రే శేషు, సాధనాల మురళీ, అరలపల్లి ముత్యం, అరిగెల శ్రీరామ్మూర్తితోపాటు పలువురు పాల్గొన్నారు. అలాగే కాపు రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు నల్లా విష్ణుమూర్తి ఆధ్వర్యంలో మొక్కలు నాటి నిరసనలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికైనా కాపులపై ద్వేషాన్ని విడనాడి రిజర్వేషన్ల కల్పనకు చర్యలు చేపట్టాలని కాపు నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నల్లా అజయ్, సూదా గణపతి, బండారు రామ్మోహన్‌రావు, గుర్రాల చంద్రశేఖర్, సుంకర కృష్ణారావు, రమణం వేణు, వాండ్రపు లక్ష్మణరావు, రంకిరెడ్డి రాజా,కరాటం ప్రవీణ్, గుర్రాల వీరబాబుతో పాటు పలువురు పాల్గొన్నారు.
డి గన్నవరం: కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గృహనిర్బంధాన్ని నిరసిస్తూ పి గన్నవరం మండలం కాపుయువత ఆదివారం నల్లజెండాలను చేతపట్టి బైకు ర్యాలీ నిర్వహించారు. పి గన్నవరం, వైవి పాలెం, బెల్లంపూడి, నరేంద్రపురం, పోతవరం, ముంగండ మీదుగా వందలాది ద్విచక్రవాహనాలతో ఈ ప్రదర్శన కొనసాగింది. ముద్రగడ జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం పి గన్నవరం మూడు రోడ్ల కూడలికి చేరుకుని రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాస్తారోకో కారణంగా ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు రంగప్రవేశంచేసి ఆందోళనకారులతో చర్చించి రాస్తారోకో విరమింపజేసి ట్రాఫిక్ క్రమబద్ధీకరించారు. కార్యక్రమంలో కాపు జెఎసి నాయకులు కొమ్మూరి మల్లిబాబు, యడ్లపల్లి ఏసుబాబు, అప్పన సురేష్‌నాయుడు, సాధనాల శ్రీనివాస్, యడ్ల ఏసుబాబు, తాటికాయల శ్రీనివాసరావు, కొర్లపాటి చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.
కొత్తపేట: కాపులను బీసీల్లో చేర్చాలంటూ మండలంలో కాపులు ఆందోళన బాటపట్టారు. మండల పరిధిలో వానపల్లిలో కాపులు రోడ్లను తుడుస్తూ ఆందోళన చేయగా వాడపాలెంలో కంచాలను కొడుతూ తమ నిరసనను పాటించారు. చంద్రబాబు ఎన్నిక ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, కాపునాయకుడు ముద్రగడ పద్మనాభం చేసే పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. రోజువారీ ఆందోళలను ఉద్ధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి కాపునాయకులు బండారు సత్తిరాజు, దుప్పలపూడి మాధవరావు, పెదపూడి బాపిరాజు, పెదపూడి శ్రీనివాస్ తదితరులు నాయకత్వం వహించారు.
ఆలమూరు: కాపులకు రిజర్వేషన్ల కోసం మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా ఆలమూరులో మండల కాపు సంఘం అద్యక్షుడు చల్లా ప్రభాకరరావు ఆధ్వర్యంలో ఆదివారం నిరసన తెలిపారు. తమ్మన శ్రీనివాసు అధ్వర్యంలో చెముడులంకలో వంటావార్పు చేశారు. కార్యక్రమంలో శ్రీకృష్ణ దేవరాయ కాపు సంఘం అధ్యక్షుడు చల్లా నానాజీ, భూషణం, చంటి, పేరాబత్తుల భాస్కరావు, మాజీ సర్పంచ్ నాగిరెడ్డి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
అయినవిల్లి: కాపులు రిజర్వేషన్లు అమలు చేయాలంటూ ఆదివారం ముక్తేశ్వరం రోడ్డులో సుమారు 100 మంది బైక్‌ర్యాలీ నిర్వహించారు. అనంతరం ముక్తేశ్వరం నాలుగురోడ్ల కూడలిలో నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా కాపు జెఎసి నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రిజర్వేషన్లు అమలు చేయకుండా అనేక రకాల ఎత్తులు వేస్తున్నారని కాపులకు రిజర్వేషన్లు సాధించేవరకూ ఈ ఉద్యమాలు కొనసాగిస్తామన్నారు. మా నాయకుడు ముద్రగడ పద్మనాభాన్ని ఇంటి వద్దే నిర్భందించడం పట్ల నాయకులు ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసారు.
ముమ్మిడివరం : కాపు రిజర్వేషన్ సాధనకోసం ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఉద్యమానికి మద్దతుగా ముమ్మిడివరం మండలం సిహెచ్ గునే్నపల్లిలో కాపు యువత మోకాళ్ళపై నిలబడి నిరసన వ్యక్తం చేసారు. ముద్రగడ పద్మనాభం పాదయాత్రపై విధించిన ఆంక్షలు తక్షణమే తొలగించి పాదయాత్రకు అనుమతించాలని కాపు యువత నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో గొలకోటి సాయిబాబు, గొలకోటి వెంకటేశ్వరరావు, గాలిదేవర లక్ష్మణుడు, గొలకోటి ఆంజనేయులు, గాలిదేవర బుల్లియ్య, జి గంగాధర్, గంట్రోతు రవి, రోచర్ల దుర్గ, గణేషుల బ్రహ్మానందం తదితరులు పాల్గొన్నారు.