అనంతపురం

తోడేస్తున్నారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుత్తి : మున్సిపాలిటీ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండానే వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకుని యథేచ్ఛగా నీటిని తోడేస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 20 వార్డుల పరిధిలో సుమారు 35కుపైగా వాటర్‌ప్లాంట్లు ఉన్నాయి. వీటిలో కేవలం మూడింటికి మాత్రమే భూగర్భ జల శాఖ, మున్సిపల్, రెవెన్యూ అధికారుల అనుమతులతోపాటు ఐఎస్‌ఐ గుర్తింపు ఉంది. మిగిలిన ప్లాంట్లకు కనీస అనుమతులు లేకుండానే స్థానిక చోటా నేతల అండదండలతో యథేచ్ఛగా ప్లాంట్లు ఏర్పాటు చేసుకుని నీటిని విక్రయిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక ఆర్వో వాటర్‌ప్లాంట్ ఏర్పాటు చేయాలంటే పట్టణానికి కనీస రెండు వందల మీటర్ల దూరంలో ప్లాంటు ఏర్పాటు చేసుకోవాలి, ప్లాంటు ఏర్పాటు చేసుకునే స్థలానికి చుట్టుపక్కల వంద మీటర్ల దూరం వరకూ చేతిపంపులు ఉండరాదు. వీటితోపాటు భూగర్భ జలశాఖ, రెవెన్యూ అధికారుల అనుమతులతోపాటు మున్సిపల్ అధికారుల అనుమతులు పొందాల్సి ఉంది. అయితే పట్టణంలోని అన్ని వార్డుల్లో గల్లీగల్లీకి అనధికారిక ఆర్వో వాటర్‌ప్లాంట్లు వెలిశాయి. ప్లాంట్ల నిర్వాహకులు యథేచ్ఛగా నీటిని తోడుతుండటంతో శుద్ధి చేసే క్రమంలో ప్రతి వంద లీటర్ల నీటిలో డెబ్బై లీటర్లకుపైగా వృథాగా పోతోంది. ఇలా పట్టణంలోని అన్ని వాటర్ ప్లాంట్ల ద్వారా రోజుకు లక్షలాది లీటర్ల నీటిని తోడేస్తున్నారు. అంతేగాకుండా అరకొరగా శుద్ధి చేస్తూ క్యాన్లలో నింపి సందు, సందూ తిరిగి సరఫరా చేస్తున్నారు. కాగా ప్రభుత్వం ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేసి కేవలం రెండు రూపాయలకే 20 లీటర్ల శుద్ధి చేసిన నీటిని సరఫరా చేయాలన్న ఉద్దేశంతో పట్టణంలో ఐదు ప్రాంతాల్లో ఓ సొసైటీ ద్వారా వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. వాటికి అనుబంధంగా అనధికారికంగా పట్టణంలోని వివిధ వార్డుల్లో వాటర్‌ప్లాంట్లు వెలిశాయి. కనీస ప్రమాణాలను పాటించకుండా నీటి వ్యాపారాన్ని కొనసాగిస్తూ ప్రజల ఆరోగ్యానికి హాని కలిస్తున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవడంలో మున్సిపల్, రెవెన్యూ అధికారులు విఫలమయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్లాంట్ల నిర్వాహకులకు వ్యాపారం చేసుకోవడానికి లభ్యం అవుతున్న నీరు.. ప్రజల దాహార్తిని తీర్చడానికి ఎందుకు లభ్యం కావడం లేదో మున్సిపల్ అధికారుల చెప్పాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అనధికార వాటర్‌ప్లాంట్ల నిర్వాహకులపై చర్యలు తీసుకుని పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలని స్థానికులు కోరుతున్నారు. అనధికార వాటర్‌ప్లాంట్ల విషయంపై మున్సిపల్ కమిషనర్ ఇబ్రహీంను వివరణ కోరగా అనధికారికంగా ఆర్వో ప్లాంట్లు కొనసాగుతున్నట్లు ఈ మధ్యనే తమ దృష్టికి వచ్చిందన్నారు. త్వరలో నిర్వాహకులకు నోటీసులు జారీ చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.