కడప

భారీగా గుట్కా ఫ్యాకెట్లు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజంపేట టౌన్: రాజంపేట పట్టణంలో గుట్కా అమ్మకాలు సాగిస్తున్న దళారులపై అర్భన్ పోలీసులు దాడులు నిర్వహించి వారి నుంచి 28 వేల గుట్కా ఫ్యాకెట్లు స్వాధీనం చేసుకుని, నిందితులను అరెస్టు చేసినట్లు అర్భన్ సిఐ బి.మురళినాయక్ పేర్కొన్నారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ మాట్లాడుతూ పట్టణంలో గుట్కా ప్యాకెట్లు విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో ఎస్సైలు రాజగోపాల్, సత్యనారాయణ ఆధ్వర్యంలో సిబ్బంది పలుచోట్ల దాడులు నిర్వహించి నలుగురు వ్యక్తులు వేణు, జగదీష్, గురుప్రసాద్, రాజా శ్రీనివాసులు అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ. 1.50 లక్షల విలువ చేసే గుట్కా ఫ్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులపై కేసులు నమోదుచేసి జిల్లా పుడ్ ఇన్‌స్పెక్టర్‌కు పంపినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో గుట్టా వంటి మత్తు పదార్థాలను ప్రభుత్వం నిషేధించినా వాటిని విక్రయించడం నేరమని, ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై చట్టరీత్యా చర్యలు చేపట్టడం జరుతుందన్నారు. విక్రయాలు నేరమని తెలిసినా పరిపాటిగా సాగించే వారిపై ఇతరత్రా కేసులు బనాయిస్తామని సిఐ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ఉపాధి బిల్లులు చెల్లించాలి..

కమలాపురం: గత రెండున్నర నెలలుగా ఉపాధి పనులు చేస్తున్నప్పటికి వారికి అందాల్సిన కూలీ అందకపోవడంతో ఉపాధిహామీ కూలీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము ఉదయం లేచి పనుల వద్దకు వెళ్లి కష్టపడి పని చేస్తున్నప్పటికీ తమకందాల్సిన డబ్బులు సక్రమంగా అందడం లేదని వాపోతున్నారు. రెండునెలలుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నప్పటికీ త్వరలోనే మీ అకౌంట్లలో డబ్బులు జమ అవుతాయని అదికారులు తిప్పుకుంటున్నారని వాపోతున్నారు. తమ కూలీడబ్బులు ప్రభుత్వం త్వరగా మంజూరు చేయాలని కోరుతున్నారు. కరవు పరిస్థితులు అదికంగా ఉండడంతో రైతులు, కూలీలకు పనులు లేకపోవడంతో పేదలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధిహామి పథకం లక్ష్యం నెరవేరడం లేదు. పనులు చేసినప్పటికి వేతనం అందకపోవడంతో కూలీలలో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇందుకు కారణం ఉపాధి పనులకు సంబంధించిన అడిట్ వివరాలను ప్రభుత్వం సమర్పించకపోవడంతో నిధులు విడుదల కాకపోవడం జరుగుతోందని ఆరోపణలు వినపడుతున్నాయి. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ బృందం అడిట్ వివరాలను పరిశీలించెందుకు సోమవారం నుంచి వచ్చే గురువారం వరకు జిల్లాలోని అన్ని మండలాలలో పర్యటించనున్నారు. కేంద్రబృందాలు ఎక్కడ పరిశీలిస్తారన్న విషయం తెలియకపోవడంతో మండలాల్లోని ఉపాధిహామి సిబ్బంది 8రకాల రికార్డులను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ కేంద్రబృందం పర్యటించి రికార్డుల పరిశీలన అనంతరం కేంద్రప్రభుత్వానికి నివేదికలు సమర్పించన తర్వాతే రెండో త్రైమాసిక నిధుల మంజూరయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలుపుతున్నారు. ఇలా ఉండగా కమలాపురంలోని ఉపాధిహామి కార్యాలయంను డ్వామా అదనపుపథకం సంచాలకులు మొగిలిచెండు సురేశ్ ఉపాధిహామి రికార్డులను పరిశీలించి వాటిని సక్రమంగా రూపొందించాలని ఆదేశించారు.

