చిత్తూరు

కన్నుల విందుగా పల్లకీ సేవ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాళహస్తి: ఆడికృత్తిక ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి శ్రీకాళహస్తిలో నిర్వహించిన పల్లకీసేవ భక్తులకు కనువిందు చేసింది. శ్రీవల్లీ దేవసే సమేత సుబ్రహ్మణ్య స్వామికి జరిగిన ఆడికృత్తిక బ్రహ్మోత్సవాల్లో చివరిరోజైన ఆదివారం పల్లకీ సేవ జరిగింది. శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రమణ్య స్వామి ఒక పల్లకిలో, జ్ఞాన ప్రసూనాంబ మరో పల్లకిలో, గంగాదేవి సమేత సోమ స్కంధ మూర్తి మరో పల్లకిలో పట్టణంలో ఊరేగారు. వివిధ రకాల పువ్వులతో, విద్యుత్ దీప కాంతుల నడుమ దేదీప్యమానంగా వెలిగిపోతున్న ఉత్సవ మూర్తులను తిలకించడానికి భక్తులు బారులు తీరారు. కర్పూర హారతులు పట్టి కొబ్బరి కాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఈకార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వరాలయ దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఇఓ భ్రమరాంబ తదితరులు పాల్గొన్నారు.

సర్వపరిపాలనా దక్షుడు రాజీవ్
తిరుపతి: సర్వపరిపాలనా దక్షుడు రాజీవ్ గాంధీ అని, దేశంలో సాంకేతిక విప్లవం, ఆధునిక విద్యా విధానాలకు శ్రీకారం చుట్టిన మేధావి, భారతదేశ సమగ్రత, సమైఖ్యత కోసం ప్రాణాలర్పించిన మహనీయుడు రాజీవ్‌గాంధీ అని కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతామోహన్ కొనియాడారు. ఆదివారం రాజీవ్‌గాంధీ జయంతిని పురస్కరించుకుని స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న ఆయన విగ్రహానికి తులసిమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చింతా మాట్లాడుతూ దేశాభివృద్ధికి భారతరత్న రాజీవ్‌గాంధీ ఎంతగానో కృషి చేశారని తెలిపారు. ఆయన కృషి ఫలితమే నేడు దేశంలోని ప్రతి గ్రామానికి విద్యుత్, ఫోన్, టెలివిజన్ సౌకర్యం అందుబాటులోకి వచ్చాయన్నారు. సాంకేతిక విప్లవానికి నాంది పలికిన రాజీవ్ గాంధీ వాడవాడలా ఇంజినీరింగ్, మెడికల్, పాలిటెక్నిక్ కళాశాలలను నెలకొల్పి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేశారని చెప్పారు. ఆయన హయాంలోనే సర్వశిక్షా అభయాన్‌ను అమలు చేశారని గుర్తు చేశారు. ఆలిండియా టెక్నికల్ ఎడ్యుకేషన్ తీసుకురావడం ద్వారా రాజీవ్ వేలాదిమంది విద్యార్థులు మంచి విద్యను అభ్యసించి ఉన్నత స్థానాలను పొందేలా చేశారన్నారు. కేవలం సాంకేతిక విద్యనే కాకుండా దళితుల సంక్షేమం కోసం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్‌కు మరింత పదును పెంచి కారంచెడు, చుండూరు వంటి సంఘటనలు పునరావృతం కాకుండా దళితులు, గిరిజనులను ఆదుకున్నారని చింతామోహన్ పేర్కొన్నారు. అవినిరోధక చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడమే కాకుండా సర్వధర్మ పరిపాలనను అందించి అన్ని కులాలు, మతాలు, ప్రాంతాల అభివృద్ధికి పాటుపడ్డ నాయకుడని కొనియాడారు. భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం సాధించిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. ఓటు హక్కును వినియోగించుకునే వయస్సును 21 ఏళ్ల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించి ఘనత రాజీవ్‌కు దక్కుతుందన్నారు. రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీ రాజ్ చట్టాన్ని సవరించి ప్రతి గ్రామ పంచాయతీకి ఢిల్లీ నుంచి నేరుగా నిధులు అందేలా చేశారని, పంచాయతీల పురోభివృద్ధికి భారీగా నిధులు కేటాయించి పల్లెల పురోగతిని బాటలు వేశారన్నారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ పూతలపట్టు ప్రభాకర్, సేవాదళ్ జిల్లా అధ్యక్షురాలు శాంతియాదవ్, నాయకురాళ్లు తేజోవతి, మునిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

