అనంతపురం

నిస్వార్థమైన సాయి వైద్యం మార్గదర్శకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుట్టపర్తి : దైవానికి ప్రతిరూపం వైద్యుడు. ప్రాణం పోసేవాడు దైవం అయితే ప్రాణం నిలిపేవాడు వైద్యుడు. అటువంటి మహోన్నతమైన వృత్తిని నిస్వార్థంతో నిర్వహించి పేదల కోసం సేవ చేసి ధన్య జీవితం గడపాలన్న సత్యసాయి సూక్తికి ఆర్యోక్తినిస్తూ వందలాది మంది ప్రముఖ వైద్యుల్లో ప్రేరణ కల్గించిన సత్యసాయి జాతీయ వైద్య సమ్మేళనం వేదికైంది. ఆదివారం 2వ రోజు సత్యసాయి జాతీయ వైద్య సదస్సులో ప్రముఖ వైద్యులు చర్చాగోష్టిలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. భిన్న విభాగాలు, విభిన్న దృక్పదాలు కల్గిన అందరికి సత్యసాయి వైద్యవిధానం ఆదర్శప్రాయమన్న ఏకాభిప్రాయం వ్యక్తపరిచినట్లయింది. పరోపకార పారాయణం, హెల్ప్ ఎవర్, హార్ట్ నెవర్ అన్న సాయి బోధనలు ఆచరణనీయమైన సాయి వైద్య సేవలు ఆయన ప్రత్యక్షంగా అనుసరించి చూపారన్నారు. ఇక్కడ సేవాభావంతో కూడిన వైద్య విధానం ప్రపంచంలో మరెక్కడా లేదని, అందరికి ఆదర్శమైన ఈ వైద్యం తమను విశేషంగా ఆకట్టుకుందన్నారు. సత్యసాయి ఆస్పత్రులు వైద్యాలయాలుగా అలరారుతుండడం అందుకు నిదర్శనమన్నారు. రోగాల్ని నయం చేయడం వైద్యుని విధి అయితే ప్రేమతో సేవ చేయడం పరమావధి అవ్వాలన్నారు. విశిష్ట వైద్యసేవలందించిన సుమారు 40మందికి పైగా వైద్యులకు సత్యసాయి ధన్వంతరి అవార్డులను ప్రధానం చేశారు. ధన్వంతరి అవార్డు విశిష్టతను తెలియజేసే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ విజయ్‌కుమార్, డాక్టర్ మోహన్, ఆలిండియా సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ అధ్యక్షులు మినీష్‌పాండే తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా ట్రస్టు సభ్యులు ఆర్‌జె.రత్నాకర్, ప్రసాదరావు, మినీష్‌పాండే, డాక్టర్ మోహన్, రత్నాకర్ సతీమణి తదితరులు పుస్తకావిష్కరణ చేసి ప్రముఖ వైద్యులకు బహుమతులు, జ్ఞాపికలు అందజేసి వారిని సత్కరించారు.
ఘనంగా ఆంజనేయస్వామి రథోత్సవం
బొమ్మనహాల్, : మండల పరిధిలోని నేమకల్లు ఆంజనేయస్వామి రథోత్సవం ఆదివారం వైభవంగా సాగింది. ఈ సందర్భంగా స్వామివారికి తెల్లవారుజామున 4 గంటలకే ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ప్రతిమను 40 అడుగుల రథంపై కొలువుదీర్చి ఆలయ నిర్వహణాధికారి శ్రీనివాసులు, ధర్మకర్త కాశీవిశ్వనాథ్, తదితరులు కొబ్బరికాయలు కొట్టి రథోత్సవాన్ని ప్రారంభించారు. భక్తుల శ్రీరామనామ స్మరణలతో మేళతాళాలు, బాణాసంచా పేలుళ్లు, డప్పుల మోత మధ్య పురవీధుల గుండా రథోత్సవం సాగింది. ఉదయం 8 గంటలకు తిరిగి రథం ఆలయానికి చేరుకోవడంతో మంగళహారతులు, ప్రత్యేక దీపారాధన, గానాలాపనలు నిర్వహించి స్వామివారి ప్రతిమను ఆలయానికి చేర్చారు. రథోత్సవాన్ని తిలకించడానికి కర్నాటక, ఆంధ్రా ప్రాం తాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. రథోత్సవంలో ఎంపిపి పార్వతి, జడ్పీటీసీ వాణీజగన్నాథరెడ్డి, సర్పంచు హనుమంతరెడ్డి, ఎంపిటిసి పరమేశ్వర, పలుగ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.