విజయవాడ

ఆ చిన్నారి జ్ఞాపకశక్తి అమోఘం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ క్రైం,: సాధారణ జ్ఞానం, గణితం తదితర విషయాల్లో ఇంటర్నెట్‌పై ఆధారపడి చెబుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇందుకు భిన్నంగా ఏడు సంవత్సరంలో చిన్న ప్రాయంలోనే విజ్ఞానం మరియు గణితానికి సంబంధించిన వివిధ అంశాలను అవలీలగా చెప్పి అబ్బురపరిచే జ్ఞాపక శక్తితో ప్రతిభ ప్రదర్శించి, మనిషి మెదడు అత్యంత శక్తివంతమైన ఆయుధంగా చాటి చెప్పిన చిన్నారి హాసినిని ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో జాయింట్ పోలీసు కమిషనర్ బివి రమణకుమార్, సౌత్‌జోన్ ఏసిపి శ్రీనివాసరావు, పోలీసు అధికారులు అభినందించి, సత్కరించడం జరిగింది. పోలీసు కమిషనర్ కార్యాలయం పరిపాలనా విభాగంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న మున్నంగి ఉమాశంకర్ కుమార్తె హాసిని (7) స్థానికంగా 2వ తరగతి చదువుతుంది. చిన్న వయస్సులోనే 194 దేశాల పేర్లు వాటి రాజధానులు, భారతదేశంలో రాష్ట్రాలు వాటి రాజధానులు, ఆంధ్రప్రదేశ్ జిల్లాలు వాటి ప్రధాన కేంద్రాలు, భారతదేశ ప్రెసిడెంట్లు, ప్రధానులు మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు, గవర్నర్లు, ప్రస్తుత రాష్ట్ర మంత్రులు పేర్లు అవలీలగా చెప్పగలుగుతుంది. అలాగే గణితంలో డబుల్ డిజిట్స్ మల్ట్ఫికేషన్, డబుల్ అండ్ త్రిపుల్ డిజిట్స్ ఎడిషన్స్, 150 వరకు స్క్వేర్స్, 3 లక్షల వరకు స్క్వేర్ రూట్స్ చేయగలుగుతుంది. వీటితోపాటు 1901 నుండి 2100 సంవత్సరం వరకు క్యాలెండర్ ఆయా తేదీల్లో వచ్చే వారాల పేర్లు చెప్పడం, బేసి సంఖ్య మ్యాజిక్ స్వ్కేర్స్ మరియు 4 ఇన్‌టు 4 మ్యాజిక్ స్క్వేర్స్, పిరియాడిక్ టేబుల్స్‌లో 118 మూలకాల పేర్లు, వాటి ఎలక్ట్రాన్‌ల అమరికలు చేయడంతోపాటు ఏదైనా ఇచ్చిన 64 పదాలను జ్ఞాపకం ఉంచుకుని అదే వరుసలో రిపీట్ చేయగలుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన బివి రమణకుమార్ చిన్నారి ప్రతిభకు ముగ్ధులై చిన్నారి హాసినికి నాలుగు సింహాల చిహ్నం కలిగిన జ్ఞాపికను అందించి సత్కరించడంతోపాటు చిన్నారికి ప్రోత్సాహం అందించిన తల్లిదంఢ్రులు ఉమాశంకర్, జ్యోతిలకు పుష్పగుచ్ఛం అందించి అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సౌత్‌జోన్ ఏసిపి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

నగర నడిబొడ్డులో బాక్సింగ్ పోటీలు అభినందనీయం
