కడప

జీఎస్టీతో పరిశ్రమల యాజమాన్యాల బెంబేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప: కేంద్రం ప్రవేశపెట్టిన జీఎస్టీ (గూడ్స్‌సేల్ ట్యాక్స్)తో జిల్లాలో పరిశ్రమలు, వ్యాపార సంస్థలు, వాణిజ్య సంస్థలు పలు ఆర్థికలావాదేవీలు కలిగిన సంస్థల యాజమాన్యాలు బెంబేలెత్తుతుండటంతో సంబంధిత సంస్థల్లో పనిచేసే కార్మికులకు ఉపాధిలేక రోడ్డున పడుతున్నారు. జిల్లాలో ప్రతివ్యాపారం గతంలో విచ్చలవిడిగా ప్రభుత్వానికి పన్నులు ఎగవేసి లెక్కపక్కా లేకుండా కరవు జిల్లాలో కార్మికులు లభిస్తారని విచ్చలవిడిగా స్థాపించి వందల కోట్ల రూపాయాల్లో వ్యాపారం చేసుకుంటూ ఆడిందే ఆట పాడిందే పాటగా కొనసాగించారు. ప్రస్తుతం ప్రతి రూపాయికి వారు చేసుకునే వ్యాపార లావాదేవీలు, బ్యాంకులావాదేవీల్లో జీఎస్టీ కీలకం కావడంతో వాటి లెక్కలు రాయలేక వ్యాపార సంస్థలే మూసివేయడమే శ్రేయస్కరంగా భావిస్తున్నారు. కొంతమందిచేసే అక్రమ వ్యాపారాలకు జీఎస్టీ చెల్లిస్తే వారి అక్రమ వ్యాపారాలు బయటపడతాయని భయపడి కొంతమంది సంస్థలు మూసివేస్తున్నారు. జిల్లాలో విస్తారంగా ఖనిజ సంపదలో భాగంగా ఐరన్‌వోర్, యాస్‌బెస్టాస్, మ్యాగ్నటైటీస్, హెమటైటీస్, సున్నపురాళ్ల గనులు, సిమెంట్ తయారీకి వాడే ముడిసరుకు, భూగర్భంలో ఉన్న నల్లబండలు, తెల్లబండలు, జిల్లాలో విస్తారంగా ఉన్నాయి. జిల్లాలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు 1724, భారీ పరిశ్రమలు 24, మధ్య తరహా పరిశ్రమలు 8, ప్రధానమంత్రి ఉపాధి పథకం కింద రూరల్‌లో 14 యూనిట్లు, అర్బన్‌లో 21 యూనిట్స్, సింగల్ డెస్క్‌పాలసికింద 300 యూనిట్లు, తెల్లబండలు, నల్లబండలు 50యూనిట్లు పైబడి వుండగా వ్యాపార, వాణిజ్యపరంగా సంస్థలు జిల్లాలో ఓ 10వేల వరకు ఉంటాయి. పరిశ్రమల కారణంగా ప్రభుత్వానికి సంవత్సరానికి దాదాపు రూ.40వేల కోట్లు పైబడే ఆదాయవనరులు ఉన్నాయి. ఈ సంస్థల్లో రెండులక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారు. ప్రస్తుతం జీఎస్టీ ప్రవేశపెట్టడంతో సరుకు రవాణా విషయంలో కానీ, వాటి అమ్మకాలు విషయంలో కానీ వాటిని ఎగుమతి చేసే వ్యవహారంలో కానీ ప్రతి ఒక్కటీ బిల్లులపై లావాదేవీలు జరిపితే తప్ప, వస్తువు అమ్మినవారు కొన్నవారి రశీదులు ట్యాలీ అయితే తప్ప సంబంధిత కంపెనీలకు డబ్బులు రావు. ఒకవేళ బిల్లులేని వ్యాపారం చేస్తే అటువంటివారు పట్టుబడితే జైలుకే. ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్కటీ లెక్కలు రాయలేక, లెక్కలు రాస్తే తమకు ఏమీ మిగలదని కార్మికులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వేతనాలు చెల్లించలేక ఉన్న ఆస్తుపాస్తులతోనే కాలం గడపటం మేలని భావించి పలువురు తమ వ్యాపారాలకు స్వస్తిచెప్పి కంపెనీలు మూతవేస్తున్నారు. దీంతో జీఎస్టీ పుణ్యమా అని వేలాదిమంది కార్మికులు రోడ్డున పడుతున్నారు. ఇదిలా ఉండగా పరిశ్రమలశాఖ అధికారులు, లేబర్ శాఖ అధికారులు ట్రాన్స్‌పోర్టు అధికారులు, రెవెన్యూ అధికారులు, పోలీసులు గతంలో యాజమాన్యాలతో సఖ్యతగా ఉండి నెలసరి మామూళ్లు తీసుకుంటున్న దరిమిలా వారి అక్రమవ్యాపారాలు మూడు పువ్వులు ఆరుకాయలుగా వెలిగేది. ప్రస్తుతం జిఎస్‌టితో మోసాలకు కళ్లెంపడటంతో వ్యాపార సంస్థలు, పరిశ్రమలు, గ్రానైట్ కంపెనీలు, నాపరాయి కంపెనీలు, సున్నపురాయి కంపెనీలు పలువ్యాపార వాణిజ్య కంపెనీలు మూతపడుతున్నాయి. పరిశ్రమలు మూతపడకుండా అధికారులు యాజమాన్యాలకు చైతన్యం తెచ్చి రోడ్డున పడిన కార్మికులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.