విజయవాడ

ఓపెన్ డెఫికేషన్ ... ఫ్రీ..!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్),: బహిరంగ మల, మూత్ర విసర్జన (ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ) రహిత నగరంగా జాతీయ అవార్డు సాధించామంటూ సంబరాలు చేసుకున్న నగర పాలకులు ఆ తరువాత దాని గురించి పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. అవార్డు సాధనకు నగరంలో చేపట్టిన హడావుడి కార్యక్రమాలు నేడెక్కడా కనిపించడం లేదంటే అవార్డుతోనే సరిపుచ్చుకొన్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతుండగా ఆయా చర్యలతోనే నగరంలో ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ సాధించామనుకొంటే పొరపాటేనన్న విషయం వేరే చెప్పనక్కర్లేదు. ఏరు దాటిన తరువాత తెప్ప తగలేసినట్టు, అవార్డు వచ్చిన తరువాత ఆ అంశానే్న పట్టించుకోని వైనం ప్రస్తుతం నగరంలో కనిపిస్తున్న పరిసరాలే నిదర్శనం. అప్పట్లో నగర వ్యాప్తంగా పలు ప్రాంతాలను బహిరంగ మల, మూత్ర విసర్జన ప్రదేశాలుగా గుర్తించి అధికరణం, అక్కడ ఆయా చర్యలను నియంత్రించేందుకు అనేక చర్యలు చేపట్టిన విషయం విధితమే. ఇందులో భాగంగా ఆయా ప్రాంతాలను పరిశుభ్రంగా చేసి అక్కడ ముగ్గులు వేయించి పూలతో అందంగా తీర్చిదిద్దిన అధికారులు ప్రచారంలో భాగంగా పెద్ద చిన్నా హోర్డింగ్‌లు, కరపత్రాలే కాకుండా ‘చెత్త శీను - తోపు శ్రీను’ వేసిన పోస్టర్లు పలు వివాదాలను కూడా రేకెత్తిన విషయం పక్కన పెడితే ప్రస్తుతం అవెక్కడా కనిపించడం లేదంటే ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ చర్యలపై అధికారులతోపాటు, నగర ప్రజాప్రతినిధులకున్న ఆశక్తి ఏమిటో ఇట్టే చెప్పవచ్చు. ఈ చర్యల్లో స్థానిక కార్పొరేటర్లను కూడా ఇన్‌వాల్వ్ చేస్తూ చేపట్టిన విస్తృత ప్రచారం ఎంతగానో ఆకర్షించాయి. ఇదిలావుండగా ప్రజలను చైతన్యపర్చేందుకు నిర్వహించిన ప్రచార కార్యక్రమాలకు అయిన వ్యయం లక్షలు దాటాయి. అంత ఖర్చు చేసి అవార్డు సాధించుకున్న యంత్రాంగం ప్రస్తుతం అవలంభిస్తున్న నిర్లక్ష్యపు విధి నిర్వహణ, బాధ్యతారాహిత్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అప్పట్లో ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ కింద గుర్తించి సమస్యాత్మక ప్రదేశాలు, స్థలాలు నేడు పూర్వ స్థితికి చేరుకొని యథావిథిగా బహిరంగ మల,మూత్ర విసర్జనకు కేంద్రాలుగా మారి అపరిశుభ్రత తాండవిస్తొంది. ఆయా ప్రాంతాల్లో చేపట్టిన నివారణ చర్యలను పర్యవేక్షించేందుకు స్వచ్ఛగ్రహిలను కూడా ఏర్పాటుచేసి వారికి రూ.5వేలను గౌరవ వేతనంగా అందజేశారు. అయితే పథకంతోపాటు ఈ స్వచ్ఛగ్రహీ సిబ్బంది కూడా కాలక్రమంలో కలిసిపోయారు. అప్పట్లో కొంతమందిపై అపరాధ రుసుం కూడా వసూలు చేసి కఠినంగా వ్యవహరించిన పాలకులు నేడు అంతగా పట్టించికోని వైనంపై స్వచ్ఛ భారత్ పథకం అమలు మరుగున పడుతూ రాజధాని నగరంగా చెప్పుకొంటున్న నగరంలో పరిసరాలు దుర్గంధభరితంగా తయారవుతున్నాయి. నగర సుందరీకరణకు కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తున్న నగర పాలకులు బహిరంగ మల, మూత్ర విసర్జన నియంత్రణ లేకుండా సుందరీకరణ ఎలా సాధ్యమవుతుందో వారే చెప్పాలి. ఇప్పటికైనా విఎంసి కమిషనర్ జె నివాస్ స్పందించి ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ చర్యలను మరింత విస్తృత పర్చాలని నగర ప్రజలు కోరుకుంటున్నారు.