అనంతపురం

హోరాహోరీగా టెన్నికాయిట్ ఛాంపియన్‌షిప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కదిరి: మున్సిపల్ పరిధిలోని కుటాగుళ్ల సమీపంలో వున్న బ్లూమూన్ ఇంటర్నేషనల్ పాఠశాలలో జరుగుతున్న అంతర్ జిల్లాల రాష్టస్థ్రా యి టెన్నికాయిట్ పోటీలు ఆదివారం రెండో రోజు హోరాహోరీగా సాగాయి. ఉదయం పోటీలను బ్లూమూన్ విద్యాసంస్థల ఛైర్మన్ శివశంకర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పోటీల్లో చక్కటి ప్రతిభకనబరిచి వారి జిల్లాలకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని క్రీడాకారులకు సూచించారు. రెండో రోజు పోటీల్లో క్వాటర్ ఫైనల్ చేరిన క్రీడాకారులు సుమతి (చిత్తూరు), శే్వత (విశాఖపట్నం), గంగోత్రి (విజయనగరం), వౌనికా (కృష్ణా జిల్లా), సునంద (వెస్ట్ గోదావరి), హేమ మాధురి (శ్రీకాకుళం) ఉన్నారు. అండర్-14 బాలుర విభాగంలో యశ్వంత్ కుమార్ (విజయనగరం), అజంతుల్లా (కృష్ణా జిల్లా), లోకేష్ (నెల్లూరు), త్రిమూర్తులు (గుంటూరు)కు చెందిన క్రీడాకారులు సెమీఫైనల్‌కు అర్హత సాధించారు. గెలుపొందిన విద్యార్థులను ఛైర్మన్ శివశంకర్ అభినందించారు.
పంపనూరు ఆలయంలో శతరుద్రీయ హోమం
ఆత్మకూరు,: మండల పరిధిలోని పంపనూరు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో శ్రావణమాసం చివరి ఆదివారం సందర్బంగా శతరుద్రీయ హోమం నిర్వహించారు. ఈ సందర్బంగా సుబ్రహ్మణ్యేశ్వర, మంజునాథస్వామి, పార్వతీదేవి విగ్రహాలకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి పుష్పార్చన చేశారు. శ్రీవళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరుడి ఉత్సవమూర్తులకు పంచామృత అభిషేకాలు నిర్వహించి శతరుద్రీయ హోమం నిర్వహించారు. శ్రావణమాసం చివరి ఆదివారం సందర్బంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. పూజా కార్యక్రమాలు ముగిశాక భక్తులకు అన్నదాన సమితి ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ రామకృష్ణారెడ్డి, అన్నదాన సమితి అధ్యక్షులు సత్యరంగయ్య, సేవాదళ్ కార్యకర్తలు భక్తులకు అసౌకర్యం కలుగకుండా సేవలు అందించారు.
ఉరవకొండలో భారీ వర్షం
* పొంగిన వాగులు, వంకలు
ఉరవకొండ, : మండలంలోని వివిధ గ్రామాల్లో శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది. దాదాపు 36 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లాయి. మండలంలోని బూదగవి చెరువు మరువ పారింది. ఫలితంగా మండలంలోని చిన్న చిన్న కుంటలు జలకళను సంతరించుకున్నాయి. ఉరవకొండ- హోతూరు రహదారిపై ఉన్న పెద్ద వంక పొంగి ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
వరినాట్లకు సిద్ధమైన రైతులు
మండలంలోని బూదగవి చెరువు మరువ పాలడంతో ఆయకట్టు రైతులు వరినాట్లు వేసేందుకు సిద్ధం అయ్యారు. కొనే్నళ్లుగా నెలకొన్న వర్షాభావంతో వరినాట్లు ఆలస్యంగా వేసుకునే వారు. అయితే ప్రస్తుతం భారీ వర్షం కురవడంతో ఆనందంతో వరినాట్లు వేసుకుంటున్నారు.