ఎల్‌ఎస్‌టిని సందర్శించిన జిల్లా నీటిపారుదలశాఖ అధికారులు

బి.కోడూరు: మండల పరిధిలోని లోయర్ సగిలేరు ప్రాజెక్టును ఆదివారం జిల్లానీటి పారుదలశాఖ అధికారులు ఎస్‌ఇ రాజగోపాల్‌రెడ్డి, సిబ్బంది సందర్శించారు. ఈ సందర్భంగా బి.కోడూరు మండలం టిడిపి ఇన్‌చార్జి తిప్పలూరి రామసుబ్బారెడ్డితోపాటు మండల రైతులు, ఎల్‌ఎస్‌టిలోని సమస్యలతోపాటు పలు చెరువుల గురించి వివరించారు. ఇందుకు స్పందించిన అధికారులు లోయర్ సగిలేరు ప్రాజెక్టులోని కంపచెట్లను, పూడికను జంగిల్ క్లియరెన్స్, పూడికను తొలగించేందుకు అంగీకరించారు. అలాగే మునె్నళ్లి చెరువుకు ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని అందించేందుకు స్థలాన్ని పరిశీలించారు. రూ.53 లక్షల అంచనా వ్యయంతో ఈ కార్యక్రమానికి త్వరలో టెండర్లు పిలవనున్నట్లు వారు తెలిపారు. అలాగే గుంతపల్లి చెరువు నుంచి తూర్పు పొలానికి వెళ్లే కాలువ పనులను ఆధునీకరించేందుకు రూ.25లక్షల అంచనా వ్యయంతో టెండర్లను పిలవనున్నామని తెలిపారు. బి.కోడూరు చెరువు, మరాటిపల్లె ఆయకట్టు భూములకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న కాలువ పనులు పరిశీలించారు. ఇందుకుగాను అంచనాలు పూర్తిచేసి ప్రభుత్వానికి నివేదికలు పంపేందుకు ఆమోదించారు. అలాగే అమ్మవారిపేట, రాజుపాలెం, గుంతపల్లె, బి.కోడూరు చెరువులలో జరుగుతున్న నీరు-చెట్టు పనులు కూడా పరిశీలించారు. కార్యక్రమంలో ఇఇ కొండారెడ్డి, సిఇ రమణారెడ్డి, ఏఇ నవీన్‌తోపాటు పోరుమామిళ్ల టిడిపి అధ్యక్షుడు రాజీవ్‌బాషా, మునె్నల్లిసర్పంచ్ రమణారెడ్డి, నీటి సంఘం అధ్యక్షుడు కేశవరాయుడు, టిడిపి నాయకులు వేణుగోపాల్‌రెడ్డి, రాజమోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గండికోటకు యునెస్కో గుర్తింపునకు కృషి
జమ్మలమడుగు: చారిత్రాత్మకమైన గండికోట పర్యాటక కేంద్రానికి యునెస్కో వారసత్వ గుర్తింపుకు బిజెపి కృషి చేస్తోందని ఆ పార్టీ దళిత మోర్చా విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు మేకల ఆంజనేయులు తెలిపారు. పట్టణంలోని ఆదివారం విలేఖరుల సమావేశంలో ఆంజనేయులు మాట్లాడుతూ గండికోటకు అంతర్జాతీయ గుర్తింపు ఇచ్చే యునెస్కో వారసత్వ కట్టడంగా చేర్చాలనే ఉద్దేశ్యంతో గత మాసం 23న కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి మహేష్ శర్మను ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో బిజెపికి చెందిన కేంద్ర భవన నిర్మాణ సలహామండలి అధ్యక్షుడు వి.శ్రీనివాసులునాయుడు కలవడం జరిగిందన్నారు. యునెస్కో గుర్తింపు ద్వారా గండికోట ప్రపంచ ఖ్యాతిని గడించాల్సి ఉందన్నారు. దీని కోసం శ్రీనివాసులు నాయుడు కృషి పట్ల హర్షం వ్యక్తం చేశారు. యునెస్కో గుర్తింపుకు అవసరమైన చర్యలను సంబంధిత అధికారులు తమ వంతు కృషి చేయాలని కోరారు. యుద్ద సమయంలో చారిత్రాత్మక కట్టడాలైన వంటి వాటికి యునెస్కో తరపున జెనీవా కనె్వన్షన్‌వారు కాపాడతారని, ఈ గుర్తింపుతో పర్యాటకంగా ప్రపంచస్థాయికి గండికోట చేరుతుందని దళిత మోర్చా నాయకుడు ఆంజనేయులు తెలిపారు.

సీఎంకు ఘనంగా వీడ్కోలు
కడప: ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు నంద్యాల ఉప ఎన్నికలు పురస్కరించుకుని శనివారం ఉదయం కడపకు చేరుకుని నంద్యాలకు వెళ్లారు. తిరిగి ఆదివారం సాయంత్రం కడప విమానాశ్రయం చేరుకున్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని నేతలు సీఎం రాకపోకలు పురస్కరించుకుని శనివారం ఆయనకు స్వాగతం పలుకగా ఆదివారం వీడ్కోలు చెప్పారు. ఆయన ఆదివారం సాయంత్రం 3గంటల ప్రాంతంలో నేరుగా హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నేతలతో నంద్యాల ఉపఎన్నికలపై ప్రచార వ్యవహారాలపై బేరీజు వేసినట్లు తెలుస్తోంది. కొంతమంది నేతలు అక్కడి ప్రచార విషయాలు వివరించినట్లుతెలుస్తోంది. నంద్యాలలోని పార్టీ నేతలకు జిల్లా నాయకులు అండగా నిలిచి తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు అందరూ కృషి చేయాలని సూచించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా కలెక్టర్ టి.బాబూరావునాయుడు, ఎస్పీ అట్టాడ బాబూజీ, ఆర్డీవో చిన్నరాముడు, మాజీ ఎమ్మెల్సీ పుత్తానరసింహారెడ్డి తదితరులు సీఎంను కలిసిన వారిలో ఉన్నారు. జిల్లా అభివృద్ధి పరిస్థితులను అధికారులను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు.

