హైదరాబాద్

విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శేరిలింగంపల్లి,: ప్రభుత్వ వసతి గృహాల్లో సన్న బియ్యంతో పాటు సౌకర్యాలు మెరుగుపరిచిన ఘనత తమదేనని శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్‌యాదవ్ అన్నారు. ఆదివారం గోపీనగర్‌లోని బిసి బాలుర హాస్టల్‌ను అధికారులతో కలిసి కార్పొరేటర్ తనిఖీ చేశారు. విద్యార్థుల ఫిర్యాదుతో స్పందించిన కార్పొరేటర్ స్వయంగా వచ్చి పరిశీలించి అక్కడి సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన వంటలు చేయాలని, విద్యార్థులకు అన్ని సదుపాయాలు కల్పించాలని, ఆడుకునేందుకు అవకాశం కల్పించాలని వార్డెన్‌కు కార్పొరేటర్ నాగేందర్‌యాదవ్ సూచించారు. ఇందులో డిఈ రాజ్‌కుమార్, వార్డు సభ్యులు కవిత, పర్వీన్ ఉన్నారు.
నేను సైతం..
హైదరాబాద్,: ప్రజా హితానికి, సామాజిక సేవకు తన వంతుగా ఎంతో కొంత సేవ చేయాలన్న ఉద్దేశంతో వేలాది మంది ఆదివారం నాటి ఎయిర్‌టెల్ హైదరాబాద్ మారథాన్‌లో పాల్గొన్నారు. జయాపజయాలతో సంబంధం లేకుండా, చిన్నాపెద్దా అంతా ఈ మారథాన్‌కు కదిలిరావడం విశేషం. 42.2 కిలోమీటర్ల ఫుల్ మారథాన్, 21.1 కిలోమీటర్ల హాఫ్ మారథాన్, 10 కిలోమీటర్ల రేస్‌తోపాటు 5 కిలోమీటర్ల ఫన్‌రేస్‌ను కూడా నిర్వహించారు. ఫీజు చెల్లించి మరీ సుమారు 20,000కు పైగా ఈ మారథాన్ రన్‌కు హాజరయ్యారు. ఫుల్ మారథాన్ నగరం నడిబొడ్డున ఉన్న హుసేన్‌సాగర్ నుంచి మొదలై, సచివాలయం, రాజ్‌భవన్, తెలంగాణ ముఖ్యమంత్రి అధికార నివాసం, సోమాజిగూడ, పంజాగుట్ట, బంజారాహిల్స్, కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్, జూబ్లీ హిల్స్ మీదుగా సాగి మాదాపూర్ హైటెట్ సిటీ వరకు కొనసాగి, గోపనపల్లిలోని గచ్చిబౌలి స్టేడియం వద్ద ముగిసింది. హాఫ్ మారథాన్ నెక్లెస్ రోడ్డు నుంచి ప్రారంభమైంది. హైటెక్ ఎక్స్‌పో గ్రౌండ్స్ నుంచి 10కె రన్, 5కె ఫన్ రన్ మొదలయ్యాయి.

‘ఆదిలోనే హంస పాదు’లా ‘తడి- పొడి’ చెత్త విధానం

జీడిమెట్ల,: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ‘తడి పొడి’ చెత్త విధానాన్ని ప్రభుత్వం నూతన ఒరవడి ఆరంభించింది. ఈ విధానం ఆదిలోనే హంస పాదు అనే రీతిలో మారింది. తడి పొడి చెత్తను వేరుచేసి వేరువేరు బుట్టలలో వేసేందుకు జిహెచ్‌ఎంసి నుండి లక్షల రూపాయలను వెచ్చించారు. కొన్ని ప్రాంతాలలో తడి పొడి చెత్త విధానంపై అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి చేతులు దులుపుకున్నారు. కేవలం పైపై ప్రచారం తప్ప పూర్తిస్థాయిలో తడి పొడి చెత్త విధానాన్ని అమలు పర్చలేకపోయారు.
