చిత్తూరు

దారి వివాదం - 16 మందికి గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాళహస్తి: ప్రభుత్వానికి చెందిన డికెటి భూమిలో నుంచి తన పొలంలోకి ఓ వర్గం వారు దారి వేసుకోవడాన్ని మరో వర్గం అడ్డుకోవడంతో ఇరు వర్గాలు పరస్పరం దాడులకు పాల్పడిన సంఘటన ఆదివారం సాయంత్రం జరిగింది. ఈ సంఘటనలో 16 మంది గాయాలపాలయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి. తొట్టంబేడు మండలం, సాంబయ్యపాల్యెంలో మునిరెడ్డి అనే రైతు ప్రభుత్వ భూమిలో నుంచి తన పొలానికి దారి నిర్మించుకునేందుకు ప్రయత్నించాడు. ఈ విషయం తెలుసుకున్న వీరారెడ్డి వర్గం అక్కడకు చేరుకుని వారిని అడ్డుకున్నారు. దీంతో ముందుగా వాగ్వివాదాలతో ప్రారంభమైన వివాదం ఘర్షణగా మారి పరస్పరం కర్రలు, రాళ్లతో దాడి చేసుకునే స్థితికి చేరింది. సమాచారం తెలుసుకున్న శ్రీకాళహస్తి టూ టౌన్ సిఐ వేణుగోపాల్, ఎస్‌ఐ భాస్కర్ నాయక్ తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరకున్నారు. అప్పటికే జరిగిన దాడుల్లో 16 మంది గాయపడ్డారు. దీంతో పోలీసులు వారిని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇరువర్గాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే మునిరెడ్డి వర్గం కథనం పరిశీలిస్తే వ్యవసాయ పొలానికి ప్రభుత్వ భూమిలో నుంచి నడక దారిని వేసేందుకు సిద్ధపడ్డామన్నారు. వీరారెడ్డి ఆ దారిలోవున్న ఎర్రగుల్లను అధికారుల అనుమతిలేకుండా అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. ఆ వచ్చిన సొమ్ములో కొంత గ్రామాభివృద్ధికి ఖర్చు చేయాలని కోరారన్నారు. అందుకు నిరాకరించిన వీరారెడ్డి తన వ్యాపారాన్ని కూడా నిలిపేశారన్నారు. ఈక్రమంలో తాము రోడ్డు వేసుకోవడానికి ప్రయత్నిస్తే అడ్డుకోవడం ఎంత వరకు ధర్మమమని ప్రశ్నించారు. వీరారెడ్డివర్గం వాదన మరోలా ఉంది. ప్రభుత్వ భూమిలోవున్న ఎర్రగుల్లను తరలించవద్దని అడ్డుకున్న మునిరెడ్డి, తన స్వార్థం కోసం తన పొలానికి రోడ్డు వేయడం ఎంత వరకు సబబని ప్రశ్నిస్తున్నారు. అందుకే ప్రభుత్వ భూమిని అధికారుల అనుమతి లేకుండా ఎవరూ వినియోగించుకోకూడదన్నదే తమ ఆలోచనన్నారు.