కృష్ణ

పోలవరం, పట్టిసీమ సందర్శనకు చంద్రాల గ్రామస్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం,: మండలంలోని చంద్రాల గ్రామానికి చెందిన దాదాపు రెండు వందల మంది ఆదివారం నాలుగు బస్సులలో పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల సందర్శనకు బయలుదేరి వెళ్ళారు. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న పోలవరం ప్రాజెక్ట్, గోదావరి నీటిని కృష్ణానదిలో కలపిన పట్టిసీమ ప్రాజెక్ట్‌ల సందర్శన చేయాలని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సూచన మేరకు తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి రాయల లీలాప్రసాద్ ఆధ్వర్యంలో తెలుగుతమ్ముళ్ళు బయలుదేరి వెళ్ళారు. ఈబస్సులకు లీలాప్రసాద్ జెండా ఊపి ప్రారంభించారు.
విషజ్వరాలతో అల్లాడుతున్న పాములలంక
* ప్రతి ఇంటిలో జ్వరం బాధితులు
* మహిళ మృతితో అప్రమత్తమైన యంత్రాంగం
తోట్లవల్లూరు,: మండలంలోని పాములలంక గ్రామం విషజ్వరాలతో అల్లాడిపోతోంది. రోజు రోజుకి జ్వరం బాధితులు పెరుగుతుండటంతో వైద్య శిబిరం ఉదయం నుంచి సాయంత్రం దాకా రోగులతో కిటకిటలాడితోంది. దీంతో పాములలంకలో ఆదివారం వైద్య సేవలను ముమ్మరం చేశారు. శనివారం నాగరత్నం(56) మృతితో జ్వరం బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు చేపట్టారు. ఆరోగ్య ఉప కేంద్రంతో పాటు ప్రక్కనే ఉన్న అంగన్‌వాడీ కేంద్రంలోను, బయట షామియానా కింద రోగుల చికిత్సలు అందించే సౌకర్యాలను కల్పించారు. ఒకవైపు ప్రభుత్వ వైద్యులు డిప్యూటీ డిఎంఅండ్‌హెచ్‌ఓ సీతమ్మ, డాక్టర్ గోపాలనాయక్, డాక్టర్ విజయరత్నకుమార్, మరోకవైపు ఎన్‌టిఆర్ ట్రస్టు ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజి సిద్దేశ్వరి, విజయ ఎమర్జెన్సీ ఆస్పత్రి డాక్టర్ రాజేష్, ఉయ్యూరు డాక్టర్ కలమ్‌రాజ్, చల్లపల్లి డాక్టర్ జంపాన జయప్రసాద్, చిన ఆవుటపల్లి పిన్నమనేని సిద్దార్థ ఆస్పత్రి డాక్టర్ మరీదు కల్పసాయి రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. జిల్లా మలేరియా ఆఫీసర్ ఆదినారాయణ, తహశీల్దార్ జి భద్రు, ఈఓపిఆర్‌డి అరుణకుమారి, ఆర్‌డబ్ల్యుఎస్ ఏఈ సుబ్బారావు, కార్యదర్శి అశోక్, ఇతర అధికారులు తరలి వచ్చి రోగుల వైద్య సేవల కోసం చర్యలు చేపట్టారు. గత మూడు రోజులతో పోలిస్తే ఆదివారం జ్వరాలు బాధితులు విపరీతంగా పెరకటంతో రోగులు బారులు తీరారు. ప్రతి ఇంటినుంచి జ్వరం బాధితులు వచ్చి వైద్య సేవలు పొందారు. 212 మంది జ్వరాలు, బాడీ పెయిన్స్ బాధలతో వచ్చి చికిత్స చేయించుకున్నారని డాక్టర్ గోపాలనాయక్ చెప్పారు. జ్వరాలు సోకిన వారు నడవలేనంతగా నీరసించిపోవటంతో ఇతరుల సహాయంతో చికిత్స పొందేందుకు రావలసి వచ్చింది. ప్రత్యేక వైద్య శిబిరంలోనే రక్త పరీక్షలు నిర్వహించారు. డెంగ్యూ పరీక్షలు చేయగా ఐదురుగుకి ఎన్‌ఎస్ 1 పాజిటీవ్ వచ్చిందని నాయక్ తెలిపారు. జ్వరం సోకి సీరియస్‌గా ఉన్న నలుర్ని విజయవాడ ప్రభుత్వాస్పత్రికి, ముగ్గుర్ని ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రికి పంపించామని డాక్టర్ నాయక్ తెలిపారు. అక్కడ మెరుగైన చికిత్స అందిస్తారని చెప్పారు. పాములలంకలో జ్వరం బాధితులను ఆదివారం ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన పరామర్శించారు. చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి ధైర్యం చెప్పారు. డాక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం ఇక్కడే అందించేందుకు చర్యలు