గాజులరామారం సర్కిల్ పరిధిలోని గాజులరామారం, జగద్గిరిగుట్ట, చింతల్, సూరారం డివిజన్‌లతో పాటు కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని సుభాష్‌నగర్, రంగారెడ్డినగర్, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల డివిజన్‌లలో తడి పొడి చెత్త విధానం ఎక్కడా కనిపించిన దాఖలాలు లేవు. కనీసం ఉదయం వేళల్లో బస్తీల్లో తిరిగే ఆటో గార్బేజి రిక్షాలలో ఇళ్లల్లో నుండి తరలించే చెత్తను ఏ మాత్రం వేరు చేయకుండా డంపింగ్ యార్డ్‌కు తరలిస్తున్నారు. అధికారుల్లోనే సరైన అవగాహన లేకపోవడంతో తడి పొడి చెత్త విధానాన్ని అమలు పర్చలేకపోతున్నారనే విమర్శలు నెలకొన్నాయి. మురికివాడలలో సరైన అవగాహన కల్పించాల్సిన జిహెచ్‌ఎంసి అధికారులు అసలు అవగాహన మాట దేవుడెరుగు కానీ అసలు చెత్త బుట్టలను పంపిణీ చేయలేకపోయారంటే అధికారుల్లో ఎంతవరకు ఈ విధానం అవగాహన ఉందో అర్థం చేసుకోవచ్చు. కొన్ని కాలనీలు, కొన్ని బస్తీలలో కంటి తుడుపు మేరకు తడి పొడి చెత్త బుట్టలను పంపిణీ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందనే వాదనలు వినిపిస్తున్నాయి. గాజులరామారం, కుత్బుల్లాపూర్ జంట సర్కిళ్లలో అత్యధికంగా మురికివాడల బస్తీలు ఉంటాయి. ఈ బస్తీల్లో తడి పొడి చెత్త విధానం సరైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతో ఉంది. కొన్ని కాలనీలకు మాత్రమే తడి పొడి చెత్త బుట్టలను పంపిణీ చేసి అధికారులు చేతులు దులుపుకున్నారనే ఆరోపణలు లేకపోలేదు. లక్షలాది రూపాయలను వెచ్చించి ప్రభుత్వం తడి పొడి చెత్తను తరలించేందుకు ఆటో రిక్షాలను, చెత్త బుట్టలను కొనుగోలు చేసింది. ఈ విధానాన్ని అమలు పర్చడంలో మాత్రం అధికారులు పూర్తిగా విఫలమయ్యేరనే చెప్పవచ్చు. ప్రభుత్వం స్పందించి తడి పొడి చెత్త విధానాన్ని సరైన రీతిలో ప్రజల్లో అవగాహనను పెంచి అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

రెండు నెలల్లో రామమందిర నిర్మాణం
కాచిగూడ,: ఆయోధ్యలో నిర్మాణ పనులు రెండు నెలల్లో ప్రారంభమవుతాయని విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ కార్యధ్యక్షుడు డాక్టర్ ప్రవీణ్ తొగాడియా అన్నారు. కాచిగూడలోని మ్యాడం అంజయ్యహాల్‌లో ఆదివారం రాత్రి జరిగిన బజరంగ్‌దళ్ శక్తి సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. రామమందిర నిర్మాణానికి పార్లమెంట్‌లో ప్రత్యేక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు. చట్టంతోనే రామమందిరం నిర్మాణం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. దేశంలో గోరక్షణ చట్టం ఉన్నప్పటికీ గోహత్యలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గోరక్షణ చట్టం అమలు చేసే బజరంగ్‌దళ్ కార్యకర్తలను వేధింపులకు గురిచేస్తున్నారని అన్నారు. గోరక్షణ చట్టం దేశంలో ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. జీహద్ పేరుతో దేశంలో దాడులు చేస్తున్న ఉగ్రవాదులను తరమికొట్టాలని, బజరంగ్‌దళ్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ముస్లింల కోసం మైనారిటీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చేసినట్లే హిందూ యువతకు హిందు డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించాలని పేర్కొన్నారు. దేశంలో ఆర్టికల్ 370ని రద్దు చేసి, హిందువులకి నాణ్యమైన విద్యను అందించాలని అన్నారు. సైనికులపై దాడి చేస్తే దేశంపై దాడి చేసినట్లేనని, అలాంటి వారికి బాంబులు, తూటాలతోనే సమాధానం చెప్పాలని పేర్కొన్నారు. సైనికులపై దాడులకు పాల్పడేవారు పాకిస్తాన్ ఎజెంట్లని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. విహెచ్‌పి అంతర్జాతీయ అధ్యక్షుడు గుణంపల్లి రాఘవరెడ్డి, విహెచ్‌పి రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు, ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, బజరంగ్‌దళ్ ప్రాంత సంయోజక్ భానుప్రకాష్, సుభాష్‌చందర్, చంద్రశేఖర్, గోపాల్‌జీ పాల్గొన్నారు.