విజయవాడ (రైల్వేస్టేషన్),: నగర పరిసర ప్రాంతాల్లో 20 ఏళ్లుగా కనిపించని బాక్సింగ్ పోటీలు నేడు నిర్వహించడం అభినందనీయమని డెప్యూటీ సూపరింటెండింగ్ ఆఫ్ పోలీస్ లక్ష్మీపతి అభినందించారు. రైల్వే ఇన్‌స్టిట్యూట్‌లో బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కృష్ణాజిల్లా ఓపెన్ మెన్ అండ్ ఉమెన్ బాక్సింగ్ చాంపియన్‌షిప్-2017 పోటీలను ఆదివారం లక్ష్మీపతి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సం దర్భంగా క్రీడాకారులనుద్దేశించి మా ట్లాడుతూ ప్రత్యేక రాజధానిగా ఏర్పడిన నగర నడిబొడ్డులో క్రీడల ప్రాధాన్యత ఎంతో అవసరమన్నారు. అందు కు తమ వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ అందిస్తామన్నారు. ప్రపంచస్థాయిలో గుర్తింపు కలిగిన క్రీడల్లో బా క్సింగ్ ఒకటన్నారు. అటువంటి బాక్సిం గ్ జిల్లాస్థాయి పోటీలు రాజధాని నడిబొడ్డులో ఏర్పాటుచేసిన బాక్సింగ్ అ సోసియేషన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. పోటీల్లో పాల్గొనే వారు క్రీడా స్ఫూర్తితో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. అయితే ఒక్క క్రీడల్లోనే కాకుండా ఏదైనా పోటీల్లో గెలుపు ఓటములు సహజంగా తీసుకోవాలని క్రీడాకారులకు తెలిపారు. అనంతరం జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ కార్యదర్శి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ జి ల్లాస్థాయి పోటీలను ఇక్కడ నిర్వహించడానికి తన వంతు పూర్తి సహాయ సహకారాలు అందించిన రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి, ఏపి ఒలంపిక్స్ సంఘం ప్రధాన కార్యదర్శి, రైల్వే ఇన్‌స్టిట్యూట్ సెక్రటరీ ఆకుల రాఘవేంద్రరావుకు కృతజ్ఞతాభినందన లు తెలిపారు. అలాగే జిల్లాలో బాక్సిం గ్ క్రీడలో మంచి గుర్తింపు కలిగిన క్రీడాకారులున్నారని ఈ సందర్భంగా తెలిపారు. క్రీడా స్ఫూర్తితో ఈ పోటీల ను నేడు చేపట్టడం జరిగిందని, అందు కు తమ ఆహ్వానం మన్నించి ఆహ్వానించిన వారంతా హాజరై తమకు మంచి ప్రోత్సాహాన్నిచ్చిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలుపుకుంటున్నామని ఈ సందర్భంగా ఉమామహేశ్వరరావు పే ర్కొన్నారు. జిల్లాస్థాయిలో ఏర్పాటుచేసిన ఈ పోటీల్లో వెయిటింగ్ కేటగిరీలో 250 మంది బాలబాలికలు పాల్గొన్నారన్నారు. ఇందులో సెమీఫైనల్ అనంతరం జరిగే ఫైనల్ పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులు రాష్టస్థ్రాయిలో జరిగే పోటీల్లో పాల్గొనే అర్హతను పొందుతారన్నారు. చివరగా ఫైనల్‌లో గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రదానోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపి అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి, ఏపి ఒలింపిక్స్ సంఘం ప్రధాన కార్యదర్శి, రైల్వే ఇన్‌స్టిట్యూట్ సెక్రటరీ ఆకుల రాఘవేంద్ర, జిల్లా ఒలంపిక్స్ అసోసియేషన్ కార్యదర్శి అర్జా పాండురంగారావు, బాక్సింగ్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎండి ఖాజా కరీం, తదితరులు పాల్గొన్నారు. కృష్ణాజిల్లా ఓపెన్ మెన్ అండ్ ఉమెన్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో గెలుపొందిన విజేతలను రాఘవేంద్రరావు ప్రత్యేకంగా అభినందించారు.