తీసుకోవటంలో వెనుకాడవద్దని సూచించారు. వైరల్ జ్వరాలు తగ్గిపోతాయని, ప్రజలు భయపడవద్దని కల్పన కోరారు. డాక్టర్లు సూచించినట్టుగా ఎక్కువగా మంచినీరు, పండ్లరసాలు తాగితే జ్వరం బాధల నుంచి కోలుకుంటారని అన్నారు. అనంతరం కల్పన మృతిచెందిన నాగర్నతం కుటుంబసభ్యులను పరామర్శించారు. ఎమ్మెల్యే వెంట రాష్ట్ర ఉపాధిహామి మండలి డైరెక్టర్ వీరంకి వెంకట గురుమూర్తి, మండల టిడిపి అధ్యక్షుడు వీరపనేని శివరాంప్రసాద్, సర్పంచ్ పాముల శ్రీనివాసరావు, ఎంపిటిసి సభ్యుడు మూడే శివశంకర్, నాయకులు బండి శ్రీమన్నారాయణ, చెన్నుపాటి పూర్ణచంద్రరావు, చింతా శ్రీనివాసరావు(రాజా) తదితరులు ఉన్నారు. అలాగే ఎంపిపి కళ్ళం వెంకటేశ్వరరెడ్డి, జడ్పీటీసీ తాతినేని పద్మావతి, మండల వైసిపి అధ్యక్షుడు జొన్నల రామ్మోహన్‌రెడ్డి పాములలంక వచ్చి జ్వరాల బాధితులను పరామర్శించారు. మృతి చెందిన పాముల నాగరత్నం కటుంబసభ్యులను పరామర్శించారు.
నేటి తరం విద్యార్థులు నైపుణ్యం కలిగి ఉండాలి
* ఎపిపిఎస్‌సి చైర్మన్ డా. పి ఉదయ భాస్కర్
గుడ్లవల్లేరు,: నేటి తరం విద్యార్థులు విద్యతో పాటు నైపుణ్యం కలిగి ఉండాలని ఎపిపిఎస్‌సి చైర్మన్ డా. పి ఉదయ భాస్కర్ అన్నారు. స్థానిక గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల 16వ స్నాతకోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డా. ఉదయ భాస్కర్ మాట్లాడుతూ సాంకేతిక నైపుణ్యంపై అవగాహన పెంచుకోవల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. విద్యార్థులు జీవితంలో ఎదగడానికి కొన్ని లక్షణాలు అవసరమన్నారు. అవే క్రమశిక్షణ, సమయపాలన, నిరంతర అభ్యాసం, సేవాభావమన్నారు. సాధన, సృజనాత్మకత విద్యార్థి ప్రగతికి మూలమన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. పి నాగేశ్వరరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి ఉదయ భాస్కర్‌ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డీన్ అకడమిక్ అఫైర్స్ డా. జివిఎస్‌ఎన్‌ఆర్‌వి ప్రసాద్, కళాశాల చైర్మన్ డా. వల్లూరుపల్లి నాగేశ్వరరావు, కరస్పాండెంట్ వల్లూరుపల్లి సత్యనారాయణరావు, కో సెక్రటరీ వల్లూరుపల్లి రామకృష్ణ, అధ్యక్ష, ఉపాధ్యక్షులు సుబ్బారావు, కెవి కృష్ణారావు, అడ్వైజర్ డా. ఎస్‌ఆర్‌కె రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.

వినాయకుని మట్టి ప్రతిమలే వాడండి
మైలవరం,: ప్రతి ఒక్కరూ వినాయకుని మట్టితో చేసిన ప్రతిమలనే వాడాలని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పి లుపునిచ్చారు. ఆదివారం స్థానిక అమరావతి మ హిళా మండలి ఆధ్వర్యంలో ఎస్‌ఎస్‌కే ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ విద్యార్థులచే తయారు చేయించిన వినాయకుని మట్టి ప్రతిమలను ఆయన మహిళలకు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మా ట్లాడుతూ వాతావరణం కాలుష్యం కాకుండా, నీరు కాలుష్యం కాకుండా ఉండేందుకు అందరూ వినాయకుని మట్టి ప్రతిమలు తయారు చేసి వినియోగించాలన్నారు. మట్టి ప్రతిమలను సొంత ఖర్చుతో తయారు చేసి ఉచితంగా పంపిణీ చేస్తున్న అమరావతి మహిళా మండలి సభ్యులను ఆయన అభినందించారు. మహిళామండలి అధ్యక్షురాలు చనమోలు విజయలక్ష్మి మాట్లాడుతూ ఈనెల 24న మండలి ఆ ధ్వర్యంలో వినాయకుని మట్టి ప్రతిమలను స్థానిక పంచాయితీ కార్యాలయం వద్ద ఉచితంగా అందరికీ అందిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి కోయ సుధ, మహిళా మండలి సభ్యురాళ్ళు పాల్గొన్నారు.