‘మహాత్ముల దివ్యభాషణములు’ పుస్తకావిష్కరణ
కాచిగూడ,: ప్రముఖ రచయిత జనమంచి చరణ్ రచించిన ‘మహాత్ముల దివ్యభాషణములు’ పుస్తకావిష్కరణ సభ సప్తస్వర మాలిక సాంస్కృతిక సంస్థ, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం గానసభలోని కళాలలిత కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సివిఆర్ ఛానల్ సిఇఓ ఎస్.సుధాకర్ పాల్గొని పుస్తకావిష్కరణ చేశారు. మహాత్ముల చరిత్రలను నేటి యువతరనికి అందించాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. చిన్నతనం నుంచే సాహితీ రంగంల్లో చరణ్ రాణించడం ఎంతో సంతోషకరణమని పేర్కొన్నారు. తెలంగాణ సారస్వత పరిషత్ అధ్యక్షుడు డా.ఎల్లూరి శివారెడ్డి, గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, కళాభిమాని ఎస్‌వి రామారావు, జనమంచి సాంబశివ్, సంస్థ అధ్యక్షుడు ఎస్.మురళీధర్ పాల్గొన్నారు.

‘స్ఫూర్తి’ నృత్య పోటీలు
హైదరాబాద్,: స్ఫూర్తి మ్యూజిక్ డ్యాన్స్ అకాడమీ నూతన సంస్థ ఆవిర్భవించింది. ఆదివారం సాయంత్రం తెలుగు విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ ఆడిటోరియంలో రాష్టస్థ్రాయి నృత్య పోటీలకు సంబంధించి సెలక్షన్‌లు జరిగాయి. నిర్వాహకులు సూర్యనారాయణ మాట్లాడుతూ సోలో డ్యాన్స్, డ్యూయెట్, బృంద నృత్యాలలో సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాలలో పోటీలు ఏర్పాటు చేసామని తెలిపారు. కూచిపూడి, భరతనాట్యం, కథక్, ఆంధ్ర నాట్యం, జానపద నృత్యాలతోపాటు పాశ్చాత్య నృత్యాలలో కూడా పోటీలు జరుగుతాయని చెప్పారు. కొత్త మెమోరియల్ స్కూళ్ల కార్యదర్శి లయన్ కొత్త నాగనాథం జ్యోతిప్రజ్వలనం చేసి పోటీల ఎంపికకు ఆడిషన్ ప్రారంభించారు. కార్యక్రమంలో మందడి కృష్ణారెడ్డి, నృత్య అధ్యాపకురాలు మయూరి రాధ తదితరులు పాల్గొన్నారు. బాలలు, యువతలోని సృజనాత్మక విలువలను వెలికి తీసి ప్రోత్సహించడానికి ఈ పోటీలు నిర్వహిస్తున్నామని సూర్యతేజ చెప్పారు.

