విజయవాడ

2018 మార్చిలోపు ఫ్లైఓవర్ పనులు పూర్తికావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ,: దుర్గగుడి ఫ్లైఓవర్ పనులు నిర్థిష్ట ప్రణాళిక ప్రకారం మార్చి 2018లోగా పూర్తయ్యే విధంగా సోమా కంపెనీ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ బి.లక్ష్మీకాంతం అన్నారు. ఆదివారం దుర్గగుడి ఫ్లైఓవర్ నిర్మాణపు పనులను సోమా కంపెనీ ప్రతినిధులు, ఎన్‌హెచ్ ఎస్‌ఇ జాన్ మోషెతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిర్థిష్ట సమయానికి పనులు జరిగే విధంగా సోమా కంపెనీ పనులు మరింత వేగం చేసే విధంగా అవసరమైన సామాగ్రి, అదనపు కూలీలను సమీకరించుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్లైఓవర్ నిర్మాణపు పనులు త్వరితగతిన పూర్తయ్యే విధంగా ఎన్‌హెచ్ అధికారులు పర్యవేక్షించాలన్నారు. రానున్న దసరా ఉత్సవాల నాటికి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా టోల్‌గేట్ వద్ద జరుగుతున్న అండర్ టన్నల్ మార్గంతోపాటు మెట్ల పనులు పూర్తి చేయాలన్నారు. పనులు జరుగుతున్న సమయంలో ట్రాఫిక్, ప్రజలకు ఇబ్బంది లేకుండా పోలీసు అధికారులతో సమన్వయం చేసుకోవాలని సోమా కంపెనీ ప్రతినిధులకు కలెక్టర్ సూచించారు. పనుల పరిశీలనలో ఎన్‌హెచ్ ఇఇ జాన్ మోషె, అర్బన్ తహశీల్దార్ ఆర్.శివరావు, సోమా కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.
బెంజ్‌సర్కిల్ ఫ్లైఓవర్ పనులను పరిశీలించిన కలెక్టర్
బెంజ్‌సర్కిల్ వద్ద దిలీప్ బిల్డ్‌కాన్ చేపడుతున్న ఫ్లైఓవర్ పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేస్తూ ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకుని మరింత వేగవంతం కావాలన్నారు. ట్రాఫిక్‌కు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒకవైపు పనులు నిర్వహించాలన్నారు.