రివ్యూ

భయపెట్టిన కామెడీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

** ఫర్వాలేదు **ఆనందో బ్రహ్మ
తారాగణం: తాప్సీ, శ్రీనివాసరెడ్డి, వెనె్నల కిశోర్, తా.రమేష్, షకలక శంకర్, రాజీవ్ కనకాల, విజయచందర్, ప్రభాస్ శ్రీను, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి
సంగీతం: కె
కెమెరా: అనీష్ తరుణ్ కుమార్
నిర్మాతలు: విజయ్ చిల్లా, శశిదేవిరెడ్డి
రచన, దర్శకత్వం: మహి వి.రాఘవ

‘ఆనందోబ్రహ్మ’ అన్న పేరు వినగానే ఎనభై దశకాల్లో హాస్యనటుడు స్వర్గీయ ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో హైదరాబాద్ దూరదర్శన్‌లో బహుళ ప్రచారం పొందిన టివి ఎపిసోడ్స్ గుర్తుకువస్తాయి. ఇప్పుడొచ్చిన ‘ఆనందోబ్రహ్మ’ చిత్రంలోనూ పేరుకు తగ్గట్టు ఆనందాన్ని అందివ్వడానికి చేసిన వివిధ విన్యాసాలున్నా, అప్పటి ఆనందోలాగానే అన్ని రకాల కామెడీ గల్పికలూ ఇందులోనూ గుదిగ్రుచ్చారు. అయితే రెండింటి ప్రధాన జోనర్‌లూ వేరు. ఈ ఆనందో.. సున్నిత హాస్యానికి ఎక్కువ, మోటు హాస్యానికి తక్కువ అన్నట్టు తయారైంది.
మలేషియా నుంచి వచ్చిన రాము (రాజీవ్ కనకాల) ఇండియాలోని తన ఇల్లు అమ్మేయాలని అనుకుంటాడు అందుకు కారణం తన తల్లిదండ్రులు ఉత్తరాఖండ్ వరదల్లో మరణించడం, తానిక ఇండియాలో ఆ బెంగతో ఉండలేనన్న నిశ్చయానికి వచ్చేయడం. కానీ ఆ ఇంట్లో దయ్యాలున్నాయన్న పుకార్లవల్ల మార్కెట్ రేటుకన్నా చాలా తక్కువగా ఆఫర్లు వస్తాయి. దయ్యాలు లేవని నేను నిరూపిస్తాను అని సిద్ధు (శ్రీనివాసరెడ్డి) తన స్నేహితుల బృందం (వెనె్నల కిషోర్, తాగుబోతు రమేష్, షకలక శంకర్)తో ఆ ఇంటిలో దిగుతాడు. మరి దయ్యాలు ఆ ఇంట్లో ఉన్నాయా? ఉంటే వాటి కథేమిటి? చివరకు ఏమైంది అన్నవాటి సమాధానాలతో సినిమా చివరకొచ్చేస్తుంది. సినిమా బాగోగుల విషయాన్ని ప్రస్తావించుకునేముందు, చిత్ర ప్రచారానికీ, వాస్తవానికీ ఎంత అంతరముందో ఒక్కసారి గమనిద్దాం. మనిషికి దయ్యాలంటే భయమెందుకు? మనుషులే దయ్యాన్ని భయపెడతారు ఇందులో.. అని ప్రధానంగా ప్రచారాల్లో చెప్పారు. కానీ వాస్తవంగా చిత్రంలో దయ్యాల్ని ఎదుర్కోవడానికి వచ్చిన సిద్ధూ ట్రూప్ అంతా మనుషులుగా మామూలు పరిస్థితుల్లో ఉన్నప్పుడు దయ్యాల జోనర్‌లో వచ్చిన అన్ని చిత్రాల్లోలాగానే భయపడతారు. కేవలం వారు అసాధారణ స్థితికి, అంటే ఓ ట్రాన్స్‌లోకి వెళ్లినపుడే ఆయా వ్యక్తులు దయ్యాల్ని భయపెట్టినట్లు చూపారు. ఇది ఎంతవరకు చిత్ర ప్రకటనల ప్రామిస్‌ని నిలబెట్టుకున్నట్లో దర్శకుడే చెప్పాలి. ఇక ప్రథమార్థంలో ఎవరు దయ్యాలో, ఎవరు మనుషులో అన్న సంగతిపట్ల ఆడియెన్స్‌కి క్లారిటీ కలగదు. అసలు చిత్ర ప్రథమార్థం అంతా పాత్రల ఎస్టాబ్లిష్‌మెంట్‌కీ, సిద్ధూ గ్యాంగ్ ఫ్లాష్‌బ్యాక్‌లకే సమయం వినియోగమైపోయింది. ఇక రెండవ భాగం మొత్తాన్ని సినిమా పేరు ఆనందో...ని సార్థకం చేయడానికి డైరెక్టర్ మహి వి.