Others

ముచ్చట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాతవే కావొచ్చు. తెలిసినవే అయ ఉండొచ్చు. కానీ పాత సినిమా సంగతులు కనిపించిన ప్రతిసారీ చదవాలనిపిస్తుంది. గుర్తు చేసుకోవాలని అనిపిస్తుంది. అవునా.. అలా జరిగిందా? అనిపించే విషయాలను ఏదోక సందర్భంలో పదిమందితో పంచుకోవాలని అనిపిస్తుంది. అలాంటివే ఇవి.

1. కె.వి.రెడ్డి దర్శకత్వం వహించిన అన్నపూర్ణావారి తొలి చిత్రం ‘దొంగరాముడు’లో కీలక విషయాన్ని రాబట్టడానికి ఆర్.నాగేశ్వరరావుని ఆటపట్టిస్తూ సావిత్రి పాడే పాట ‘రావోయి మా ఇంటికి’. ఈ పాటలో వినిపించిన మాటలు, నవ్వులు ఆర్ నాగేశ్వరరావువి కావు. అచ్చంగా ఆయనలా మాట్లాడి మెప్పించింది క్యారెక్టర్ నటుడు మద్దాలి కృష్ణమూర్తి. ఆయన ఇదే చిత్రంలో ఇన్స్‌పెక్టర్ పాత్రలో కనిపిస్తారు.
2. విజయావారి ఆల్‌టైమ్ క్లాసిక్ ‘పాతాళ భైరవి’లో తోటరాముడు మాంత్రికుని తల నరికినపుడు మొండెం గిలగిలా తన్నుకునేలా చిత్రీకరించారు. దీనికి అప్పటి సెన్సార్ అభ్యంతరం చెప్పడంతో -సన్నివేశానికి బదులుగా గుడిగంటలు మోగే సన్నివేశాన్ని చూపించి మెప్పించగలిగాడు దర్శకుడు.
3. ‘పెద్ద మనుషులు’ ‘దొంగరాముడు’, ‘రాజమకుటం’ ‘పూజాఫలం’ ‘గుండమ్మకథ’, ‘నాదీ ఆడజనే్మ’ ‘్భక్త ప్రహ్లాద‘ ‘లేతమనసులు’, ‘చదరంగం, ‘రంగులరాట్నం’ ‘రాముడు భీముడు’ ‘యమగోల’ ‘కోడలు దిద్దిన కాపురం’ ‘యుగంధర్’ వంటి గొప్ప చిత్రాలకు బుల్లెట్లను మరింపించే మాటల్ని అందించిన డివి నరసరాజు (దాట్ల వెంకట నరసరాజు) ఒకే ఒక పాటను రాశారు. అది 1975లో విడుదలైన ‘మావూరి గంగ’ చిత్రంలోనిది. ఆ పాట
బ్రాంది తాగినోడు బ్రహ్మదేవుని కొడుకు
విస్కీ తాగినోడు విష్ణుమూర్తి కొడుకు
సారా తాగినోడు సాంబమూర్తి కొడుకు
ఏమీ తాగనోడు వెధవనాకొడుకు
డివి నరసరాజు దర్శకత్వం వహించిన ఒకే ఒక చిత్రం ‘కారుదిద్దిన కాపురం’(1986). నటించిన ఒకే ఒక చిత్రం ‘చెవిలో పువ్వు’ (1990).
4. సంజయ్‌దత్, సల్మాన్‌ఖాన్, మాధురీ దీక్షిత్‌లతో నిర్మించిన హిందీ మ్యూజికల్ హిట్ ‘సాజన్’ని తెలుగులో పురుష పాత్రల్ని స్ర్తి పాత్రలుగా, స్ర్తి పాత్రల్ని పురుష పాత్రలుగా మార్చి రమ్యకృష్ణ, మధుబాల, రాజశేఖర్‌లతో కె రాఘవేంద్రరావు తీసిన చిత్రం ‘అల్లరి ప్రియుడు’. అదేవిధంగా ‘రాముడు భీముడు’ని స్ర్తి పాత్రలుగా మార్చి జిపి సిప్పీ హేమమాలినితో హిందీలో ‘సీతా ఔర్ గీతా’ తీశారు. దీనే్న ‘గంగ మంగ’గా విజయా సంస్థ తెలుగులో నిర్మించింది. అనిల్‌కపూర్ ‘కిషన్ కన్హయా’ చలం ‘బుల్లెమ్మా బుల్లోడు’ చిత్రాలు కూడా ‘రాముడు భీముడు’ ఇన్స్పిరేషన్‌తో నిర్మించినవే.
5. పి.పుల్లయ్య దర్శకత్వం వహించిన ఎన్‌టిఆర్ హీరోగా నటించిన ‘రేచుక్క’ (1954) చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు గెస్ట్‌రోల్ చేసారు. అంజలీదేవి పాల్గొన్న ‘ఎటు చూసిన బూటకాలే యెవరాడినా నాటకాలే’ పాట సన్నివేశంలో వ్యాపారిగా కన్పిస్తారు. దేవిక తొలి చిత్రం ఇదే. టైటిల్స్‌లో స్వంత పేరు ప్రమీల కనిపిస్తుంది.
6.సావిత్రి తొలి చిత్రం ‘సంసారం’ (1950). ఈ చిత్రంలో హీరోయిన్ స్నేహితురాళ్ల మధ్య కనిపిస్తుంది. ‘పాతాళ భైరవి’లో మాయామహల్ దృశ్యాలలో ‘నేరానంటే రాను’ అంటూ నృత్యం చేస్తుంది. ‘శాంతి’ (1952)లో పేకేటి శివరామ్ పక్కన, ‘పెళ్లి చేసి చూడు’ (1952)లో జోగారావు పక్కన వేషాలు వేసింది. ‘చంద్రహారం’ (1954)లో దేవకన్యగా, ‘వదిన’ (1955)లో వాంప్ పాత్ర ధారిణిగా కనిపించడం విశేషం. ఎన్టీఆర్‌తో తొలిసారిగా నటించిన చిత్రం ‘పల్లెటూరు’ (1952). అక్కినేని ‘దేవదాసు’తో ఆమె నట జీవితం మలుపు తిరిగింది. తెలుగువారి మరుపురాని నటి అయింది.

-పూజారి నారాయణ