రాజీవ్ సేవలు చిరస్మరణీయం
జీడిమెట్ల,: దేశ ప్రజలకు మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ చేసిన సేవలు ఎన్నటికీ చిరస్మరణీయమని కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ అన్నారు. షాపూర్‌నగర్‌లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 73వ జయంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీశైలంగౌడ్ రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కూన మాట్లాడుతూ దేశానికి టెక్నాలజీని తీసుకువచ్చిన ఘనత రాజీవ్‌గాంధీదే అన్నారు. బడుగు, బలహీనవర్గాల ప్రజల కోసం రాజీవ్ అహర్నిశలు శ్రమించి సేవలందించారని చెప్పారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని ప్రతిఒక్కరు ముందుకు నడవాలని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు లక్ష్మారెడ్డి, శ్రావన్, శ్యామ్, శ్రీనివాస్‌రెడ్డి, సాయిప్రతాప్, బషీర్ పాల్గొన్నారు.
మల్కాజిగిరి: మాజీ ప్రధాన మంత్రి రాజీవ్‌గాంధీ సేవలు చిరస్మరణీయమని మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గం ఇన్‌చార్జి నందికంటి శ్రీ్ధర్ అన్నారు. ఆదివారం రాజీవ్‌గాంధీ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని మల్కాజిగిరి సర్కిల్ ఇన్‌చార్జి జీడి శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో మల్కాజిగిరి చౌరస్తాలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి శ్రీ్ధర్ ముఖ్యఅతిథిగా పాల్గొని రాజీవ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జీడి శ్రీనివాస్‌గౌడ్, గుత్తిరాంచందర్ (చందు), కాంగ్రెస్ నాయకులు లింగారెడ్డి, శ్రీనివాస్, డివిజన్ ఇన్‌చార్జిలు ఆంథోని, వేణునాయుడు, చిందం శ్రీనివాస్, గౌస్, పూర్ణచందర్, ఎండి ఆలీ, వి.శ్రీనివాస్‌గౌడ్, రాములు, డి.శ్రీనివాస్ పాల్గొన్నారు.
మిర్జాల్‌గూడలో..
రాజీవ్‌గాంధీ జయంతిని పురస్కరించుకోని గౌతంనగర్ డివిజన్ పరిధిలోని మిర్జాల్‌గూడ్‌లో తెలంగాణ పిసిసి కార్యదర్శి బి.సురేష్ యాదవ్ పాల్గొని రాజీవ్‌గాంధీ విగ్రహనికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ నిర్మాణంలో రాజీవ్ నిర్వహించిన ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందన్నారు. కాంగ్రెస్ నాయకులు జిఎస్.కృష్ణ, ఆనంద్‌గౌడ్, జెనిగ అశోక్ యాదవ్, రాజు యాదవ్, ఎం.శంకర్‌గౌడ్, యాదగిరి పాల్గొన్నారు.
మేడ్చల్: దివంగత ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ దేశానికి చేసిన సేవలు చిరస్మణీయమని పలువురు నాయకులు కొనియడారు. మేడ్చల్ పట్టణంలోని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆ పార్టీ నాయకులు రాజీవ్‌గాంధీ 73వ జయంతి సందర్భంగా చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి ఘననివాళి అర్పించారు. పలువురు నేతలు మట్లాడుతూ దేశంలో సాంకేతిక విప్లవం రాజీవ్ చలువేనన్నారు. యువతకు 18 సంవత్సరాలకే ఓటు హక్కుతో పాటు ఎన్నో సంస్కరణలు చేపట్టి దేశాభివృద్ధికి ఏనలేని కృషి చేశారని పేర్కొన్నారు. బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషి మరువలేనిదన్నారు. రాజీవ్ ఆశయ సాధనకు ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త పాటుపడాలని వారు పిలుపునిచ్చారు. మండల పార్టీ అధ్యక్షుడు వరదారెడ్డి, నాయకులు సంజీవరెడ్డి, రాగజ్యోతి, బాలమల్లేశ్, జకట మల్లేశ్, దేవ తదితరులు పాల్గొన్నారు.