రాఘవ అష్టకష్టాలు పడ్డాడు. ఈ పడటంలో ఆయన తీసుకున్న స్వాతంత్య్రానికి ఆకాశమే హద్దు అనడం కూడా చిన్నమాటే! ఎందుకంటే ఏ సన్నివేశమూ తర్కానికి కాదు కదా ఊహించడానికే చాలా కష్టంగా అనిపిస్తుంది ఆడియెన్స్‌కి. ఉదాహరణకి తల్లిదండ్రులతో బాటు అనాథ యువతి (తాప్సి), మరో బాలికను రాము చంపేసినా దానిపై ఏరకపు అనుమానమూ, విచారణ అన్న ఊసులూ ఎక్కడా కనపడవు. పోనీ అలా ఒక్కమాటుగా గుపనంతో చంపేసిన రాము ఏమన్నా చెయ్యి తిరిగిన హంతకుడా అంటే అదీ కాదు. అలాగే సిద్ధు విషయంలో చెప్పిన రివర్స్ ఎమోషన్ ఎంతవరకూ అపసవ్య గుండె రోగుల్ని ఆదుకుంటుందో అన్నదానికి శాస్ర్తియంగా సినిమాలో తగిన రీతిలో చెప్పలేదు. కేవలం ఓ డాక్టర్‌తో సీన్లో మాటవరసకే అనిపించేశారు. ఇటువంటి ప్రధాన ప్రతిబంధక కథా కేంద్రాన్ని విస్మరించి మిగతా అంశాలను చూస్తే పబ్లిసిటీలో అంతా తానై నిలిచిన తాప్సీకి సినిమాలో అంతగా తావులేని రీతిలోనే పాత్రనిచ్చారు. ఉన్నంతమేరకు అందంగా కన్పడింది. చెప్పుకోదగ్గ రీతిలో నటనా పటిమను ప్రదర్శించింది. వెనె్నల కిషోర్, షకలక శంకర్ ముఖ్యంగా సంభాషణలు తక్కువున్నా కేవలం సంజ్ఞలతో భావప్రకటనతో తనకిచ్చిన రేచీకటి, వినికిడి లోపం ఉన్న పాత్రని అద్భుతంగా పండించారు. దయ్యాల పక్కనే నిల్చుని చూస్తున్న సీన్‌లో అయితే వెనె్నల కిషోర్ నటన ఆకట్టుకుంది. ఒకప్పుడు సిట్యుయేషన్‌తో కూడిన ఇమిటేషన్ చేసి స్ఫూఫ్‌లకు గట్టి ఊపుతెచ్చిన దివంగత ఎం.ఎస్.నారాయణ తర్వాత ఆ లోటును ఎవరు భర్తీ చేస్తారన్న ఆలోచనకు బాబు పాత్ర ధరించిన షకలక శంకర్ ఇందులో సమాధానమిచ్చాడు. కేవలం చిరంజీవి, పవన్‌కళ్యాణ్, బాలకృష్ణ, అపరిచితుడు విక్రమ్ తదితరాలను మక్కీకి మక్కీ అనుకరించడమే కాక సినీయేతరులైన కె.ఎ.పాల్, రామ్‌దేవ్‌బాబాలను అచ్చుగుద్దినట్లుగా తనలో చూపించేశాడు. అలాగే శ్రీనివాసరెడ్డి, తాగుబోతు రమేష్, ప్రభాస్ శ్రీను పాత్రల్లో ఒదిగిపోయారు. తనికెళ్ల భరణి మాణిక్యం పాత్రలో, పోసాని పోలీసధికారి పాత్రలో తమకలవాటైన బాణీల్లో నటించారు. సుధీర్‌బాబు సినిమా హీరోగా ఓ సీన్లో తళుక్కున మెరిశాడు. ‘ఇండస్ట్రీలో గొడుగు వేసుకోకుండా అడుగు ముందుకు వేయకూడదు’, ‘మనిషికి ఉన్నది, మాకు లేనిది ఒక్కటే భయం..’ వంటి డైలాగులు అక్కడక్కడ అలరించాయి. ఇలాంటి చిత్రాలలో పాటలు పెట్టి ఇంకా సమయం వృధా చేయడమెందుకని భావించే ఒరవడి ఇందులోనూ పాటించారు. ఒక్క రీమిక్స్ సాంగ్ ‘నా మది నిన్నుకోరింది..’ (ఎన్టీఆర్ నటించిన ఆరాధన చిత్రంలోనిది) మొదట్నించి చివరివరకూ మనల్ని హంట్ చేస్తూ వుంటుందీ చిత్రంలో. అయితే సంగీత దర్శకుడు కె మాత్రం నేపథ్య సంగీతంతో చిత్రానికి తగిన మూడ్‌నివ్వడంలో చేసిన కృషి బాగుంది. అనీష్ ఛాయాగ్రహణానికి మంచి అవకాశం లభించింది. సినిమా ఎలా తీయాలా అని తలలు కొట్టుకునేవారికి సినిమా ఇలా కూడా తీసేయచ్చు అన్న భరోసాని ఆనందోబ్రహ్మ ఇట్టే కల్పించేసింది.

-అనే్వషి