కడప

శ్రీకృష్ణగీతాశ్రమ ఆస్తులపై నేతల కన్ను!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప: ప్రొద్దుటూరులో వందలకోట్ల రూపాయలు విలువచేసే గీతాశ్రమానికి చెందిన వందలకోట్లరూపాయలు విలువచేసే భూముల్లో అన్యాక్రాంతమైన 20 ఎకరాల్లో పెద్దల హస్తమే ఉన్నట్లు స్పష్టంగా కన్పిస్తోంది. ఇప్పటికే 20 ఎకరాలు అన్యాక్రాంతం కాగా 24 ఎకరాలు లీజుపేరిట పలువురి ఆధీనంలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ భూములన్నీ దేవాదాయశాఖ పరిధిలోకి రావడంతో సంబంధిత అధికారుల కన్నుకూడా ఆ ఆస్తులపైనే పడింది. పలువురు నేతలు శ్రీకృష్ణగీతాశ్రమ ఆస్తులను ఆక్రమించుకోవడానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. 1946 దాకా తనకున్న ఆధ్యాత్మిక భావాలతో నామా ఎరికలయ్య అనే దాత ఏకంగా 44 ఎకరాలు ఆధ్యాత్మిక కేంద్రానికి, ఆశ్రమానికి, విద్యాసంస్థలకు ఏర్పేడు వ్యాసాశ్రమానికి ఎంతో ఉదారస్వభావంతో రాసిచ్చారు. అంతేగాకుండా 80 రూములతో కలిగిన షాపింగ్ కాంప్లెక్స్, ఏకంగా 7 విద్యాసంస్థలు భవనాలు కలిగివున్నాయి. వ్యాసాశ్రమానికి రాయించినప్పుడే ఈభూములు అనేక మలుపులు తిరిగి అన్యాక్రాంతం కాగా ఇక దేవాదాయశాఖ స్వాధీనంతో కొంతమంది దేవాదాయశాఖ అధికారులు, సిబ్బంది తామేమీ అక్రమార్కులకు తీసిపోమనే విధంగా వ్యవహరిస్తున్నారనేది జగమెరిగిన సత్యం. జిల్లాలో లక్షలాది ఎకరాలు పలుదేవాలయాలకు ఉండగా వాటిలో 75శాతం భూములు అన్యాక్రాంతం కావడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా జిల్లాలో పనిచేస్తున్న జిల్లా లోని పలు దేవాదాయశాఖాధికారులేనని చెప్పవచ్చు. అటువంటి అధికారులు శ్రీకృష్ణ గీతాశ్రమ ఆస్తులు స్వాధీనం చేసుకుంటుండటంతో వారు సైతం నేతలతో చేతులు కలిపి నకిలీ రికార్డులు తయారుచేసి అమ్ముకున్నా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. ఎకరా కనీసం అంటే ప్రొద్దుటూరులో ఆశ్రమం ఉన్న ప్రాంతమే రూ.20కోట్లు పలుకుతుంది. ఇక నామా ఎరుకలయ్యకు చెందిన ఆస్తులు అనేకం ప్రొద్దుటూరు చుట్టుపక్కలనే ఉన్నాయి. వ్యాసాశ్రమానికి రాసిచ్చిన 44 ఎకరాల్లో 19 ఎకరాలు మినహా మిగిలిన భూములన్నీ అన్యాక్రాంతమయ్యాయని దేవాదాయశాఖ అధికారులు అంటున్నారు. ఇబ్బడిముబ్బడిగా ఆస్తులను గుర్తించకుండా దేవాదాయశాఖ అధికారులు శనివారం అట్టహాసంగా స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం వాటిని గుర్తించడంలో మరెన్ని మలుపులు తిరుగుతుందో ఎవరికీ అంతుపట్టడం లేదు. ఆశ్రమ నిర్వాహకులు ఆశ్రమాన్ని వదిలిపెట్టి వెళ్లడం, రెవెన్యూ రికార్డుల్లో స్పష్టత లేకపోవడం, వాటిని కొలతలు వేసి గుర్తించాలన్నా సంబంధిత అధికారులకు అవగాహన లేకపోవడం, శ్రీకృష్ణగీతాశ్రమం ఆస్తులు చించిన విస్తరిలాగా తయారయ్యే పరిస్థితి ఉంది. స్వయంగా కలెక్టర్ బాబూరావునాయుడు రంగంలోకి దిగి పోలీసుల పర్యవేక్షణలో ఆస్తులు సర్వేచేసి అన్యాక్రాంతమైన ఆస్తులను స్వాధీనం చేసుకుని, ప్రొద్దుటూరు పట్టణంలో శ్రీకృష్ణగీతాశ్రమాన్ని జిల్లాలోనే ఉన్నత ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్ది అందరిలో భక్త్భివాలు పెంపొందించేందుకు అధికారులు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.