ఘట్‌కేసర్: భారతదేశాన్ని శాస్త్ర సాంకేతిక రంగంలో అభివృద్ధి పరిచి ప్రపంచ దేశాలకు ధీటుగా నిలిపిన మహానీయుడు దివంగత ప్రధాని రాజీవ్‌గాంది అని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేముల మహేష్‌గౌడ్ అన్నారు. రాజీవ్ జయంతి సందర్భంగా ఆదివారం మండల కేంద్రంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. దేశంలో కమ్యూనికేషన్ సేవలను చిన్న గ్రామాలకు సైతం విస్తరింపచేసినట్లు చెప్పారు. ప్రపంచ దేశాలను కుగ్రామాలకు సైతం దగ్గర చేసిన ఘనత రాజీవ్ దేనన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషిచేసి దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచినట్లు తెలిపారు. ఆయన ఆశయాల సాధనకు ప్రతిఒక్కరు కృషిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాల్‌రెడ్డి, అబ్దుల్ ఖయ్యూమ్, మెరుగు నరేష్, సుధాకర్‌రెడ్డి, అనిత, సలీమ్, సురేష్, రహిముద్దీన్, మక్బుల్ తదితరులు పాల్గొన్నారు.
కీసర: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ చేసిన సేవలు మరువలేనివని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎం.నరేందర్ రెడ్డి అన్నారు. రాజీవ్‌గాంధీ జయంతిని పురస్కరించుకొని దమ్మాయిగూడలోని రాజీవ్‌గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కాంగ్రెస్‌తోనే దేశ సుస్థిరత సాధ్యమని చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జి.ఆంజనేయులు గౌడ్, సురకంటి శ్రీకాంత్ రెడ్డి, బాబు యాదవ్, రాములు, బి.రమేశ్ గుప్తా పాల్గొన్నారు.
షాద్‌నగర్: సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుకుబాటులోకి తీసుకురావడంతోపాటు దేశానికి రాజీవ్‌గాంధీ సేవలు మరువలేనివని, పేద ప్రజల అభ్యున్నతి కోసం పెద్దపీట వేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్‌రెడ్డి కొనియాడారు. ఆదివారం రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా ఫరూఖ్‌నగర్ మండలం దేవునిపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. షాద్‌నగర్ ముఖ్యకూడలిలో, గంజ్‌లో రాజీవ్‌గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ దేశ అభివృద్ధి కోసం దివంగత మహానేత రాజీవ్‌గాంధీ ఎన్నో సంస్కరణలు అందుబాటులోకి తీసుకువచ్చారని గుర్తు చేశారు. పేద ప్రజల అభివృద్ధియే లక్ష్యంగా సంక్షేమ పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందని పేర్కొన్నారు. ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని, రైతు శ్రేయస్సును పూర్తిగా విస్మరించాయని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో పంటలు నష్టపోయిన రైతులకు సకాలంలో నష్టపరిహారం ఇచ్చి ఆదుకుందని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్‌కి బలమైన క్యాడర్ ఉందని, 2019 ఎన్నికల్లో విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారే తప్పా ఏ ఒక్క ప్రాజెక్టును పూర్తిస్థాయిలో నిర్మించిన దాఖలాలు ఎక్కడ లేదని వివరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడంతోపాటు రైతులకు సాగునీరు, తాగునీరు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. షాద్‌నగర్ పురపాలక సంఘం చైర్మన్ అగ్గనూరి విశ్వం, ఎంపిపిలు బుజ్జి బాబు నాయక్, శివశంకర్ గౌడ్, వైస్ ఎంపిపి నరేందర్ రెడ్డి, మండలాల అధ్యక్షుడు కట్టా వెంకటేష్ గౌడ్, కృష్ణారెడ్డి, జంగ నర్సింలు, సురేందర్ రెడ్డి, నేతలు గడ్డం శ్రీనివాస్, కొంకళ్ల చెన్నయ్య, పి.చెన్నయ్య, రాజేందర్ రెడ్డి, విజయ్‌కుమార్, ఐటిఐ రాజు, మురళిమోహన్, అప్పి, వన్నాడ ప్రకాష్ గౌడ్, బాబర్‌ఖాన్, శంకర్, జగదీశ్వర్, ఒగ్గు కిశోర్, రాంరెడ్డి, కుమారస్వామి, రాములు గౌడ్, ఆశన్న గౌడ్ పాల్గొన్నారు.