ఘనంగా శ్రీకృష్ణ పల్లకి ఊరేగింపు
కొత్తచెరువు,: ప్రబోధ సేవా సమితి ఆధ్వర్యంలో కొత్తచెరువులో ఆదివారం శ్రీకృష్ణుని విగ్రహాన్ని పల్లకిలో వుంచి చేపట్టిన ఊరేగింపు విశేషంగా స్థానికులను ఆకట్టుకుంది. స్థానిక కొత్తచెరువమ్మ గుడి దగ్గర జన్మాష్టమి రోజు ఏర్పాటుచేసిన శ్రీకృష్ణుని విగ్రహాన్ని ఆదివారం ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో వుంచి ఊరేగింపు ఆదివారం మధ్యాహ్నం ప్రారంభించారు. వేలాది మంది భక్తులకు ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహించిన పిదప ఊరేగింపు చేపట్టారు. ఊరేగింపు ముందు భాగాన చిన్నపిల్లలు శ్రీకృష్ణుని వేషధారణలో పలువురిని ఆకట్టుకున్నారు. భక్తులు కోలాటం, భజనలు చేస్తూ రాత్రి పొద్దుపోయే వరకు ఊరేగింపు కొనసాగింది. స్థానికులే కాకుండా జిల్లాలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రబోధ సేవా సమితి సభ్యులు అధిక సంఖ్యలో ఊరేగింపులో పాల్గొన్నారు. ఊరేగింపులో వేలాదిమంది పాల్గొని శ్రీకృష్ణునికి పూలు, పండ్లు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
రోడ్డు భద్రతకు పటిష్ట చర్యలు
* నిబంధనలు ఉల్లంఘించిన 3076 మందిపై కేసులు
అనంతపురం అర్బన్,: రోడ్డు భద్రతలో భాగంగా రెండవ విడత జిల్లావ్యాప్తంగా పోలీసులు చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌లో నిబంధనలు ఉల్లంఘించిన వాహన చోదకులపై ఓవైపు జరిమానాలు మరోవైపు అవగాహనతో ముందుకు దూసుకెళ్తున్నారు. ఎస్పీ అశోక్‌కుమార్ బాధ్యతలు తీసుకోగానే రోడ్డు భద్రతపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. గత వారం చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా హెల్మె ట్ ధరించకుండా వాహనాలు నడిపిన 7151 మంది ని తనిఖీలు సందర్భంగా ఆపి హెల్మెట్ ధరించాలని సూచించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా హెల్మెట్ ప్రాధాన్యతను తెలిపారు. అదేవిధంగా రహదారులపై సీటు బెల్ట్ ధరించని 4,140 మందికి సీల్ట్‌బెల్ట్ ధరించాలని సూచించినట్లు తెలిపారు. వీటితోపాటు సెల్‌ఫోన్ డ్రైవింగ్ 225మంది, త్రిబుల్ రైడింగ్‌లో వెళ్తున్న 871 మంది, కనీసం ఎల్‌ఎల్‌ఆర్ కూడా లేని 1155మంది వాహన చోదకులు, పరిమితికి మించి ప్రయాణికులను తరలించే 624 ఆటోలపై చర్యలు తీసుకొన్నట్లు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా వెళ్లిన వాహనాలు, వాహన చోదకులపై గత వారం స్పెషల్ డ్రైవ్‌లో 3,076 కేసులు నమోదు చేశారు. రహదారులపై ఎక్కడైనా వాహనాలను పార్క్ చేసి ఉన్నా, రోడ్డు ప్రమాదం ఎక్కడైనా జరిగినా తక్షణమే డయల్ 100కు లేదా జిల్లా పోలీసు శాఖ అందుబాటులో ఉంచిన ఫోన్ నంబర్లకు ఫోన్ లేదా వాట్సప్ ద్వారా తెలియజేయాలని ఎస్పీ సూచించారు.

వివాహిత ఆత్మహత్య
చెనే్నకొత్తపల్లి,: నిప్పంటించుకుని ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని చిన్నమొగలాయపల్లి గ్రామంలో ఆదివారం ఉదయం జరిగింది. ఎస్‌ఐ మహమ్మద్ రఫి తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన లక్ష్మిదేవి(48) చాలాకాలంగా వెన్ను నొప్పితో బాధపడుతూ వుండేది. వైద్యం కోసం అనంతపురం తదితర ప్రాంతాల్లో వైద్య చికిత్సలు చేయించుకుంది. వీటితోపాటు లక్ష్మిదేవి భర్త శ్రీనివాసరెడ్డి గత 5 సంవత్సరాల క్రితం మృతి చెందాడు. దీంతో భర్త లేని లోటు, అటు అనారోగ్యం పాలవడంతో మానసికంగా కుంగిపోయింది. ఈ తరుణంలో ఆదివారం తెల్లవారుజామున ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని మృతి చెందింది. మృతురాలి తల్లి వెంకటలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

అనాథ పిల్లల ఆశ్రమానికి బియ్యం వితరణ
అనంతపురం సిటీ,: డాగురే ఫొటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం రాజమునీంద్ర అనాథ పిల్లల ఆశ్రమానికి బియ్యాన్ని వితరణ చేశారు. ఈ సందర్భంగా డాగురే ఫొటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్.గణేష్ మాట్లాడుతూ అంతర్జాతీయ ఫొటో అండ్ వీడియోగ్రాఫర్స్ దినోత్సవ సందర్భంగా అనాథ పిల్లలకు బియ్యం అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, కార్యదర్శి మోహన్, నాయకులు జనార్థన్, రజాక్, కిరణ్, బాషా, షెక్షా, బాబా, రాజు, ఇతర ఫొటోఅండ్ వీడియోగ్రాఫర్స్ పాల్గొన్నారు.