రైతుల పట్ల ప్రభుత్వానికి నిర్లక్ష్యం తగదు
* బిజెపి కిసాన్ మోర్చా కార్యవర్గ సమావేశంలో నేతలు
తిరుపతి: రైతులకు చెల్లించాల్సిన రుణమాఫీ అంశంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని, బిజెపి కిసాన్ మోర్చా నాయకులు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక బైరాగిపట్టెడలోని బిజెపి కార్యాలయంలో జిల్లా కిసాన్ మోర్చా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈసందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ రైతులకు చెల్లించాల్సిన మూడో విడత రుణమాఫీ మార్చి నెలలో రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేయాల్సి ఉన్నా పట్టించుకోక పోవడం దారుణమన్నారు. కిసాన్ మోర్చా, బిజెపి నాయకులు ప్రజల పక్షాన సమస్యలపై పోరాడాలని నిర్ణయించుకున్నారు. కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు చంద్రారెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుబ్రహ్మణ్యం యాదవ్, రాష్ట్ర కార్యదర్శి మనోహర్ రెడ్డి, బిజెపి ప్రచార కార్యదర్శి గుండాల గోపినాథ్ రెడ్డి, జడ్ ఆర్యూసి సభ్యుడు కృష్ణమనాయుడు, బిజెపి ప్రధాన కార్యదర్శి వెంకటముని, మోర్చాప్రధాన కార్యదర్శులు కాలేమనోహర్ గౌడ్, హరిబాబురెడ్డి, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

సర్వం హరితమయం కావాలి
* విద్యాపీఠం విసి మురళీధర్ శర్మ పిలుపు
తిరుపతి: రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంతో ప్రారంభించి తిరుపతి నగరం మొత్తం పచ్చటి చెట్లతో హరితమయం కావాలని, ఆ దిశగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని విద్యాపీఠం విసి మురళీధర్ పిలుపునిచ్చారు. ఆదివారం విద్యాపీఠంలో జాతీయ సేవా పథకం కో ఆర్డినేటర్ డాక్టర్ దక్షిణామూర్తి ఆధ్వర్యంలో విద్యార్థులు వివిధ రకాలైన 100 మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా మురళీధర్ వారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ సరైన పర్యావరణం లేకపోతే మనిషి బతకలేడన్నారు. దీనిని గుర్తించే విద్యాపీఠంలో కేవలం సంస్కృత భాష, సంస్కృతి, వారసత్వాలను కాపాడమే కాకుండా పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యతను కూడా తీసుకుని మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టినట్టు వివరించారు. ఈ విద్యాపీఠంలోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరు స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించేలా తయారు చేయాలన్నారు. మొక్కలు నాటే కార్యక్రాన్ని ఒక ఉద్యమంలా చేపట్టి తిరుపతి నగరంలో పూర్తిస్థాయిలో అమలుచేసి సర్వం హరితమయం కావాలని చెప్పారు. ఈకార్యక్రమంలో విద్యాపీఠం పాలకమండలి సభ్యులు, సాహిత్య, సంస్కృతం డీన్‌లు ఆచార్యులు సత్యనారాయణ, ఆచార్య పి.వెంకటరావు, డాక్టర్ చందూలాల్, డాక్టర్ బలిచక్రవర్తి, డాక్టర్ సచ్చిదానందమూర్తి, డాక్టర్ పారమిత పండా, డాక్టర్ లతామంగేష్, డాక్టర్ భరత్ భూషణ్ రథ్, డాక్టర్ గిరికుమార్, ఫణిశర్మ, కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

