హైదరాబాద్

ఇంకెన్నాళ్లీ అవస్థ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద ధర్మాసుపత్రి ఉస్మానియా..శతాబ్దాల చరిత్ర..నిజాం హయాం నుంచి ప్రజలకు వైద్యం అందిస్తోంది. అయినా ప్రభుత్వాలు మారినా, పాలకులు మారిన పరిస్థితిలో మార్పు రావటం లేదు. ప్రతిరోజు వేలాది మంది ఇక్కడకు వైద్యం కోసం వస్తుంటారు. కార్పొరేట్ వైద్యం చేయించుకునే స్తోమత లేక అపస్మారక స్థితిలోనైనా, అత్యవసర పరిస్థితుల్లోనైనా కొండంత అండగా వచ్చే పేదలకు ఇక్కడ నిరాశే మిగులుతోంది. ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్యకు తగిన విధంగా సౌకర్యాలు లేకపోవటంతో తామూ చేసేదే లేదని వైద్యులంటున్నారు.
ఆసుపత్రిలో శానిటేషన్ మొదలుకుని ఐసియూ వార్డులు, ఆపరేషన్ థియేటర్లు సైతం సమస్యలకు నిలయంగా మారాయి. కొన్ని వార్డుల్లోనైతే కనీసం లైట్లు కూడా లేవు. చీకటిలో జూనియర్ వైద్యులు తమ సెల్‌ఫోన్‌లోని టార్చిలతో వైద్యం చేయాల్సి దుస్థితి నెలకొంది. లిఫ్టు ఉన్నా, అది అలంకారప్రాయంగానే మారింది. ఇక కొన్ని విభాగాలకు చెందిన ఐసియూ విభాగాల్లో ఇరవై మంది రోగులున్నా, వారిలో అవసరమైన వారందరికీ ఆక్సిజన్ అందించే అవకాశం లేకుండాపోయింది. ఇతర ప్రభుత్వాసుపత్రులకు ఆదర్శంగా నిలవాల్సిన ఈ ఆసుపత్రిలో రోగులకు కనీస వైద్యం కరవైంది. వైద్యులు సరైన వైద్యం అందించకపోవటం వల్లే రోగులు చనిపోతున్నారంటూ పక్షం రోజుల క్రితం జూనియర్ డాక్టర్లపై మృతురాలి బంధువులు దాడికి పాల్పడి ఘటన తెలిసిందే! ఉన్న అరకొర వసతుల మధ్య తాము ఎంతో అంకితాభావంతో రోగులకు సేవలందించే విధంగా విధులు నిర్వర్తించేందుకు అనుకూలమైన వాతావరణం లేకుండాపోయిందని, తమకు స్పెషల్ సెక్యూరిటీ ఫోర్సుతో భద్రత కల్పించాలని జూనియర్ వైద్యులు డిమాండ్ చేశారు. అత్యవసర విభాగం మినహా మిగిలిన విభాగాల్లో వారు విధులు బహిష్కరించటంతో వారితో వైద్యాధికారులు చర్చలు కూడా జరిపి, ఓ కమిటీని నియమించారు. కమిటీ నివేదిక ఇచ్చి రోజులు గడుస్తున్నా, ఇంత వరకు వరకు డిమాండ్ నెరవేరనేలేదు. ఇలాంటి సమస్యలే గాంధీ ఆసుపత్రిలో నెలకొన్న తరుణంలో ఆ ఆసుపత్రిని తరుచూ గవర్నర్ నరసింహన్, వైద్యారోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి సందర్శించి సమస్యలను పరిశీలించారు. ఫలితంగా కొద్దిరోజుల క్రితం ప్రత్యేక ఐసియూ వార్డు ప్రజలకు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే! ఇదే తరహాలో గవర్నర్, మంత్రి ఉస్మానియా ఆసుపత్రిని సందర్శిస్తే కొంత వరకు సమస్యలు పరిష్కారమవుతాయని రోగులు, వారి బంధువులు వాపోతున్నారు. ఉస్మానియా ఆసుపత్రికి కొత్త భవనాలను నిర్మించి, సేవలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.