కృష్ణ

సెప్టెంబర్ నుండి ‘డయల్ యువర్ కలెక్టర్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం,: సెప్టెంబర్ నెల నుండి ప్రతి సోమవారం డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం ఆదివారం రాత్రి ‘ఆంధ్రభూమి ప్రతినిధి’కి ఫోన్‌లో తెలిపారు. ఆగస్టు నెల నుండే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని తలపెట్టినా ప్రభుత్వ పరంగా కొన్ని ముఖ్య కార్యక్రమాల నిర్వహణ వల్ల డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని ప్రారంభించలేకపోయామన్నారు. సెప్టెంబర్ నెల మొదటి సోమవారమైన 4వతేదీన కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 9గంటల నుండి 10గంటల వరకు డయల్ యువర్ కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రతి సోమవారం ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా 08672-252399 నెంబరుకు ఫోన్ చేసి తెలియచేయవచ్చన్నారు.