షాద్‌నగర్ రూరల్: దివంగత మాజీ ప్రధాన మంత్రి రాజీవ్‌గాంధీ 73వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో ఉన్న రాజీవ్‌గాంధీ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్‌రెడ్డితోపాటు కాంగ్రెస్ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరై పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఫరూఖ్‌నగర్ మండలం లింగారెడ్డిగూడ గ్రామంలో కాంగ్రెస్ నాయకులు రాజీవ్‌గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. కార్యక్రమంలో మేరాజ్, గిరి, మహేందర్, గణేష్, యాదయ్య, శ్రీకాంత్, చందు, సురేష్, అశోక్ పాల్గొన్నారు.
కొత్తూరు: కొత్తూరు, నందిగామ ముఖ్యకూడలిలలో రాజీవ్‌గాంధి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. రాజీవ్‌గాంధీ చేసిన సేవలను కొనియాడారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు జంగ నర్సింలు, ఎంపిపి శివశంకర్ గౌడ్, మాజీ సర్పంచ్ సుదర్శన్ గౌడ్, సింగిల్ విండో చైర్మన్ రాంరెడ్డి, వైస్ చైర్మన్ కుమారస్వామి గౌడ్, డైరెక్టర్ విరమోని సిద్దు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కరోళ్ల సురేందర్, రవీందర్, మేకగూడ విఘ్నేశ్వర్ రెడ్డి, ప్రభు, యాదయ్య, మల్లేష్‌గౌడ్ పాల్గొన్నారు.
ఆమనగల్లు: అమనగల్లు, కడ్తాల్ మండలల్లో ఆదివారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాన మంత్రి రాజీవ్‌గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయా మండల కేంద్రల్లో రాజీవ్‌గాంధీ విగ్రహానికి , చిత్రపటానికి ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డితో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పూలమాల వేసి నివాళి అర్పించారు. ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి మాట్లాడుతూ దేశ ప్రధానిగా రాజీవ్‌గాంధీ ఎనలేని సేవలు అందించారని, సేవలు చిరస్మరణీయమని చెప్పారు. కార్యక్రమంలో ఎంపిటిసి అయిల శ్రీనివాస్ గౌడ్, మాజీ జడ్పీటిసి శ్రీనివాస్ రెడ్డి, నాయకులు ఖాదర్, ఖలీల్, మైసయ్య పాల్గొన్నారు.
వికారాబాద్: దేశంకోసం ప్రాణాలర్పించిన ఘనత దివంగత ప్రధాని రాజీవ్‌గాంధీదేనని నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్లపాటి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. ఆదివారం రాజీవ్‌గాంధీ 73వ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 సంవత్సరాల వయస్సున్న యువతీ, యువకులకు ఓటు హక్కు కల్పించి, దేశ అభివృద్ధిలో అవకాశం కల్పించారని చెప్పారు. దేశంలో కంప్యూటరైజేషన్, ఐటి రంగంలో మనదేశం అగ్రభాగంలో ఉండటానికి కారణం రాజీవ్‌గాంధీ అని తెలిపారు. గరీబీ హఠావో నినాదంతో దేశంలో పేదరిక నిర్మూలనకు నడుం బిగించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్లమెంటు ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ ముదిరాజ్, నియోజకవర్గ ఉపాధ్యక్షుడు ఎంఎస్ సుభాన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శులు మతిన్, కిశోర్‌కుమార్, బందయ్య, వెంకట్‌రెడ్డి, మహ్మద్, విజేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
చేవెళ్ల: పేద బడుగు బలహీన వర్గల అభివృద్ధికి రాజీవ్ గాంధీ ఎంతో కృషి చేశారని కాంగ్రెస్ నేత, డిసిసి మాజీ అధ్యక్షుడు వెంకట స్వామి, చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ వెంకటేశం గుప్త, ఆలూరు పిఎసిఎస్ చైర్మన్ పటోళ్ల కృష్ణారెడ్డి అన్నారు. రాజీవ్ గాంధీ జయంతిని పురష్కరించుకొని ఆదివారం చేవెళ్లలోని కాంగ్రెస్ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో రాజీవ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ వీరేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్‌లు నారాయణ, మల్లేష్, కాంగ్రెస్ నాయకులు మాధవ రెడ్డి, అనీల్ ఉన్నారు.