కబడ్డీ టోర్నీ విజేతలు ఎస్‌ఎస్‌బిఎన్, గుంతకల్లు విజేతలు
అనంతపురం సిటీ,: జిల్లా వ్యాప్తంగా పాఠశాలల పరిధిలో జరిగిన కబడ్డీ పోటీల్లో బాలికలు ఎస్‌ఎస్‌బియన్ కాలేజి, బాలుర పోటీల్లో గుంతకల్లు పాఠశాలల విద్యార్థులు విజేతలుగా నిలిచారు. ఆదివారం స్థానిక ఇండోర్ స్టేడియంలో బిజెవైఎం ఆధ్వర్యంలో నిర్వహించిన కబడ్డీ పోటీల ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ పోటీల్లో బాలికలు ఎస్‌ఎస్‌బియన్ కాలేజి విద్యార్థినులు, బాలురులో గుంతకల్లు పాఠశాలల విద్యార్థులు విజేతలుగా నిలిచారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో బిజెపి జిల్లా అంకాల్‌రెడ్డి మాట్లాడుతూ క్రీడలతో శారీరక ధృడత్వం, మాసికోల్లాసం కలుగుతుందని తెలిపారు. కబడ్డీ పోటీల్లో బాగా రాణించిన విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. అనంతరం విజేతలకు బహుమతులను అందజేసారు. ఈ కార్యక్రమంలో సెన్సార్ బోర్డు సెక్రటరీ సందిరెడ్డి శ్రీనివాసులు, బిజెపి రాష్ట్ర నాయకులు ప్రతాప్‌రెడ్డి, బిజెవైఎం జిల్లా అధ్యక్షుడు హరీష్‌రెడ్డి, బిజెవైఎం నాయకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.
ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి
అనంతపురం కల్చరల్,: మాజీ ప్రధాని, కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజీవ్‌గాంధీ జయంతిని డిసిసి కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. డిసిసి అధ్యక్షులు కోటా సత్యం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పిసిసి అధికార ప్రతినిధి కెవి.రమణ, ఇతర నాయకులు, కార్యకర్తలు రాజీవ్‌గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లడుతూ రాజీవ్‌గాంధీ దేశంలో సంస్కరణలు తీసుకువచ్చిన ప్రధాని అన్నారు. ముఖ్యంగా సాంకేతిక విప్లవం, 18 సం.లకే ఓటుహక్కు, గ్రామాలను పరిపుష్టి చేసే 74వ అధికరణ అమలు, నూతన విద్యావిధానం మొదలైనవి తీసుకురావడం ద్వారా దేశాన్ని సంస్కరణల వైపు నడిపించారన్నారు. నేడు మనం సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవడంలో రాజీవ్ చేసిన కృషి మరువలేనివన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొండారెడ్డి, కిరణ్‌కుమార్, వాసు, వశికేరి శివ, హరి, బాబ్‌జాన్ పాల్గొన్నారు.
ఉల్లాసంగా ఆనంద ఆదివారం
అనంతపురం కల్చరల్,: నగరంలో నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఆనంద ఆదివారం ఉల్లాసంగా, ఉత్సాహంగా జరుపుకున్నారు. మొదటి రోడ్డు పొట్టి శ్రీరాములు పాఠశాల ముందు జరిగిన ఆనంద ఆదివారం కార్యక్రమంలో మహిళలు, విద్యార్థులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. వాలీబాల్, త్రోబాల్, మ్యూజికల్ చైర్స్, షటిల్, వైకుంఠపాళీ, టెన్నికాయిట్ మొదలైన క్రీడల్లో పిల్లలు, పెద్దలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ లక్ష్మిరెడ్డి, రమేష్, కృష్ణమూర్తి, డిప్యూటి కమిషనర్ సన్యాసిరావు, సెక్రెటరీ జ్యోతిలక్ష్మి, ఇతర ఉద్యోగులు, ప్రజలు పాల్గొన్నారు. అలాగే సాయి సంస్థ ఆధ్వర్యంలో రాంనగర్‌లోని సురక్ష వృద్ధాశ్రమంలో ఆనంద ఆదివారం కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా వృద్ధులకు అన్నదానం చేయడంతోపాటు వారితో కలసి వారి కష్టసుఖాలను తెలుసుకుంటూ వారికి ఓదార్పును కలిగించేలా కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయసాయి, శారద, కిరణ్‌కుమార్, రామకృష్ణ పాల్గొన్నారు.

