Others

సీతమ్మ అందాలు.. (నాకు నచ్చిన పాట)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1995 జూలై 13న విడుదలైన ‘శుభసంకల్పం’ సినిమాలోని ‘సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు’ అనే పాట ఎంతో స్వచ్ఛంగా వుంటుంది వింటూంటే. శ్రీకోదండపాణి ఫిల్మ్ సర్క్యూట్ సమర్పణలో ఎస్‌పి బాలు నిర్మించిన చిత్రమిది. కె.విశ్వనాథ్ దర్శకత్వం, ఎం.ఎం.కీరవాణి సంగీతం, పి.సి.శ్రీరాం కెమెరా నిర్వహణ. చిత్రంలోని పాటను చిత్ర, శైలజ పాడారు. వేటూరి రాసిన ఈ పాటలో ఆమనికి ఎస్‌పి శైలజ, ప్రియారామన్‌కు కెఎస్ చిత్ర పాడారు. 4 నిమిషాల 59 సెకన్ల పాటువుండే పాటలో నటీనటుల హావభావాలు ముఖాల్లో పలికించిన తీరు అద్భుతం. కమల్‌హాసన్, విశ్వనాథ్, ఆమని, ప్రియారామన్‌లు సహజాతి సహజంగా జీవించారు. ఇప్పటికీ మ్యూజికల్ నైట్స్‌లో, ఆర్కెస్ట్రాల్లో పాడుతూనే వున్నారీ పాటను. శైలజకు నంది బహుమతి తెచ్చిందీ సినిమానే. తొలిసారి సినిమా చూసిన వెంటనే మరోసారి సినిమాకు వెళ్లేలా చేసిందీ పాట. విశ్వనాథ్ నటించిన మొదటి చిత్రం. గొల్లపూడి మాటలు క్లుప్తంగా అనిపిస్తూనే కన్నీళ్లు పెట్టించాయి, మనసును కదిలిస్తాయ. హృదయాల్ని పట్టి పిండేసిందీ చిత్రం. జాతీయ స్థాయి నటుడు కమల్ ఎందుకయ్యాడో, కాశీనాథునికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఎందుకొచ్చిందో ఇలాంటి సినిమాలు చూస్తే బోధపడుతుంది. ఆర్థికంగా అంత విజయం సాధించకున్నా, సంగీతపరంగా సూపర్‌హిట్. విశ్వనాథ్ స, శ సెంటిమెంట్ విమర్శకుల ప్రశంసలందుకొన్నది.

-కె విజయచంద్ర, కావలి