ప్రతి పోలీసుస్టేషన్‌లో మహిళా రక్ష బృందాలు
పటమట,: మహిళా సమస్యల పరిష్కారం, వారి హక్కుల పరిరక్షణ, సమానత్వం కోసం ప్రతి పోలీసుస్టేషన్ పరిధిలో మహిళా మిత్ర, మహి ళా రక్షక్ బృందాలను ఏర్పాటు చేయ టం జరిగిందని డిసిపి బి.వి.రమణకుమార్ తెలిపారు. బెంజిసర్కిల్ సమీపంలోని వాసవ్య మహిళా మండలిలో ఆదివారం సమాజంలో మహిళా స్వీయ ర క్షణ, జీవన నైపుణ్యాలు, విద్య యొక్క విలువలు అనే అంశాలపై జరిగిన ము గింపు శిక్షణ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన ఆయన మాట్లాడు తూ ప్రతి ఒక్కరూ విలువలతో కూడిన వ్యక్తిత్వాని కలిగి వుండాలని, దానికి గా ను ఆత్మరక్షణ, జీవన నైపుణ్యాలు, విలువలతో కూడిన విద్య, కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్‌షిప్ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు, ఇప్పటికే నగరం లో మహిళల సమస్యల పరిష్కారం కోసం విజయవాడ పోలీసు శాఖ కృషి చేస్తున్నట్లు ప్రజల్లో ఆలోచన మొదలైందన్నారు. ఈ క్రమంలో మహిళా మిత్ర, వృద్ధమిత్ర, బాల మిత్రల ద్వారా పలు కార్యక్రమాలు అమలు చేస్తూ సమాజంలో మార్పు తెచ్చేందుకు ముందు కు సాగుతున్నట్లు చెప్పారు. అనంత రం 4రోజుల పాటు జరిగిన శిక్షణ తరగతులలో భాగంగా మహిళా మిత్ర స భ్యులు, కమిటీ మెంబర్స్‌తో కమిషనర్ రమణకుమార్ వారితో మాట్లాడి మీరు ఏమి నేర్చుకున్నారు అని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వాస వ్య మహిళా మండలి చైర్మన్ చెన్నుపా టి విద్య, లా అండ్ అర్డర్ డిసిపి గజరాజ భూపాల్, డాక్టర్ కీర్తి, జి.రేవతి, ఏసిపిలు నాయుడు, ఎన్.సత్యానందం తదితరులు పాల్గొన్నారు.

కనుల పండువగా శివ కళ్యాణం
పాతబస్తీ,: శ్రావణమాసం సందర్భంగా చిట్టినగర్‌లోని నగరాల శ్రీ మహాలక్ష్మి (కొత్త) అమ్మవారి కళ్యాణ మండపంలో ఆదివారం ఉదయం శివ కళ్యాణ మహోత్సవం కనుల పండువగా జరిగింది. ఆలయంలో శుక్ర, శని, ఆదివారాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు రెంటిచింతల సుబ్రహ్మణ్యశర్మ, నుదురుమాది కృష్ణప్రసాద్ శర్మల పర్యవేక్షణలో శివ కళ్యాణం అత్యంత ఘనంగా నిర్వహించారు. నిత్యపూజ, మండపు పూజల అనంతరం కళ్యాణం మహోత్సవం జరిగింది. మధ్యాహ్నం పూర్ణాహుతి, బలిహరణ పూజలు జరిగాయి. రాత్రి అమ్మవారి ఉత్సవ మూర్తి ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. కోలాటం డప్పుల, మంగళవాయిద్యాల నడుమ అమ్మవారిని ఊరేగించగా పురవాసులు బ్రహ్మరథం పట్టారు. అమ్మవారికి హారతులు పట్టారు. చిట్టినగర్ సెంటర్ నుండి లంబాడిపేట మీదుగా మిల్క్ఫ్యాక్టరీ వరకు ఈ ఊరేగింపు సాగి తిరిగి చిట్టినగర్ చేరుకుంది. ఈ కార్యక్రమంలో ఆలయ పాలకవర్గం అధ్యక్షులు పోతిన బేషు కంఠేశ్వరుడు, పాలకవర్గం సభ్యులు పాల్గొన్నారు.

పటమటలో హాయ్ హాయ్‌గా..