జిల్లాకు తరలివచ్చిన ఎడారి ఓడలు..

కడప(కల్చరల్): దేశంలోనే రాజస్థాన్‌లో ఎడారి ఓడగా ప్రసిద్ధిగాంచిన ఒంటెలు రాయలసీమ కేంద్రంగా ఎంచుకుని వైఎస్సార్ కడప జిల్లాకు వేలాది ఒంటెలు తరలివస్తున్నాయి. ముస్లింలకు పర్వదినమైన బక్రీదు సందర్భంగా పేదలకు దానం చేసేందుకు ఆనవాయితీగా పెట్టుకున్న ఒంటె మాంసం పంపిణీ నిమిత్తం రాజస్థాన్ వ్యాపారులు జిల్లాకు చెందిన వ్యాపారులతో సంబంధాలు పెట్టుకుని ఒంటెలను తరలించుకుని వస్తున్నారు. బక్రీదుపండుగకు నెలరోజులుండగా ముస్లింలు ఒంటె మాంసాన్ని పంపిణీ చేసేందుకు సైజును బట్టి రూ.50వేల నుంచి రూ.80వేల వరకు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. ఈ ఒంటెలను జిల్లా కేంద్రం నుంచి రాయలసీమ జిల్లాలోని కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు తరలిస్తున్నారు. ఒంటెతోపాటు ఒంటెల కాపరులను రాజస్తాన్ నుంచి రప్పించి సాధారణ పశువుల తరహాలో వాటిని రోడ్లకు ఇరువైపులా ఉన్న పెద్ద పెద్ద చెట్ల వద్దకు తీసుకెళ్లి ఆకులను కోసి మేత వేస్తున్నారు. రాజస్థాన్ నుంచి కొన్నింటిని గూడ్స్‌ల ద్వారా ఇక్కడకు తరలిస్తున్నారు. మరికొన్నింటిని మూడు మాసాల క్రితమే నడక ద్వారా రాజస్థాన్ నుంచి జిల్లాకు తీసుకొస్తున్నారు. పనిలో పనిగా కొంతమంది వ్యాపారులు అక్కడినుంచి వచ్చిన కాపరుల చేత ఒంటెను గ్రామసీమలకు నడక రూపంలో తీసుకెళ్లి పిల్లలను సరదాగా ఒంటెలమీద ఎక్కించుకుని తిప్పుతున్నారు. జిల్లాలోని పులివెందుల, ప్రొద్దుటూరు, మైదుకూరు, బద్వేలు, రాజంపేట, రైల్వేకోడూరు పరిసర ప్రాంతాలకు చెందిన వ్యాపారులకు ఒంటెలను విక్రయిస్తున్నారు. రాయచోటి నుంచి పీలేరు, కదిరి, దామలచెరువు, మదనపల్లె, పుంగనూరు ప్రాంతాలకు విక్రయిస్తున్నారు. సీమ జిల్లాలకు చెందిన ఉపవ్యాపారస్తులు వీటిని ఒక్కొక్క దాన్ని రూ.50వేల నుంచి రూ.లక్షా 20వేలు పైగా లాభాలతో విక్రయిస్తున్నారు. కొన్ని దశాబ్దాలకాలంగా రాజస్థాన్ వ్యాపారులు, జిల్లా వ్యాపారులతో సంబంధాలు పెట్టుకుని ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ముస్లింలు బక్రీదు పర్వదినంలో భాగంగా ప్రతి ఒక్కరికి మాంసాన్ని దానం చేసినప్పుడే ఆ పండుగకు సార్థకత ఉంటుందని భావించి ఒంటె మాంసాన్ని ఉచితంగా పంపిణీ చేస్తారు. ప్రధానంగా కొంతమంది ప్రజలు ఒంటెమాంసం రుచిచూసేందుకు ఉత్సాహపడుతుంటారు. ప్రతి ఏడాది బక్రీదు నెలలో కోట్లాదిరూపాయలు విలువచేసే ఒంటె మాంసాన్ని ఉచితం (దానం)గా పంపిణీ చేయడం పరిపాటైంది.