గిరిజనులకు ఇచ్చిన ఎన్నికల హామీలు నెరవేర్చాలి
* జివిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు వడిత్యాశంకర్ నాయక్ డిమాండ్
తిరుపతి: రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన ఎన్నికల హామీలను వెంటనే నెరవేర్చాలని లేకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని గిరిజన విద్యార్థి సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడు వడిత్యా శంకర్ నాయక్ హెచ్చరించారు. ఆదివారం తిరుపతిలోని తమ కార్యాలయంలో ఆయన ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన టిడిపి వారి సంక్షేమాన్ని విస్మరించిందని నిప్పులు చెరిగారు. మూడున్నర సంవత్సరాలు అధికారంలోవున్న చంద్రబాబు నాయుడు గిరిజనులకు చేసింది శూన్యమన్నారు. టిటిడి పాలక మండలిలో గిరిజనులకు చోటు కల్పించాలని, నామినేటెడ్ పదువుల్లో స్థానం కల్పించాలని కోరారు. ఎస్టీ కార్పొరేషన్‌ను పునరుద్ధరించి 100 శాతం సబ్సిడీతో రుణాలు పంపిణీ చేస్తామని, ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీ చేస్తామన్న బాబు ఆమాటే మరిచారన్నారు. గిరిజన తాండాల్లో ప్రాథమిక వైద్య కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. ఇకనైనా సిఎం తన మాటకు కట్టుబడి హామీలను నెరవేర్చకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. జివిఎస్ ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో భారీ బహిరంగ సభలు పెట్టి ప్రభుత్వమోసాన్ని ఎండగడతామన్నారు. ఈకార్యక్రమంలో నాయకులు డాక్టర్ శంకర్‌నాయక్, భాస్కర్ నాయక్, వినోద్‌కుమార్ నాయక్, మంజునాథ్ నాయక్, ఐ.రామాంజులు నాయక్, హరికృష్ణ, భూమా నాయక్, ఎల్లప్ప, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

వినాయక సాగర్ అభివృద్ధికి టిటిడి సహకరించాలి
* జెఇఓ పోలా భాస్కర్‌కు వినాయక మహోత్సవ కమిటీ వినతి
తిరుపతి: స్థానిక కరకంబాడి రోడ్డులోని వినాయక సాగర్‌ను అభివృద్ధి చేయడానికి టిటిడి సహకరించాలని కోరుతూ తిరుపతి వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ కన్వీనర్ సామంచి శ్రీనివాస్ టిటిడి జెఇఓ పోలా భాస్కర్‌ను కోరారు. ఆదివారం జెఇఓను సామంచి, కమిటీ సభ్యులు కలసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సామంచి శ్రీనివాస్ మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా దేశంలోని ప్రధాన నగరాలకు ధీటుగా తిరుపతిలో చవితి ఉత్సవాలు, సామూహిక నిమజ్జన మహోత్సవం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా 25న చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలో 750 గణేష్ ప్రతిమలను ప్రతిష్ఠించి, 27న నగరంలో శోభాయమానంగా ఊరేగింపులు నిర్వహించి వినాయక సాగర్‌లో ప్రతిమల నిమజ్జనం జరుగుతుందని తెలిపారు. నగరంలో నిమజ్జనానికి అనుకూలంగా ఉన్నది వినాయకసాగర్ మాత్రమేనని, ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయని వివరించారు. సాగర్‌లో ఇప్పటి వరకు పూడికతీత పనులకు ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ టెండర్లు పిలిచిందని చెప్పారు. సాగర్ చుట్టూ ఆధ్యాత్మికత ఉట్టిపడేలా దేవతామూర్తుల విగ్రహాలను ఏర్పాటు చేయాలని, పచ్చదనం పెంచేందుకు టిటిడి చర్యలు తీసుకోవాలన్నారు. వినాయక సాగర్ మధ్యలో విఘ్నేశుని ప్రతిమ, నిమజ్జనానికి అనుకూలంగా ర్యాంపుల నిర్మాణం చేసేందుకు ప్రత్యక చొరవ తీసుకోవాలని కమిటీ జెఇఓ పోలా భాస్కర్‌ను కోరారు. నిమజ్జన మహోత్సవం రోజున టిటిడి అవసరమైన తెప్పలు, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్, పుస్తక ప్రసాద వితరణ, అన్నమాచార్య కళాకారుల కచేరి, కోలాట భజనబృందాలు, నగర అలంకరణ, భక్తిపాటల సిడిలు, మనగుడి ప్రసాదాలు అందించాలని, ఎస్వీబిసిలో ప్రత్యక్ష ప్రసారానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై జెఇఓ పోలా భాస్కర్ స్పందిస్తూ నిమజ్జన మహోత్సవానికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిజేశారు. ఈకార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు జి.్భనుప్రకాష్ రెడ్డి, గుండాల గోపినాథ్ రెడ్డి, ఊకా విజయ్‌కుమార్, చందన శ్యామ్, డిఎంకె మురళి, పి.నవీన్‌కుమార్ రెడ్డి, కరాటే శ్రీను, గోపిప్రసాద్, నవీన్, వాసు, ఎస్‌వి ఎం వెంకటేష్ పాల్గొన్నారు.