తూర్పుగోదావరి

రాజమహేంద్రవరంలో రివర్ ఫ్రంట్ టూరిజం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం: రాజమహేంద్రవరం నగరంలోని చారిత్రక లాంచీల రేవును రివర్ ప్రంట్ టూరిజం ప్రాంతంగా అభివృద్ధికి ప్రణాళిక రూపొందించారు. అఖండ గోదావరి టూరిజం ప్రాజెక్టులో భాగంగా రానున్న ఏడాది కాలంలో ఈ ప్రాంతం అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మారనుంది. నగరపాలక సంస్థ రూ. 20 కోట్ల నిధులతో ఇక్కడ వౌలిక సదుపాయాలు కల్పించనుంది. ఇందుకు సంబంధించి కార్యాచరణ చేపట్టింది. అఖండ గోదావరి నది టూరిజం ప్రాజెక్టులో భాగంగా రివర్ ఫ్రంట్ టూరిజం పేరుతో ప్యాకేజీలను అమలు చేస్తున్నారు. అంతర్జాతీయస్థాయి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ ప్రణాళిక చేపట్టారు. ప్రధానంగా స్థానిక మార్కండేయేశ్వర ఆలయం ఎదురుగా వున్న లాంచీల రేవును ఎంతో చారిత్రక ప్రాశస్థ్యం వుంది. గోదావరి నదిపై వంతెనలు నిర్మాణం కాక ముందు ఇటు రెండు జిల్లాల మధ్య ప్రధానమైన లాంచీల రవాణా ఇక్కడ నుంచే జరిగేది. ఈ లాంచీల రేవు వద్ద మొత్తం నాలుగు స్నాన ఘట్టాలను కలిపి రివర్ ఫ్రంట్ టూరిజం ప్రాంతంగా అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక శాఖకు బదలాయించారు. ఇసుక ర్యాంపులను తొలగించారు. ఈ ప్రాంతంలో ఇసుక ర్యాంపులను ప్రత్యామ్నాయంగా కోటిలింగాల ఘాట్‌కు సమీపంలోకి మార్చారు. ఈ ప్రాంతంలో రోడ్డు మీద నుంచి నీటిలో ప్రయాణించే విధంగా సహజసిద్ధంగా ఉన్న రేవు ఉండటంతో అందుకు అనుణంగా అభివృద్ధి చేస్తున్నారు. పర్యాటక శాఖ రెండు బస్సు బోట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఉభయ చరం మాదిరిగా ఇటు రోడ్డుపై బస్సుగానూ, అటు నీటిపై తేలియాడే బోటు మాదిరిగా వినియోగించే బస్సు బోట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఉభయచర బస్సులు ఈ ప్రాంతానికి మొట్ట మొదటి సారిగా టూరిజం ప్రాజెక్టులో తీసుకొస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేసే పర్యాటక ప్రాజెక్టులో మొట్ట మొదటి సారిగా ఉభయచర వాహనాలతో రాజమహేంద్రవరం మరింత పర్యాటక ప్రాశస్థ్యం పొందనుందని అంటున్నారు. ఈ రివర్ ఫ్రంట్ టూరిజానికి టెండర్ల ప్రక్రియ రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగానే రెండు బస్సు బోట్లకు కూడా పర్యాటక శాఖ టెండర్లు సిద్ధం చేసింది.