జివో 223 తొలగించాలి
అనంతపురం సిటీ,: పాఠశాల సహాయకులకు జూనియర్ లెక్చరర్‌గా పదోన్నతి పొందడంలో అడ్డంకిలా ఉన్న జివో 223ను తొలగించాలని జూనియర్ లెక్చరర్ల ప్రమోషన్స్ సాధన సమితి డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక ప్రభుత్వ బాలుర జూనియర్ కాలేజిలో జూనియర్ లెక్చరర్ల ప్రమోషన్స్ సాధన సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర, జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాల విద్య, మాథ్యమిక విద్య, ఉన్నత విద్యను ఒకే శాఖగా మార్చాలన్నారు. 371ని మార్పు చేసి జిల్లా యూనిట్‌గా లెక్చరర్స్ పదోన్నతులు కల్పించాలని, నియోజకవర్గానికి ఒక డిప్యూటీ డిఇఓ, రెండు ఎంఇఓ పోస్టులను కేటాయించాలని డిమాండ్ చేశారు. జెఎల్ నుండి డిఎల్‌గా పదోన్నతి పొందడానికి అడ్డంకులు తొలగించాలన్నారు. పదోన్నతులు నందు ఉపాధ్యాయులకు నేరుగా నియామకం నందు 70:30 నిష్పత్తిని పాటించాలన్నారు. ఈఎల్‌టిసి కేంద్రాలను పునరుద్ధరించాలని, జిల్లాకు ఐదు డైట్ కళాశాలలను ఇవ్వాలని, ప్రతి మండలానికి ఒక ప్రభుత్వ జూనియర్ కాలేజిని ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల సాధనకై ఉద్యమించడానికి రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు, అధ్యక్షుడిగా గురుమునిక్రిష్ణ, శివశంకరయ్య, గోవిందు, ప్రతాప్‌రెడ్డి, ప్రసాద్, మురళీ, బాషా, అనంతయ్య, ఉపాధ్యాయ సంఘాల నాయకులు బసవరాజు, వెంకరాముడు, వెంకటేసులు, జయరామిరెడ్డి, ప్రభాకర్, రామన్న, కులశేఖర్‌రెడ్డి, నాగేంద్ర, అశోక్, శ్రీ్ధర్‌రెడ్డి పాల్గొన్నారు.
నంద్యాల ఉప ఎన్నికల ఫలితాలు చెంపపెట్టు కావాలి
అనంతపురం అర్బన్,: రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్రానికి ప్రత్యేక హోదాతోపాటు రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ సాధనలో ఘోరంగా విఫలమైన అధికార తెదేపాతోపాటు ప్రతిపక్ష వైయస్‌ఆర్ పార్టీని నంద్యాల ఉప ఎన్నికల్లో ఓడించి చెంపపెట్టులాంటి గుణపాఠం చెప్పాలని ప్రత్యేక హోదా-విభజన హామీల అమలు సాధన సమితి రాష్ట్ర విద్యార్థి విభాగం జెఎసీ అధ్యక్షులు సాకే నరేష్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేఖరుల సమావేశంలో సాకే నరేష్ మాట్లాడుతూ 2014 విభజన అనంతరం రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన ప్రత్యేక హోదా, ప్యాకేజీల సాధనలో పై ఇరు పార్టీలు ప్రజలను మోసం చేశాయన్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేసి గెలవాలని చూస్తున్నాయన్నారు. ఎట్టి పరిస్థితుల్లో నోటుకు ఓటును అమ్ముకోవద్దన్నారు. రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ వచ్చి ఉంటే పరిశ్రమలు వచ్చి ఉండేవన్నారు. దీంతో నిరుద్యోగం తగ్గుముఖం పట్టేదన్నారు. కేంద్రం ఆంధ్రప్రదేశ్‌పై సవతి ప్రేమను చూపిస్తుందన్నారు. మూడు ఈశాన్య రాష్ట్రాలకు ఈ మధ్యనే ప్రత్యేక హోదా ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనతోపాటు ప్యాకేజీ సాధన కోసం మూడేళ్లగా తాము ఎన్నో పోరాటాలు చేయటం జరిగిందన్నారు. ఇప్పటికే నంద్యాల ఉప ఎన్నికల్లో రాయలసీమ అభివృద్ధిని కాంక్షిస్తూ తమ అభ్యర్థిని బరిలో నిలపటం జరిగిందన్నారు. రాయలసీమ వాదాన్ని గెలిపించాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రొఫెసర్ సదాశివరెడ్డి, జిల్లా అధ్యక్షులు సురేష్, కోకన్వీనర్లు పాల్గొన్నారు.