పటమట,: హ్యాపీ సండే కార్యక్రమం విజయవాడ నగరపాలక సంస్ధ ప్రారంభించి ప్రజల నుంచి మంచి స్పందన రావటంతో రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో హ్యాపీ సండే కార్యక్రమాలు నిర్వహించటం ఎంతో సంతోషంగా వుందని జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం అన్నారు. విజయవాడ నగరపాలక సంస్ధ ఆధ్వర్యంలో పటమట పంటకాలువ హైస్కూల్ రోడ్డులో ఏర్పాటు చేసిన ఆనంద ఆదివారం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్, నగరపాలక సంస్ధ కమీషనర్ జె.నివాస్ తదితరులు పాల్గొని హ్యాపీ సండేలో విద్యార్ధులతో కలసి ఆట పాటలతో ప్రజల్లో ఉత్తేజేన్ని నింపారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీకాంతం మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాలతో ఆనంద ఆదివారం నిర్వహించటం వలన స్ధానికంగా వున్న ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొని వారు ఇష్టం వచ్చిన ఆట పాటలతో ఆనందించటం సంతోషదాయకమన్నారు. ప్రజలలో వున్న నైపుణ్యత, కళలు వెలికితీయటానికి ఈ విధమైన కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని అన్నారు. నగరపాలక సంస్ధ కమీషనర్ జె.నివాస్ మాట్లాడుతూ ఇక్కడ ప్రారంభించిన ఆనంద ఆదివారం జిల్లాల్లోని అన్ని మున్సిపాలిటీలలో, పంచాయితీలలో హ్యాపీ సండే నిర్వహించటం అభినందనీయమన్నారు. నగరంలో పలు స్వచ్ఛంద సంస్ధల సహకారంతో నగరంలోని బిఆర్‌టిఎస్ రోడ్డు, యంజి రోడ్డులో నిర్వహించి నేడు ఈ కార్యక్రమాన్ని పటమటలో నిర్వహించటం ఆనందంగా వుందన్నారు. నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్ మాట్లాడుతూ నగరంలోని వివిధ స్వచ్ఛంద సంస్ధల వారు ముందుకొచ్చి హ్యాపీ సండే కార్యక్రమంలో పరోక్షంగా భాగస్వాములై ప్రొత్సహించినట్లయితే మరింత ఉత్సహంతో అన్ని ప్రాంతాలలో హ్యాపీ సండే నిర్వహించవచ్చన్నారు. ప్రజలు ఆహ్లాదకరమైన వాతావరణం కల్గించాలనే లక్ష్యంతో నగరపాలక సంస్ధ కొంత నిధులు ఖర్చు చేయటమే కాకుండా, ట్రాఫిక్‌ను మళ్ళించి రోడ్లపైనే కబాడీ వాలీబాల్, క్రికెట్ వంటి ఆట పాటలతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించటం జరుగుతుందన్నారు. కాగా మార్గమ్ సంస్ధవారు మట్టి వినాయకలను వినియోగించి నగర పర్యావరణాన్ని కాపాడాలంటే మట్టి వినాయక విగ్రహాలను వాడటమే మార్గం అనే నినాదంతో ఏర్పాటు చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది. మద్ది సుబ్బారావు స్కూల్ విద్యార్ధులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్ధులందరికి సర్ట్ఫికెట్‌లను అందచేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, వివిధ కాళాశాలల విద్యార్ధులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

త్రైలోక్యమాత శక్తిని చాటిన త్రయంబకం నృత్య రూపకం
విజయవాడ (కల్చరల్),: ముమ్మనేని సిద్ధార్థ కళాపీఠం ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం సిద్ధార్థ ఆడిటోరియంలో ప్రసిద్ధ నర్తకీమణి షీలా ఉన్ని కృష్ణన్ నృత్య దర్శకత్వంలో ప్రదర్శితమైన త్రయంబకం నృత్య రూపకం త్రైలోక్యమాత శక్తిని చాటుతూ సాగింది. శ్రీ లలితా సహస్రంలోని నామాల వివరణ తెలుపుతూ మూడు వేదాల్లో అమ్మవారిని కీర్తించిన వైనాన్ని తెలుపుతూ దాదాపు రెండుగంటలకు పైబడి చేసిన నృత్య రూపకం ఆద్యంతం అమ్మవారి అవతార విశేషాలను సాక్షాత్కరింపచేస్తూ సాగింది.