రాజేంద్రనగర్: దేశానికి రాజీవ్‌గాంధీ సేవలు చిరస్మరణీయమని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యాక్షురాలు అబ్ధేషి సదాలక్ష్మి, రాజేంద్రనగర్ నియోజకవర్గం అర్బన్ ఇన్‌చార్జి సానెం శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆదివారం మైలార్‌దేవ్‌వపల్లి డివిజన్‌లో డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు డి.రమేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాజీవ్‌గాంధీ జయంతి కార్యక్రమాలను నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులతో కలసి రాజీవ్‌గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. దేశానికి సాంకేతికంగా అనేక సేవలను గాంధీ అందించారని అన్నారు. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక సాంకేతికంగా అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు అరుణ్ కుమార్, సంజయ్, ఎన్‌కె శంకర్, బొల్ల వెంకటేష్, కార్తీక్ ముదిరాజ్, రాజేష్, మేకల వెంకటేష్, సాయిరెడ్డి, కె.లక్ష్మమ్మ, వజ్రమ్మ, ఎస్.విజయలక్ష్మి, సబితారెడ్డి, కె.సుధాకర్, కృష్ణారెడ్డి, ఉదయ్‌కిరణ్, శంకర్, నర్సింహా పాల్గొన్నారు.
బాలాపూర్: మాజీ ప్రధాన మంత్రి రాజీవ్‌గాంధీ సేవలు చిరస్మరణీయమని, నేడు మన దేశం సాకేంతిక రంగంలో ఇంతగా రాణించడానికి కారణం రాజీవ్ గాంధీ అని రంగారెడ్డి జిల్లా ప్లానింగ్ కమిటి సభ్యులు, బడంగ్‌పేట్ నగర పంచాయతీ కాంగ్రెస్ ప్లోర్ లీడర్, నాదర్‌గూల్ 13వ వార్డు కౌన్సిలర్ కొనియడారు. ఆదివారం రాజీవ్ 73వ జయంతి సందర్భంగా.. నాదర్‌గూల్ బస్టాండ్‌లో శ్రీశైలం యాదవ్ ఆధ్వర్యంలో, కాంగ్రెస్ నాయకులు రాజీవ్ చిత్రపటానికి పూలమాలలు వేసి, కేక్ కట్ చేసి, పేదలకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యాతం మాట్లాడుతూ.. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, మన దేశంలో ఐటి రంగాన్ని అభివృద్ధి చేయటానికి చాలా కృషి చేసారని, దీంతో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి లభించిందని గుర్తుచేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు యల్చల మమత సుదర్శన్‌రెడ్డి, మంజుల కుమార్‌గౌడ్, జగన్‌మోహన్‌రెడ్డి, సి హెచ్.వెంకట్‌రెడ్డి, బి.కృష్ణ, కోటగిరి జంగయ్య, ఎం.సురేందర్, పి.జగన్‌మోహన్‌రెడ్డి, వై.వెంకటేష్ యాదవ్, ఎం.శ్రీ్ధర్ పాల్గొన్నారు.
కొడంగల్: రాజీవ్‌గాంధి జయంతిని కొడంగల్‌లో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో రాజీవ్‌గాంధి చిత్రపటానికి పూల మాలాలు వేసి ఘన నివాళి అర్పించారు. యూత్ కాంగ్రెస్ తాలుక అధ్యక్షుడు కృష్ణంరాజు మాట్లాడుతూ దేశానికి రాజీవ్ గాంధీ చేసిన సేవలను కొనియాడారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రాములు, సాయిలు, శ్రీను, నసీర్, అనిల్, రమేష్ పాల్గొన్నారు.